Suryaa.co.in

Andhra Pradesh

సోలార్ ప్రాజెక్టులకు అదనంగా 23,550 ఎకరాల భూ పందేరంతో, రూ.2,350 కోట్ల కుంభకోణానికి పాల్పడిన జగన్ రెడ్డి

• వేలకోట్ల పెట్టుబడుల ముసుగులో భారీ భూ పందేరానికి జగన్ రెడ్డి సిద్ధమయ్యాడని ప్రజలు గ్రహించాలి
• గతంలో ఉన్న ప్రభుత్వాలు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఒక్కో మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి 3 ఎకరాలు కేటాయిస్తే జగన్ రెడ్డి ఏకంగా దాన్ని 6 ఎకరాలకు పెంచాడు
• మొత్తంగా జగన్ సర్కార్ సోలార్ పవర్ కు సంబంధించి నేటి కేబినెట్ సమావేశం సాక్షిగా 23,500ఎకరాలు అదనపు భూ పందేరానికి తెరలేపింది
• తక్కువలో తక్కువ ఎకరం విలువ రూ.10లక్షలు వేసుకున్నా.. జగన్ రెడ్డి సర్కార్ ఈ ఒక్కరోజే రూ.2,350 కోట్ల భారీ స్కామ్ కు పాల్పడింది
• 3,350 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్న జే.ఎస్.డబ్ల్యూ న్యూ ఎనర్జీ సంస్థకు 10,050 ఎకరాలు కేటాయించాల్సింది, ఏకంగా 20,100 ఎకరాలు కేటాయించారు.
• ఆక్వాగ్రీన్ ఎనర్జీ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అనామక కంపెనీకి 1000 మెగావాట్ల సామర్థ్యానికి 6 వేల ఎకరాలు కేటాయించారు
• జగన్ రెడ్డి బినామీ కంపెనీ ఇండోసోల్ పవర్ కు గతంలో కేటాయించిన భూమికి అదనంగా 10,500 ఎకరాలు కేటాయించారు
• తన ప్రభుత్వ కాలపరిమితి ముగిసే సమయం దగ్గరపడే కొద్దీ జగన్ రెడ్డి దీపముండగానే ఇల్లుచక్కబెట్టుకోవాలనే సామెతను తూచా తప్పకుండా పాటిస్తున్నాడు
• గతంలో ఇండోసోల్ సంస్థతో వైసీపీప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో స్పెషల్ పర్పస్ వెహికల్ అన్న నిబంధన లేదు..ఇప్పుడు కొత్తగా కేబినెట్ సమావేశంలో ఆ పదం చేర్చడం ముమ్మాటికీ భూ దోపిడీ కోసమే
• గతంలో సోలార్ పవర్ ప్రాజెక్టులకు లీజు ప్రాతిపదికన జరిగిన భూ కేటాయింపుల నిబంధనను మార్చి, ఏకంగా భూమి కొనుగోలు చేసే వెసులుబాటు ఇస్తూ నిబంధనలు ఎందుకు మార్చారో చెప్పాలి
• ఈ విధంగా అడ్డగోలుగా నిబంధనలు మార్చి, అదనంగా జరిపిన భూ కేటాయింపులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానం చెప్పాలి
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

జగన్మోహన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ఇంకా కేవలం 60 రోజులే ఉన్నాయని, ఏప్రియల్ నెలలో ఎన్నికలు జరగవచ్చనే ఊహాగానాలు ఇప్పటికే జోరందుకున్నాయని, ఈ నేపథ్యంలో దీపముండ గానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నసామెతను ముఖ్యమంత్రి చివరిరోజుల్లో తూచా తప్పకుండా పాటిస్తున్నాడని, ఇటీవల జరిగిన ఎస్.ఐ.పీ.బీ (స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు) మీటింగ్ లో రెన్యుబల్ ఎనర్జీ సెక్టార్ లో చేసుకున్న ఒప్పందాలే అందుకు నిదర్శనమని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

