Suryaa.co.in

Devotional

దశావతారాల ఆవిర్భావం ఏమాసాలలో జరిగింది?

1. మత్స్యజయంతి :- చైత్ర శుద్ధ పంచమి అపరాహ్నంలో విష్ణువు మత్స్యావతారంగా అవతరించాడు.(ఎప్రియల్ లో వస్తుంది)
2. కూర్మజయంతి :- జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు ప్రదోషవేల కూర్మావతరం జరిగింది.(జూన్ లో వస్తుంది)
3. వరాహ జయంతి:- చైత్ర శుద్ధ నవమి అపరాహ్నంలో అంటే మాధ్యాహ్నంకాలంలో జరిగింది.
4. నరసింహ జయంతి :- వైశాఖ శుద్ధ త్రయోదశి ప్రదోష కాలంలో జరిగింది🙏
5. వామన జయంతి:- భాద్రపద శుద్ధ ద్వాదశి మధ్యాహ్నంలో అభిజిత్ లగ్నంలో జరిగింది
6. పరుశురామ జయంతి:- వైశాఖ శుద్ధ తదియనాడు సాయంకాలం 6 నుండి 9 గంటల మధ్య జరిగింది
7. శ్రీరామ జయంతి :- (శ్రీరామనవమి)శ్రీరాముడు పుట్టింది చైత్ర శుద్ధ నవమి మధ్యాహ్నాం 12 గంటలకు కర్కాటలగ్నంలో పునర్వసు నక్షత్రంలో 5 గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా జన్మిచాడు కావున శ్రీరామ నవమి ఎప్రియలో ఆచరించాలి.
8. బలరామ జయంతి:- భాద్రపద శుద్ధ తదియ నాడు మధ్యాహ్నం అవతారం జరిగింది
9. శ్రీకృష్ణ జయంతి :- శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి మధురలో రోహిణి నక్షత్రం వృషభలగ్నంలో జరిగింది(19-7-3227 బి .సి)
10. బుద్ధజయంతి వైశాఖ శుద్ధ పూర్ణమి నాడు జరిగింది
11. కల్కిజయంతి:- వైశాఖ శుద్ధ తదియ ప్రదోష సమయంలో కల్కి అవతారము జరిగింది ఆధార గ్రంధము సూర్య సిద్దాంతము.( ఇది ఈ గ్రంథ ఆధారంగా చెప్పబడినది కానీ ఈ ప్రస్తావన ఇంక ఎక్కడా లేదు).

సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

LEAVE A RESPONSE