Suryaa.co.in

Andhra Pradesh

బీసీలు టీడీపీ వెంట ఉన్నారనే జగన్ అక్కసు

– చెల్లుబోయిన …జగన్ చిన్నాన్న పాదాల దగ్గర కూర్చుని బలహీన వర్గాల పరువు తీశాడు
– కోడిగుడ్డు అమర్నాథ్ కు టికెట్ కూడా ఇవ్వలేదు
– రాష్ట్రం నలుదిక్కులనూ విజయసాయి, వేమిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి , సజ్జలకు జగన్ రాసిచ్చాడు
– 160 స్థానాలకు పైగానే తెలుగుదేశం గెలవబోతోంది
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

2024 ఎన్నికల్లో 160 స్థానాలకు పైగానే తెలుగుదేశం గెలవబోతోంది. జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బడుగు,బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీనే . బీసీలు టీడీపీ వెంట ఉన్నారనే అక్కసుతో జగన్ రెడ్డి దండయాత్ర చేస్తున్నాడు. బీసీలను రాజకీయంగా అణగతొక్కేందుకు రిజర్వేషన్లు 20 శాతానికి తగ్గించిన జగన్ రెడ్డి పెద్ద దగాకోరు. జగన్ రెడ్డి ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ పదవులు నాలుక గీసుకోడానికి కూడా పనికిరావు. కార్పొరేషన్ల ద్వారా బడుగుల్లో ఒక్కరికైనా రుణం ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను.

మంత్రి చెల్లుబోయిన …జగన్ చిన్నాన్న పాదాల దగ్గర కూర్చుని బలహీన వర్గాల పరువు తీశాడు. కోడిగుడ్డు అమర్నాథ్ కు టికెట్ కూడా ఇవ్వలేదు. రాష్ట్రం నలుదిక్కులనూ విజయసాయి, వేమిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి , సజ్జలకు జగన్ రాసిచ్చాడు. జగన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికే ఎమ్మెల్యే , ఎంపీ టికెట్లు ఇస్తూ బడుగు, బలహీన వర్గాలను అణగతొక్కుతున్నాడు. సబ్ ప్లాన్ నిధుల దారిమళ్లింపు, ఆదరణ పథకాలను రద్దు చేసిన జగన్ రెడ్డి బీసీ ద్రోహి.

జగన్ రెడ్డి అరాచక పాలనపై ప్రశ్నించినందుకు నన్ను 75 రోజులు జైల్లో పెట్టాడు. యనమల, అయ్యన్న సహా ఎందరో నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించిన జగన్ రెడ్డిని సాగనంపాల్సిందే. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే తమ బతుకులు బాగుపడతాయని ప్రజలు భావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారందరికీ అవకాశాలు కల్పిస్తాం. జగన్ రెడ్డి పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తాం. ప్రతి పార్లమెంటు పరిధిలో జయహో బీసీ సభలు పెడతాం. చంద్రబాబు, లోకేష్ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం.

పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ..
టీడీపీ పుట్టిందే బీసీల కోసం. ఎన్టీఆర్ పార్టీ పెట్టకముందు బీసీల్లో సామాజిక, ఆర్దిక, రాజకీయ ఎదుగుదల లేదు. టీడీపీ ఏర్పడక ముందు బీసీలు పెత్తందారీ విధానానికి లోనయ్యేవారు. బీసీలు ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగితే పెత్తందారులకు రాజకీయ మనుగడ ఉండదన్న భావన ఉండేది. గతంలో బీసీలకు సంక్షేమ పధకాలు, రాజకీయాల్లో భాగస్వామ్యం ఉండేది కాదు. ఇవన్నీ గమనించి ఎన్టీఆర్ పార్టీ పెట్టి బీసీల్ని, రాజకీయంగా, ఆర్దికంగా, సామాజికంగా ప్రోత్సహించారు. బీసీల్లో నాయకత్వ లక్షణాలు తీసువచ్చింది ఎన్టీఆర్. నేడు బీసీల్ని చంద్రబాబు నాయుడు అన్ని విధాల ఆదుకుంటున్నారు.

సమాజంలో మార్పుకు నాడు ఎన్టీఆర్ చేసిన పోరాటం వల్లే ఆర్దికంగా, రాజకీయంగా, సామాజకింగా బీసీల్లో మార్పు వచ్చింది. ఎన్టీఆర్, చంద్రబాబు టీడీపీ వల్లే మనం తలెత్తుకుని తిరగగలుగుతున్నాం. నేడు జగన్ రెడ్డి పెత్తందారి పాలన సాగిస్తున్నారు. పెత్తందారి పాలనను అంతమెందించేందుకు బీసీలు నడుం బిగించాలి. సమాజంలో 50 శాతం పైగా ఉన్న జనాభాను అణిచివేయాలని జగన్ రెడ్డి చూస్తున్నారు. ప్రతి సంక్షేమ పధకంలో బీసీలకు 20 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్ దే.

ఈ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరగదు. జగన్ రెడ్డి స్వార్దం కోసం పనిచేస్తుంటే …చంద్రబాబు నాయుడు సమాజం కోసం పని చేస్తున్నారు. జగన్ రెడ్డి లాంటిఅవినీతి పరుడు, దోపిడి దారుడు ఈ సమాజానికి పనికిరాడు. అంబేద్కర్ రిజర్వేషన్ల వల్లే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగింది. వైసీపీ నేతలు రాష్ట్రంలో ఉన్న సందపను దోచుకుంటున్నారు, వాటిని దోచుకోవటం వల్లే మనం పేదలుగా మిగిలిపోతున్నాం. టీడీపీ అధికారంలోకి వస్తేనే బీసీల అభివృద్ది, టీడీపీని రక్షించుకోవాల్సిన భాధ్యత బీసీలదే.

పొలిట్ బ్యూరో సభ్యులు, బీసీ సాధికార సమితి రాష్ట్ర అద్యక్షులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..
తెలుగుదేశం పాలనలో బీసీల అభివృద్ధి, అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు వేశాం. జగన్ రెడ్డ వచ్చాక నిధులు లాక్కున్నాడు. విధులు లాక్కున్నాడు. అధికారాలు దూరం చేశాడు. పదవుల్లో రెడ్డలను పెట్టి బీసీలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. వందలాది మంది ప్రాణాలు తీశాడు. చేతి వృత్తులు చేసుకునే వారిని ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే.. జగన్ రెడ్డి వారి జీవితాలను రోడ్డున పడేశాడు. రూ.75 వేల కోట్లు దారి మళ్లించాడు. నామినేటెడ్ పదవులు, పనుల్లో మనకు అవకాశాలు లేకుండా ఒకే వర్గానికి దారాదత్తం చేస్తున్నాడు.

చదువులు దూరం చేస్తున్నాడు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు నాశనం చేశాడు. రాజకీయంగా అవకాశాలు తొక్కి పెట్టాడు. బీసీలను జగన్ రెడ్డి కుటుంబ పెద్దల ముందు మోకరిల్లేలా చేస్తున్నాడు. రాష్ట్రాన్ని ఐదుగురు రెడ్లకు దారాదత్తం చేసి బడుగు బలహీన వర్గాల వారిపై పెత్తనం చెలాయిస్తున్నాడు. ఇలాంటి జగన్ రెడ్డిని పరిగెత్తించేలా బీసీలు పని చేయాలన్నారు. అనంతరం ‘జయహో బీసీ’ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు వివరించారు.

వచ్చే 40 రోజుల్లో దాదాపు 962 మండలాల్లో బీసీ కులాలను కలిసి ముందుకు వెళ్లాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలోని ప్రతి బీసీ వ్యక్తినీ కలిసి వారి సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ…
తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. మనందరికి ఇది పుట్టినిల్లు. మనకోసమే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినట్లుగా ఉంటుంది. బీసీల సంక్షేమం తో పాటు అనేక పదవులతో పాటు మెరుగైన భాగస్వామ్యాన్ని టీడీపీ అందించింది. ఎన్టీఆర్ వేసిన బలమైన బీసీ పునాదులను మరింత బలోపేతం చేస్తూ, మరింత మంది బీసీ నాయకులు రాజకీయాల్లో ఎదిగేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రలో దాదాపు అన్ని బీసీ సామాజిక వర్గాలను కలుసుకొని, మనస్సు విప్పి మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాలను చూపెడతానని హామీనిచ్చారు.

టీడీపీ ప్రతి అడుగులోను బీసీల గుండె చప్పుడు ఉంటుంది. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఉత్తరాంధ్ర వైవీ సుబ్బారెడ్డి, కోస్తా ప్రాంతం విజయసాయిరెడ్డి, రాయలసీమ పెద్దిరెడ్డిని రాసిచ్చారు. కాని చంద్రబాబు గారు ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు, కోస్తా ప్రాంతంలో యనమలకు, రాయలసీమ కేఈ కృష్ణమూర్తి వంటి వారికి ప్రాధాన్యం ఇచ్చి బీసీ నాయకత్వాన్ని పెంచడం జరిగింది. నేడు 4 రెడ్ల చేతుల్లో రాష్ట్రం నాశనం అవుతుంది. చంద్రబాబు గారు బీసీ నాయకత్వాన్ని ప్రతి జిల్లా, పార్లమెంట్ లోను పెంచారు.

కీలకమైన నిర్ణయాల్లో బీసీల నాయకుల్ని భాగస్వామ్యులుగా చేశారు. క్షేత్ర స్థాయిలో బీసీల నాయకత్వాన్ని కలిగించేందుకు ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో 1987లొ 20 శాతం రిజర్వేషన్లు చేస్తే దానిని చంద్రబాబు 34 శాతం పెంచారు. 20 ఏళ్లకు ఒక సారి బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ వస్తున్నాం. 2000 సంవత్సరంలో విశాఖలో జరిగిన మహానాడులో స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు పెంచే తీర్మానం చేశాం. జగన్ రెడ్డి 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి దాదాపు 16,800 పదవులను బీసీలకు దూరం చేశారు. బీసీలకు సంబంధించి నిర్ణయాలు ఎన్ని మీకు తెలుసో వైసీపీ బీసీ నాయకులు సమాధానం చెప్పాలి.

కేవలం ప్రతిపక్ష నాయకులను తిట్టేందుకు మాత్రమే జగన్ రెడ్డి బీసీలను అడ్డం పెట్టుకుంటున్నారు. చాలా మంది బీసీ మంత్రులకు జగన్ రెడ్డి టికెట్టు ఇవ్వడం లేదు. నెంబర్ 2గా ఉన్న పెద్దిరెడ్డి గనులు దోచుకుంటున్నారు. పెద్ది రెడ్డిని మార్చే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? రెడ్లు ఎంత అవినీతి చేసినా జగన్ రెడ్డి చూస్తూ ఉంటారు. అదే బీసీలను చెత్తను తీసేసినట్లు తీసేస్తున్నారు. 56 బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారు. ఒక్కరిరికి సబ్సిడీ లోన్లు ఇవ్వలేదు. పీజీ విద్యలో బీసీలకు రాయితీలను రద్దు చేశారు.

తెదేపా రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ..
బీసీలకు అగ్రపీఠం వేసిన పార్టీ తెలుగుదేశం. వెనకబడిన కులాలకు రాజ్యాధికారం తీసుకొస్తామంటూ జగన్ రెడ్డి గాలిమాటలు చెబుతున్నారు. బీసీ ఓట్లతో అధికారం చేపట్టిన జగన్ రెడ్డి బీసీలకు చేసింది సున్నా. 56 కార్పొరేషన్లు పెట్టారు నాలుగేళ్లలో నాలుగురు బీసీలకు లోన్లు ఇవ్వలేదు. జగన్ రెడ్డి పాలనలో బీసీ స్టడీ సర్కిళ్లు మూతబడ్డాయి. విదేశీ విద్య దూరమైంది. ఆధరణ పథకం ఆనవాలు కనుమరుగైంది.

వైకాపా ప్రభుత్వంలో మంత్రి పదవుల్లో ఉన్న బీసీ నాయకులకు అధికారాలు లేవు. టిడిపి ప్రభుత్వంలో టిటిడి, ఆర్.టి.సి, ఏపీపీఎస్సీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు బీసీలకు ఇవ్వడం జరగింది. అచ్చెన్నాయుడు మొదలు కొని.. కొల్లు రవీంద్ర వరకు అనేక మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో బీసీల కోసం ఎనలేని సేవ చేసి ప్రజల గౌరవ మన్ననలు పొందిన మా తాత గౌతు లచ్చన్నను వైసీపీ వారు అవమానకరంగా మాట్లాడారు.

పలాసలో ఒక మదమెక్కిన వైసీపీ పశువు మాతాత గారిని దూషించాడు. వైసీపీకి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. బీసీలపై దాడులు జరుగుతుంటే ప్రశ్నించలేని బీసీ నాయకులు వైసీపీలో ఉన్నారు. గౌడ సోదరుడు అమర్నాద్ని కాల్చి చంపారు. నందం సుబ్బయ్యను తల నరికి చంపారు. అయినా ఒక్క వైసీపీ బీసీ నాయకుడు ప్రశ్నించలేదు.

ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ..
బీసీల అభివృద్ది, అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యం. వేదిక మీద ఉన్న నాయకులంతా టీడీపీలో ఎదిగిన వారే. టీడీపీ పాలనలో ఎప్పడూ బీసీలకు స్వర్ణయుగమే. బీసీలకు టీడీపీ ఇచ్చిన ప్రాధాన్యత మరే ఇతర పార్టీలో ఇవ్వదు. చంద్రబాబు నాయుడు బీసీ సాధికార కమిటీలు ఏర్పాటు చేసి అనేక మందికి రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. టీడీపీ హయాంలో బీసీ సబ్ ప్లాన్ కి ఏటా రూ. 10 వేల కోట్లు కేటాయించి నాలుగున్నరేళ్లలో సుమారు రూ. 36 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే.

2014-19 లో బీసీలకు 30 సంక్షేమ పధకాలు అమలు చేస్తే జగన్ రెడ్డి అన్నిటినీ రద్దు చేశాడు. విదేశీ విద్య, కార్పోరేషన్ రుణాలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, కమ్యూనిటి భవన్ లు న అన్ని నిలిపివేశారు. బీసీ రిజర్వేషన్లు 34 శాతానికి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదే. జగన్ రెడ్డి ఆ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించి 16800 మందిని స్ధానిక సంస్ధల్లో రాజకీయ పదవులు దూరం చేశారు. టీడీపీ హయాంలో కులగనణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. కానీ జగన్ రెడ్డి నేడు కులగనణ అంటూ బీసీల్ని మోసం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి వచ్చ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలి.

ఎమ్మెల్సీ బి.టి.నాయుడు మాట్లాడుతూ..
గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బడుగుల భగవంతుడు చంద్రబాబుగారు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మనకు స్వర్ణ యుగాన్ని అందించారు. ఈ ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి, బీసీలను బానిసలుగా చూశారు. మన తెలుగుదేశం నాయకుల్నిభయపెడితే ప్రజలు కూడా భయపడతారని కింజరాపు అచ్చెన్నాయుడు గారిని అరెస్టు చేశారు. ఆరోజే వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలయ్యింది.

యనమల రామకృష్ణుడు పైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అయ్యన్న పాత్రుడిపైన అక్రమంగా రేప్ కేసు పెట్టి బీసీలను అణగదొక్కారు. చంద్రన్న హయాంలో మెజార్టీ శాఖలన్నీ బీసీ నాయకులకి ఇచ్చి గౌరవించారు. బీసీలకు 56 కార్పోరేషన్లు అని చెప్పి కేవలం కుర్చీలు, టేబుల్లకే పరిమితం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు స్వర్ణయుగం రాబోతుంది.

బీసీలకు గతంలో ఇచ్చినటువంటి పదవులకంటే ఉన్నతమైన స్ధానాలు ఇవ్వబోతుంది. యుగపురుషుడు నందమూరి తారక రామారావుగారు గ్రామస్థాయిలో బీసీలకు 20శాతం రిజర్వేషన్లు కల్పించారు. చంద్రన్నస్థానిక సంస్థల్లో 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 16 శాతం రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేశారు.

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ..
బీసీలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లింది తెలుగుదేశమే. తెలుగుదేశం బీసీల పార్టీ. జగన్మోహన్ రెడ్డి బీసీ ద్రోహి. జగన్ రెడ్డి పాలనలో బడుగు, బలహీన వర్గాలు వేధింపులకు గురయ్యాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లపాలు చేశారు. బీసీలకు జగన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళదాం. కులవృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికీ ఆర్థిక భరోసా కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం

విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ…
గతంలో రాచరికాలు ఉన్నప్పుడు సమంతరాజుల పరిపాలన చూశాం. ఆ విధంగా రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి 5 జోన్లుగా విభజించి కనీసం ఒక్క బీసీకి కూడా న్యాయం చేయలేదు. అన్ని జోన్లకు రెడ్డి సామాజిక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఆంధ్రులకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు, ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న త్రాగునీటి కలను 2021 నాటికి పూర్తి చేస్తా అని అసెంబ్లీ సాక్షిగా బల్ల గుద్ది మరీ బీసీ నాయకులతో చెప్పించారు. ఇలాంటి అబద్దాలు చెప్పించడానికి మాత్రమే బీసీ నాయకులను వాడుకునే వ్యక్తి జగన్ రెడ్డి.

గౌరవ ప్రదమైన పదవుల్లో ఉన్న నాయకులను కించపరిచేలా చేస్తున్నాడు జగన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఓ వైపు అరాచకాలు, ఓ వైపు అక్రమ కేసులతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఆర్థికంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి, విద్య, ఉఫాథి, అణగారిన ప్రజలకు ఇచ్చే నిధులు అన్నిరద్దు అయ్యాయి.