“ రెన్యుబుల్ ఎనర్జీ (సోలార్, విండ్, పంపడ్ ఎనర్జీ వంటివి) ప్రాజెక్టులకు సంబంధించి ఎస్.ఐ.పీ.బీ మీటింగ్ లో రూ.22,302కోట్లకు ఆమోదం తెలిపినట్టు ..తద్వారా 5,300ఉద్యోగాలు కల్పించబోతున్నట్టు ఏపీ ప్రభుత్వం చాలా పెద్ద సినిమా చూపించే ప్రయత్నం చేసింది. ఎస్.ఐ.పీ.బీ మీటింగ్ లో ఏఏ ప్రాజెక్టులకు అయితే ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిందో, వాటన్నింటికీ కూడా నేటి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం గొప్ప ఘనకార్యం సాధించినట్టు, భారీ రెన్యుబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకురాబోతున్నట్టు, వేలకోట్ల పెట్టుబడులు.. వేలాది ఉద్యోగాలు తెస్తున్నట్టు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కూడా మీడియా ఎదుట ఊదరగొట్టారు.

జగన్ రెడ్డి ప్రతి ఆలోచనా… ప్రతి అడుగూ అవినీతి మరకకు నిదర్శనమే
వాస్తవాలు మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. జగన్ రెడ్డి చేసే ప్రతి ఆలోచన, వేసే ప్రతి అడుగూ అవినీతిమరకకు నిదర్శనంగా నిలుస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఎస్.ఐ.పీ.బీ మీటింగ్ లో జరిగిన ఒప్పందాలు.. వేలకోట్ల పెట్టుబడులు అన్నీ బూటకం. రెన్యుబుల్ ఎనర్జీ పెట్టుబడుల ముసుగు లో జగన్ రెడ్డి వేలకోట్ల విలువైన భూ పందేరం చేస్తున్నాడు. నేడు తన అవినీతి పుత్రిక సాక్షిలో కూడా సీమకు ఇం ‘ధనం’ పేరుతో తప్పుడు కథనాలు రాయిం చాడు. సీమకు ఇం ‘ధనం’ కాదు.. అది జగన్ రెడ్డికి ఇం ‘ధనం’ అని… తాడేపల్లి ప్యాలెస్ కు ఇం ‘ధనం’ అని రాసుంటే బాగుండేది.

సోలార్ పవర్ ప్రాజెక్టుల ముసుగులో అడ్డగోలు భూకేటాయింపులతో కమీషన్ల రూపంలో తాను ఎంత మింగాడో మంత్రి పెద్దిరెడ్డి చెప్పాలి
మన దేశంలో, రాష్ట్రంలో సోలార్ పవర్ ప్రాజెక్టులకు భూ కేటాయింపులు మెగావాట్ల సామర్థ్యాన్ని బట్టి జరుగుతాయి. సహజంగా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి సరిపడా ప్యానెల్స్ ఏర్పాటు చేయాలంటే మూడు ఎకరాల భూమి అవసరం. గతంలో టీడీపీ ప్రభుత్వం అలానే భూ కేటాయింపులు చేసింది, ఈ ప్రభుత్వం వచ్చాక 2022వరకు కూడా అదే పద్ధతిలో భూ కేటాయింపులు చేసింది. కానీ వైసీపీప్రభుత్వం మొన్న నిర్వహించిన ఎస్.ఐ.పీ.బీ (స్పెషల్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్) మీటింగ్ లో సోలార్ విద్యుత్ మెగావాట్ కు 3 ఎకరాల కేటాయింపు పరిధిని 6 ఎకరాలకు పెంచింది.

ఒక్కో మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి 3 ఎకరాలు అవసరమైతే, మన స్కామ్ స్టర్ జగన్ రెడ్డి ఏకంగా 6 ఎకరాలు కేటాయిస్తూ భారీ భూ పందేరానికి తెరలేపాడు. ఇది దేశంలోనే సరికొత్త రికార్డు. మరే రాష్ట్రంలో కూడా ఇంత అడ్డగోలుగా సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు మెగావాట్ కు 6 ఎకరాలు కేటాయించలేదు. ఎస్.ఐ.పీ.బీ మీటింగ్ లో జే.ఎస్.డబ్ల్యూ న్యూ ఎనర్జీ సంస్థవారు 3,350 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సిద్ధమన్నారు. ఆ సంస్థ ప్రతిపాదనకు నేటి కేబినె ట్ సమావేశంలో కూడా జగన్ రెడ్డి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

