Suryaa.co.in

Andhra Pradesh

ఇందిరమ్మ రాజ్యం దేశానికి ఆదర్శం

ఆంధ్రరత్న భవనములో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

విజయవాడ: ఇందిరా గాంధీ ప్రధానిగా దేశానికి చేసిన సేవలు మరువలేనివని స్ఫూర్తిదాయకమైన పాలన అందించారని దేశానికే కాదు ఇందిరాగాంధీ ప్రపంచానికి ఆదర్శప్రాయులని ఏపీసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు ఇందిరమ్మ సేవలను కొనియాడారు. ఈరోజు ఆంధ్ర భవన్లో జరిగిన ఇందిరాగాంధీ జయంతి వేడుకలలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి రుద్రరాజు ఇందిర రాజ్యం మళ్లీ రాబోతుందని అన్నారు గరీబీ హటావో బ్యాంకులు జాతీయకరణ వంటి నినాదాలను పేద ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించాయని గుర్తు చేశారు.

ఇందిర ధైర్య సాహసాలు రాజనీతి వారి పరిపాలన దేశానికి విలువ కట్టలేనివని ఆయన పార్టీ శ్రేణులకు వివరించారు. ఇందిరాగాంధీ స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకుని పట్టుదలతో పార్టీని విజయపథం వైపు నడిపించాలని రుద్రరాజు పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు అనంతరం ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు తదనంతరం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన గిడుగు రుద్రరాజు గారు మొట్టమొదటగా రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు.

ఆయనతో పాటు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు జనరల్ సెక్రెటరీ కుర్షిదా షేక్ నాగూర్, పి.వై. కిరణ్, ఉపాధ్యక్షులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పీటర్ జోసెఫ్ తదితరులు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పీటర్ జోసఫ్ తో పాటు కార్యకర్తలు యువజన నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేశారు తదనంతరం జరిగిన కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు రక్తదానంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలకు సర్టిఫికెట్లు అందించారు. విజయవాడ చల్లపల్లి బంగ్లా వద్ద ఐదు కూడలి రోడ్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో కార్యనిర్వక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, కొలనుకొండ శివాజీ, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు లామ్ తాంతియ కుమారి, ధనేకుల మురళీ, ఖాజా మొహిద్దీన్, బైపుడి నాగేశ్వర రావు, ప్రమీలా గాంధీ, జనరల్ సెక్రటరీలు ఏసుదాస్ షేక్ నాగూర్ కుర్షిదా పి వై కిరణ్ గౌస్ తదితర పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE