హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ కంట్రోల్ అసోసియేషన్ (ఐ ఎస్ ఏ సి ఏ ) హైదరాబాద్ చాప్టర్ తన వార్షిక సర్వసభ్య సమావేశాన్ని సోమవారం నిర్వహించి కొత్త బోర్డును ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా జీ సిఎస్ శర్మ ఉపాధ్యక్షుడిగా జీ, వీ వంశీకృష్ణ , కోశాధికారిగా సి వెంకట్రామ్, కార్యదర్శిగా రాజ్ పవార్, మెంబర్‌షిప్ డైరెక్టర్‌గా రజనీష్ దాసరి, ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా సతీష్ బొట్ట, ప్రభుత్వ రిలేషన్స్ డైరెక్టర్ గా పవన్ కుమార్ మారెళ్ల , షీలీడ్స్‌టెక్ డైరెక్టర్‌గా అర్ధ వర లక్ష్మి, అకడమిక్స్ డైరెక్టర్‌గా డా. సౌజన్య పొన్నలూరు ఎన్నికయ్యారు.
ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ కంట్రోల్ అసోసియేషన్ (ఐ ఎస్ ఏ సి ఏ) హైదరాబాద్ చాప్టర్ 1,200 మంది సభ్యులతో కూడిన లాభాపేక్ష లేని సంస్థ. ఇది విలువను పెంచడంలో, సాంకేతిక ప్రమాదాలను నిర్వహించడంలో ఐటీ, వ్యాపార నాయకులకు మద్దతు ఇస్తుంది. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ కంట్రోల్ అసోసియేషన్ బాడీతో అనుబంధించబడి, ఇది భద్రత, ప్రమాదం, పాలనలో నిపుణుల కోసం వాదిస్తుంది.