విదేశీ విద్యకెళితే బీసీలు ఉన్నతమైన స్థానాల్లో ఉండి సంపాదనా పరులవుతారనుకుంటే ఆ కార్యక్రమాలు రద్దు చేశారు. ఇక రాజకీయంగా ఉన్నతమైన పదవులు వస్తాయని బీసీలను రాజకీయంగా అణగదొక్కారు. రాష్ట్రంలో ప్రజలు ఆర్థికంగా ముందుకువెళ్లాలంటే అది ఒక్క చంద్రబాబు ద్వారానే సాధ్యమవుతుంది.

మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షులు కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ..
తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకు అనేక రాజకీయ అవకాశాలు వచ్చాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కేంద్రం 20 శాతం ఇస్తే, చంద్రబాబు గారు 34 శాతం ఇచ్చి ఎక్కువ శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు హయాంలో బీసీలకు మరిన్ని రాజకీయ అవకాశాలు ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు కూడా న్యాయం చేశారు. రాజకీయంగా ఎదిగిన బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా, అండగా ఉంటున్నారనే దురుద్దేశంతో బీసీలను బెదిరించి లొంగదీసుకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు.

ఈ నాలుగేళ్ల పాలనలో బీసీలను 300 మందిని కిరాతకంగా హత్య చేశారు. 20 వేల మంది పైన దాడులు చేశారు. ఇవాళ బీసీలందరూ మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ అరాచకపాలనను అంతం చేయాలి. బీసీలకు రాజ్యాధికారం కావాలన్నా, రాజకీయంగా ఎదగాలన్నా చంద్రబాబు గారుతోనే సాధ్యం వచ్చే ఎన్నికల్లో వైసీపీ గద్దె దించి, బుద్ది చెప్పి మళ్లీ మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి.

సీనియర్ నాయకురాలు కె.బి.శివబాల మాట్లాడుతూ..
56 బీసీ కార్పొరేషన్లపై 5 మంది షాడో రెడ్లను పెట్టి బీసీలను నయవంచన చేస్తున్నాడు జగన్ రెడ్డి. బీసీలకు అన్యాయం చేయడమే లక్ష్యంగా జగన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోంది. జనాభాలో కుల గణన చేయాలని బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిస్సా, జార్ఖండ్ ప్రభుత్వాలు అసెంబ్లీలలో తీర్మానాలు చేశాయి. బీసీ కుల గణనపై ఏపీ అసెంబ్లీలో జగన్ రెడ్డి ఎందుకు తీర్మానం చేయలేదు.?

2014 లోనే చంద్రబాబు నాయుడు బీసీ కులగణన చేయాలని తీర్మానంచేసి కేంద్రానికి పంపారు. జగన్ రెడ్డికి బీసీలపై చిత్తశుద్ది ఉంటే బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదు? అనంతపురం జిల్లాలో అనేక మంది బీసీలకు రాజకీయ భవిష్యత్తు నిచ్చింది తెలుగుదేశం పార్టీ. పార్ధసారధి, కాల్వ శ్రీనివాస్, నిమ్మల కిష్టప్ప లాంటి అనేక మందికి పదవులు కల్పించింది తెలుగుదేశం పార్టీ. సైకో రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత బీసీలపై అమానుషంగా దాడులు జరుగుతున్నాయి. సింగనమలలో ఒక పేద బీసీ ఎంతో కష్టపడి ఇళ్లు కట్టుకుంటే గృహప్రవేశం చేయనీకుండా ఇంటికి దారిలేకుండా చేశారు

వైకాపా నేత సాంబశివారెడ్డి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాకే గృహప్రవేశం చేసుకుంటామని ఇంటి ముందు టిడిపి జెండా ఎగురవేసింది ఆ కుటుంబం. రాప్తాడులో కురువ అలివేలమ్మ అనే బీసీ అమ్మాయి జుట్టు పట్టుకుని ఊరు సెంటర్ లోకి వీడ్చి అమానుషంగా అవమానిస్తే…కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని చూసింది. చంద్రబాబునాయుడు ఇచ్చిన భరోసాతో ఆ కుటుంబం బ్రతికిబయటపడ్డారు.

అలివేలు నేడు ఊరు వదిలి వేరే ఊరులో నివాసం ఉంటుంది. చంద్రబాబు నాయుడు సి.ఎం అయ్యాకే ఊరికి తిరిగి వెళుతానని పట్టుదలతో ఉంది. వైకాపా ప్రభుత్వం అనంతపురంలో అనేకమంది బీసీలపై దారుణాలకు ఒడిగట్టింది. కపట ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరగదు. చంద్రన్న ప్రభుత్వంలోనే బీసీల సమగ్రాభివృద్ధి జరుగుతుంది.

LEAVE A RESPONSE