Suryaa.co.in

Telangana

సీఎం ఢిల్లీ వెళ్లి సాధించేదేమిటి?

– తెలంగాణా శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: కేసీఆర్ హయాంలో సగటున ఏడాదికి 27 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బీసీ గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం ఏర్పాటు చేయాలన్న ఆలోచన కానీ ప్రభుత్వానికి లేకపోవడం దారుణం. సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో కేవలం 19 బీసీ సంక్షేమ పాఠశాలను ఏర్పాటు చేసింది.

పదేళ్లలో కేసీఆర్ 275 బీసీ పాఠశాలలను, 31 బీసీ డిగ్రీ కాలేజీలను, ప్రత్యేకంగా బీసీలకు రెండు వ్యవసాయ కాలేజీలను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు ఫీజు రియింబర్స్ మెంట్ కింద రూ. 14 వేల కోట్లు విడుదల చేసింది. 2230 బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ. 450 కోట్లు ఖర్చు చేశాము.

నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు. మరి ప్రతి జిల్లాకు రావాల్సిన నవోదయా విద్యాలయాలను ఎన్ని సాధించారు ? వెనుకబడిన జిల్లాలకు నిధులు సాధించారా ? ఇన్ని సార్లు ఢిల్లీ వెళ్లడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి అదనపు నిధులు ఏం తీసుకొచ్చారు?

LEAVE A RESPONSE