– సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి
– రెవెన్యూ సమస్యలను పరిష్కరించండి
– లింగసముద్రం మండలం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు
లింగసముద్రం: అధికారులు ప్రజల సమస్యలను, ముఖ్యంగా మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని వాటిని త్వరగా పరిష్కరించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశించారు.
గత వైసిపి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఈ మండలంలో జల జీవన్ మిషన్ కార్యక్రమంలో అనేక అక్రమాలు జరిగాయని వాటిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని వారు తిన్న అవినీతి సొమ్మును తిరిగి ప్రభుత్వానికి జమ చేసేలా చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ మండలంలో గత ప్రభుత్వంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని ముఖ్యంగా అసైన్మెంట్ భూములు లో అవకతవకలు జరిగాయని అసైన్మెంట్ భూములను వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారని, వాటిపై తిరిగి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గత 2014 -19 తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా చేశారని కానీ గత వైసిపి ప్రభుత్వంలో చేసిన పనులకు ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నిధులు ద్వారా చెల్లించాలని వైసీపీ నాయకులు అధికారులు బెదిరించడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు.