Suryaa.co.in

Andhra Pradesh

బియ్యపు రెడ్డి, పెద్దిరెడ్డిని, ద్వారంపూడిని ఎందుకు మార్చలేదు?

-బట్టలిప్పిన(గోరంట్ల మాధవ్) అతన్ని కూడా ఎక్కడికి పంపాడో అర్థంకాలేదు
-జగన్ పాలనలో బీసీల ఊచకోత
-బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తాం
-తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
-జయహో బీసీ ప్రచార ప్రారంభం
-ఒక్కో పార్లమెంట్ కు 2 రథాలు

ఒక నాయకున్ని తయారు చేయడం కష్టం..కానీ ఆ నాయకున్ని దీర్ఘకాళికంగా సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం పార్టీల బాధ్యత. 42 ఏళ్లుగా యనమల రామకృష్ణుడు పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నా. ఎర్రన్నాయుడుకు కేంద్రంలో మంత్రిగా కూడా చేశారు.

జగన్ పాలనలో బీసీల ఊచకోత
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 300మంది బీసీలను పొట్టనబెట్టుకన్నారు..టీడీపీకి చెందిన 74 మంది కార్యకర్తలను దారుణంగా చంపేశారు. ఒక్క పల్నాడులోనే 16 మందిని చంపారు. మాచర్లలో జై జగన్ అని అంటే వదిలేస్తామని చంద్రయ్యను బెదిరిస్తే ప్రాణంపోయినా అనను అంటే గొంతుకోసి ప్రాణాలు తీశారు. నా కుటుంబ సభ్యుడిని కోల్పోయానని బాధపడ్డా…చంద్రయ్య పాడె మోశాను. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అవినీతి, అరాచకంపై పోరాడిన నందం సుబ్బయ్య చంపేశారు..ఈ ఎమ్మెల్యేను ఎందుకు మార్చలేదు..ఎందుకు మార్చలేవు.? మిగతావాళ్లు అయితే మార్చేవాడు.

బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తాం..నా బీసీల జోలికి వస్తే ఆ రోజే వారి పనిపడతాం. 54 సాధికార కమిటీలు వేశాం..వారి ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయండి..టీడీపీ వచ్చాక వారిని మరింత ఆదుకునే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. 42 ఏళ్లుగా బీసీలకు టీడీపీ చేసినదానికంటే వచ్చే 5 ఏళ్లలోనూ ఎక్కువ ప్రయోజనం చేకూర్చి మీ రుణం తీర్చుకుంటాం. విదేశీ విద్య, బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లు, స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లు, స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తే అన్నింటినీ తేసేశారు. ఏ కులమైనా, ఏమతమైనా, ప్రాంతమైనా బాగుపడాలంటే అక్కడి వ్యక్తుల రాజకీయంగా పైకి వస్తే చైతన్యం పెరుగుతుంది.

పేదరికం లేని సమాజమే నా ఆలోచన
అంచలంచెలుగా బీసీలకు పెద్దపీఠ వేసింది టీడీపీ..బీసీలను అంచలంచెలుగా వేధించింది వైసీపీ. జగన్ మాటలు కోటలు దాటుతాయి..చేష్టలు గడప దాటని నీతిలేనిది వైసీపీ. క్షేత్రస్థాయిలోకి వెళ్లినప్పుడు బీసీల్లో పలుకుబడి ఉన్నవాళ్లను పిలిచి వారి ఆలోచన తీసుకోండి. పేదరికం లేని సమాజమే నా ఆలోచన. పేదలు ఎక్కువగా ఉండేది బీసీ వర్గాలలోనే. పది రూపాయలు ఇచ్చి వంద లాగేసుకోవడం జగన్ చేసే పని..పది రూపాయలు ఇచ్చి వంద సంపాదించేలా చేసేది నేను నా మనస్థత్వం. తెలివి కొందరి సొంతం కాదు. ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం సంపాదించేవారు తెలుగువాళ్లు..దానికి కారణం తెలుగుదేశం నాడు వేసిన పునాది.

ప్రతి వ్యక్తిని పేదరికం నుండి ఎందుకు తీసుకురాకూడదన్నదే పీపీపీపీ(పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్షిప్) విధానం. సమర్థవంతమైన నాయకత్వం మీ ఇంటికి కూడా ఆస్తిగా మారతుంది. వంద రోజులు పార్టీకోసం, రాష్ట్రం కోసం, వెనకబడిన వర్గాల కోసం పని చేయండి. మీమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. సమర్థులను పైకి తీసుకొచ్చే విధంగా నేను చూసుకుంటాను.’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.

జయహో బీసీ ప్రచార రథాలు ప్రారంభం
జయహో బీసీ ప్రచార రథాలను పార్టీ కార్యాలయం వద్ద జెండా ఊపి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 25 పార్లమెంట్లుకు గాను ఒక్కో పార్లమెంట్ కు 2 రథాల చొప్పున ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బీసీ నేతలు పర్యటించి బీసీలకు టీడీపీ గతంలో ఏం చేసింది..మళ్లీ అధికారంలోకి రాగానే ఏం చేయబోతోంది..బీసీలకు జగన్ చేసిన అన్యాయాన్ని గురించి క్షేత్రస్థాయిలో వివరించనున్నారు.

LEAVE A RESPONSE