Suryaa.co.in

Andhra Pradesh

కొత్త చరిత్రకు ఇది శ్రీకారం

-ఎక్కడా వెనక్కి తగ్గని ఓటరు ధైర్యానికి వందనం
-రాష్ట్రానికి ఇకపై అన్నీ మంచి రోజులే
-పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ప్రతి ఓటరుకు హృదయపూర్వక ధన్యవాదాలు
-ఓటర్లకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు

రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఓటు వేయడానికి ప్రజలు చూపించిన ఉత్సాహం, వారిలో వెల్లివిరిసిన చైతన్యం చూసాక కొత్త చరిత్రకు ఇది శ్రీకారం అనిపించింది. అరాచకానికి ముగింపు పలికి ప్రజాస్వామ్య పాలన సాధించుకోవాలనే కసి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రతి ఓటరు లోనూ స్పష్టంగా కనిపించింది. ఒకే రకమైన సంకల్పంతో ఓటు వేయడానికి వందల, వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు ప్రజలు. ఆర్థిక భారాన్ని, ఎండ వేడిమిని, ప్రయాణ కష్టాన్ని ఓర్చుకుని రాష్ట్రం కోసం పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ప్రతి ఓటరుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

ఓటమి భయంతో భయోత్పాతం సృష్టించి పోలింగ్ ను తగ్గించడానికి వైసీపీ నేతలు హింసకు పాల్పడినా ఎక్కడా వెనక్కి తగ్గని ఓటరు ధైర్యానికి వందనం. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితురాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఓటు వేయడానికి ప్రజలు చూపించిన ఉత్సాహం, వారిలో వెల్లివిరిసిన చైతన్యం చూసాక కొత్త చరిత్రకు ఇది శ్రీకారం అనిపించింది. అరాచకానికి ముగింపు పలికి ప్రజాస్వామ్య పాలన సాధించుకోవాలనే కసి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రతి ఓటరు లోనూ స్పష్టంగా కనిపించింది.

ఒకే రకమైన సంకల్పంతో ఓటు వేయడానికి వందల, వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు ప్రజలు. ఆర్థిక భారాన్ని, ఎండ వేడిమిని, ప్రయాణ కష్టాన్ని ఓర్చుకుని రాష్ట్రం కోసం పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ప్రతి ఓటరుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

ఓటమి భయంతో భయోత్పాతం సృష్టించి పోలింగ్ ను తగ్గించడానికి వైసీపీ నేతలు హింసకు పాల్పడినా ఎక్కడా వెనక్కి తగ్గని ఓటరు ధైర్యానికి వందనం. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు చూస్తే 80 శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది శుభసూచకం.రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా కలిసివచ్చిన మూడు పార్టీలను అర్థం చేసుకుని ఆదరించిన మీకు ధన్యవాదాలు. రాష్ట్రానికి ఇకపై అన్నీ మంచి రోజులే. ఏపీ ప్రజల స్ఫూర్తికి మరోమారు ధన్యవాదాలు..

LEAVE A RESPONSE