జే.ఎస్.డబ్ల్యూ సంస్థ ప్రతిపాదించిన ప్రకారం ఒక్కో మెగావాట్ కు 3 ఎకరాల చొప్పున 3,350 మెగావాట్లకు 10,050 ఎకరాల భూమి కేటాయించాల్సి ఉంది. కానీ జగన్ రెడ్డి సర్కార్ ఏకంగా భూ కేటాయింపుల్ని రెండింతలు పెంచి మెగావాట్ కు 6 ఎకరాల చొప్పున 20,100 ఎకరాలు కేటాయించింది. ఇష్టానుసారం పెంచి ఇవ్వడానికి ఆ భూములు ఏమైనా జగన్ రెడ్డి తాతసొత్తా? నిన్నటివరకు ఒక్కో మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి 3 ఎకరాలు మాత్రమే కేటాయిస్తే, ఇప్పుడు ఏకంగా 6 ఎకరాలు ఎందుకు కేటాయించారు? గతంలో 3ఎకరాల భూమిలో ఏర్పాటయ్యే సోలార్ ప్యానెళ్ల ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయగలిగితే, నేడు సోలార్ ప్యానెళ్లు 6 ఎకరాలకు దేనికి విస్తరించాల్సి వస్తోంది?

ఉన్నట్టుండి రాయలసీమగడ్డపై కారుమబ్బులు మోహరించాయా.. చీకట్లు కమ్ముకొచ్చాయా? ఈ విధంగా అడ్డగోలు భూకేటాయింపులు చేయడానికి, ఆయా సంస్థల వద్ద నుంచి ఎంత కమిషన్ మింగారని సంబంధిత శాఖా మంత్రి, పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నాను. ఎన్నివేల కోట్లకు ఒప్పందం చేసుకొని ఈ విధంగా 10,050 ఎకరాలకు బదులు, 20,100 ఎకరాలు కేటాయిం చారో పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలి.

అనామక కంపెనీ ఆక్వాగ్రీన్ ఎనర్జీ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ భూ కేటాయింపుల్లోనూ జగన్ రెడ్డి తన పెద్దమనసు చాటుకున్నాడు తన బినామీ సంస్థ ఇండోసోల్ కు 2022లో ఒక్కో మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి 3ఎకరాలు కేటాయించిన జగన్ రెడ్డి, ఇప్పుడు దాన్ని 6 ఎకరాలకు పెంచడంపై మంత్రి పెద్దిరెడ్డి నోరువిప్పాలి.

పులిగొండ్లపల్లె గ్రామం, తలుపుల మండలం, సత్యసాయి జిల్లాలో కూడా ఒక అనామక కంపెనీకి ఇదేవిధంగా భూములు కేటాయించారు. ఆక్వాగ్రీన్ ఎనర్జీ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఊరూపేరూ లేని కంపెనీకి చేసిన భూ పందేరంలో కూడా జగన్ రెడ్డి తన పెద్దమనసు చాటుకున్నాడు. ఆక్వాగ్రీన్ ఎనర్జీ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 1000 మెగావాట్ల సామర్థ్యానికి గాను, 6వేల ఎకరాలు కేటాయించారు. కొత్తగా ఈ విధంగా అదనంగా భూ కేటాయింపులు చేయడం ఒకెత్తు అయితే ఇదే జగన్ రెడ్డి సర్కార్ ఇంతకుముందు ఇండోసోల్ అనే కంపెనీకి ఒక్కో మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి 3 ఎకరాలు కేటాయిం చింది.

షిరిడీసాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ కంపెనీలు జగన్ రెడ్డి బినామీ సంస్థలన్న విషయం మనకు విదితమే. 12-09-2022న జీవో-19 ద్వారా ఇండోసోల్ కంపెనీకి వైసీపీ ప్రభుత్వం ఒక మెగావాట్ కు 3 ఎకరాల చొప్పున మాత్రమే భూ కేటాయింపులు చేసింది. మరలా ఇప్పుడు అదే ఇండోసోల్ కంపెనీకి గతంలో చేసిన భూకేటాయింపుల్ని సవరించి, అదనంగా కేటాయింపు లు పెంచుతూ మొన్న జరిగిన ఎస్.ఐ.పీ.బీ సమావేశంలో, నేటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇండోసోల్ కంపెనీ గతంలో 3,500 మెగావాట్ల సోలార్ విద్యుత్, 1500 మెగావాట్ల విండ్, 2,200 పంపడ్ స్టోరేజ్ హైడ్రోపవర్ చేస్తుందని చెప్పి, దానికి సంబంధించిన భూ కేటాయిం పులకు ఆమోదం తెలిపారు.

3,500 మెగావాట్ల సోలార్ పవర్ కు, మెగావాట్ కు 3 ఎకరాల చొప్పున 2022లో కేటాయించి, ఇప్పుడు అదనంగా మరో మూడు ఎకరాల కేటాయింపులు ఎందుకు పెంచారు? 3,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి గతంలో కేటాయించిన 10,500 ఎకరాలకు అదనంగా నేడు మరో 10,500ఎకరాలు కేటాయించి, మొత్తంగా 21,000 ఎకరాల్ని జగన్ రెడ్డి తన బినామీ సంస్థకు కేటాయించడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి నేటి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారో లేదో… పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలి.

జగన్ బినామీ సంస్థ ఇండోసోల్ పవర్ కోసం అడ్డగోలుగా నిబంధనల మార్పిడిపై పెద్దిరెడ్డి నోరు విప్పాలి
ఇవన్నీ గమనిస్తే మొన్న జరిగిన ఎస్.ఐ.పీ.బీ మీటింగ్ లోగానీ, నేటి కేబినెట్ సమావేశంలో మొత్తంగా జగన్ సర్కార్ సోలార్ ప్జ్రాజెక్టుల పేరుతో దాదాపుగా 23,550 ఎకరాలు అదనపు భూ కేటాయింపులకు పాల్పడి పెద్ద కుంభకోణానికి తెరలేపింది. ఇదంతాగమనిస్తే వేలకోట్ల పెట్టుబడుల ముసుగులో వేలకోట్ల విలువైన భూముల్ని జగన్ ప్రభుత్వం పంచి పెడుతున్నట్టు అర్థమవుతోంది. జే.ఎస్.డబ్ల్యూ న్యూ ఎనర్జీ సంస్థకు అదనంగా 10,050ఎకరాలు, ఆక్వాగ్రీన్ ఎనర్జీ మేనేజ్ మెంట్ సంస్థకు అదనంగా 3 వేల ఎకరాలు, ఇండోసోల్ కంపెనీకి అదనంగా 10,500 ఎకరాలు అదనంగా కేటాయించడానికి సిద్ధమయ్యారు.

మొత్తంగా సోలార్ పవర్ ముసుగు లో 23,550 ఎకరాలు కేటాయించారు. ఎకరం ధర హీనపక్షంగా రూ.10లక్షలు వేసుకున్నా కూడా, నేటి కేబినెట్ సమావేశం సాక్షిగా మొత్తంగా రూ.2,350కోట్ల విలువైన భూ దోపిడీకి జగన్ సర్కార్ పాల్పడింది. తన ప్రభుత్వం దిగిపోయే సమయం దగ్గరపడేకొద్దీ జగన్ రెడ్డికి సొమ్ములు పోగేసుకోవాలనే ఆరాటం ఎక్కువైంది. అదనపు భూ కేటాయింపులే కాదు.. అడ్డగోలుగా నిబంధనలు కూడా మారుస్తున్నారు. ఇండోసోల్ పవర్ సంస్థకు గతంలో భూములు కేటాయిస్తూ ఇచ్చిన జీవో 19లో ఎక్కడా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్.పీ.వీ) అనే నిబంధన లేదు. ఇప్పుడు కొత్తగా కేబినెట్ సమావేశంలో ఆ నిబంధన చేర్చి ఇన్నివేలకోట్ల విలువైన భూములున్నాయని అదనంగా భాగస్వాముల్ని చేర్చాలని చూస్తున్నారు.

నేడు ఎస్.పీ.బీ పేరుతో కొత్త భాగస్వాములకు తమవాటాలు అమ్మి భారీగా సొమ్ము చేసుకోవాలని జగన్ బినామీలు కుట్రపన్నారు. అలానే గతంలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ లకు లీజు ప్రాతిపదికన మాత్రమే భూ కేటాయింపులు జరిగేవి. ఎకరానికి సుమారుగా రూ.31వేల లీజు నిర్ధారించడం జరిగింది. కానీ ఇప్పుడు జగన్ సర్కార్ ఆ నిబంధన కూడా మార్చేసి భూమిని కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తూ మొన్న జరిగిన ఎస్.ఐ.పీ.బీ మీటింగ్ లో, నేటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇండోసోల్ కంపెనీకి కేటాయించిన భూముల్ని ఆ సంస్థ కొనుగోలు చేసేట్టు ఎందుకు నిబంధనలు సవరించారో కూడా మంత్రి పెద్దిరెడ్డి చెప్పాలి. వాళ్ల బినామీ కంపెనీ అయిన ఇండోసోల్ సంస్థ కోసమే ఇలా నిబంధ నలు ఎందుకు మార్చారో చెప్పాలి.

దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్కో మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి 6 ఎకరాలు కేటాయించడం జగన్ రెడ్డి భూ దోపీడీలో భాగమే. టీడీపీ ప్రభుత్వం రాగానే జగన్ రెడ్డి చేసిన భూ కేటాయింపులు.. తాను తెరపైకి తెచ్చిన కంపెనీలపై పున:సమీక్ష చేస్తుంది.

ఇండోసోల్ సంస్థకు చేసిన అదనపు భూ కేటాయింపుల్లో భాగంగా జగన్ ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలం ఉలిచింతల గ్రామంతో పాటు, వైఎస్సార్ కడపజిల్లాలోని మైలవరం మండలంలోని బీ.వెంకటాపురం, నేలనూతల, ఏ.కంబాలదిన్నె, చినవెంతుర్ల, కల్లుట్ల గ్రామాల్లో అదనంగా మరో 10,500 ఎకరాల భూమి సేకరించబోతోంది. ఈ విధంగా వేలకోట్ల పెట్టుబడుల ముసుగులో వేల ఎకరాల భూ పంపిణీకి జగన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు. గతంలో టీడీపీ ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఒక్కో మెగావాట్ కు 3 ఎకరాలు మాత్రమే కేటాయించింది.

వైసీపీ ప్రభుత్వం కూడా ఇండోసోల్ సంస్థకు 2022లో అలానే కేటాయించింది. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఒక్కోమెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి 6 ఎకరాలు ఎందుకు కేటాయిస్తున్నారు? గతంలో 3 ఎకరాల్లో ఏర్పాటైన సోలార్ పవర్ ప్యానెల్స్ నేడు 6 ఎకరాలకు ఎందుకు విస్తరిస్తున్నాయో ముఖ్యమంత్రి చెప్పాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో మెగావాట్ కు 6 ఎకరాలు కేటాయించడం జగన్ రెడ్డి నయా భూదోపీడీలో భాగమే. గతంలో చంద్రబాబు ఎంతో పారదర్శకంగా రెన్యుబుల్ ఎనర్జీని ప్రమోట్ చేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాల పున: సమీక్ష పేరుతో కంపెనీలను బెదిరించి, కమీషన్లు దండుకునే ప్రయత్నం చేశాడు.

జే.ఎస్.డబ్ల్యూ, ఆక్వాగ్రీన్, ఇండో సోల్ సంస్థలతో పాటు, మిగతా సంస్థలకు నేడు జగన్ రెడ్డి చేస్తున్న భూ పందేరంపై అధికారంలోకి రాగానే టీడీపీప్రభుత్వం విచారణ చేపడతుంది. జగన్ రెడ్డి చేసిన అడ్డగోలు భూ కేటాయింపుల్ని పున:సమీక్షించి, అవసరమైతే రద్దుచేస్తుంది. టీడీపీ ప్రభుత్వం గతంలో రాయలసీమలో అనేక పరిశ్రమలు తీసుకొస్తే, నేడు జగన్ రెడ్డి పరిశ్రమల ముసుగులో పేదల భూముల్ని తన బినామీ సంస్థలకు దోచిపెడుతున్నాడు.

పెద్దిరెడ్డి కూడా జగన్ రెడ్డితో చేరి రాబోయే ఎన్నికల్లో ఓట్లకొనుగోలు కోసం ఈ భూ దోపిడీకి సహకరిస్తున్నాడు. నేడు జరిగిన కేబినెట్ సమావేశం సాక్షిగా జగన్ సర్కార్ పాల్పడిన రూ.2,350 కోట్ల అవినీతి కుంభకోణంపై ప్రజలు ఆలోచించాలి. ” అని పట్టాభి రామ్ సూచించారు.

LEAVE A RESPONSE