– కేసీఆర్ సీఎం గా ఉన్నపుడు బనక చర్ల ప్రతిపాదన ఎక్కడ?
– రోజా రొయ్యల పులుసు గురించి మాట్లాడటం తప్ప రేవంత్ ఉత్తమ్ ల దగ్గర సబ్జెక్టు లేదు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ,మంత్రి ఉత్తమ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ,ఎమ్మెల్సీ లకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పాత పాట పాడారు. కేసీఆర్ ను తిట్టాలి చంద్రబాబు ను కాపాడాలి అనే ఆత్రుత కనిపించింది. బనక చర్ల పై యుద్ధం ప్రకటిస్తారనుకున్నాం .ఆలా జరగలేదు. లక్షల రూపాయలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పేరిట వృధా చేశారు.
హరీష్ రావు బనక చర్ల పై బాహ్య ప్రపంచానికి చెప్పాకే ప్రభుత్వం మొద్దు నిద్రను వీడింది. హరీష్ రావు జనవరి లో ప్రెస్ మీట్ పెట్టాక ఉత్తమ్ పాత తేదీలతో జలశక్తి మంత్రికి లెటర్ రాశారు. ఉత్తమ్ లేఖ రాసి సరిపెట్టుకున్నారు .సీరియస్ ప్రయత్నాలు జరగలేదు. హరీష్ రావు మంత్రి కిషన్ రెడ్డి కి కూడా లేఖ రాశారు.
చివరకు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాకే ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఎంతసేపు రోజా రొయ్యల పులుసు గురించి మాట్లాడటం తప్ప రేవంత్ ఉత్తమ్ ల దగ్గర సబ్జెక్టు లేదు. కేసీఆర్ గోదావరి జలాలు వాడుకోమంటే బనక చర్ల కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టా ? కేసీఆర్ సీఎం గా ఉన్నపుడు బనక చర్ల ప్రతిపాదన ఎక్కడ?
కేంద్రం బనక చర్ల కు పర్యావరణ అనుమతులు నిరాకరించడం బీ ఆర్ ఎస్ విజయం.
రేవంత్ పోరాటం చంద్రబాబు పైనా ?కేసీఆర్ పైనా ? చంద్రబాబు ను ఒక్క మాట అనడం లేదు. హరీష్ రావు తో పవర్ ప్రెజెంటేషన్ ఇప్పిస్తే రాష్ట్ర ప్రజలకు విషయాలు అర్థం అవుతాయి .మీరిచ్చింది ఎవరికీ అర్థం కాలేదు. గోదావరి పై తెలంగాణ లో శ్రీరామ్ సాగర్ తప్ప ధవళేశ్వరం దాకా ఒక్క ప్రాజెక్టు నైనా కట్టని కాంగ్రెస్ కు కేసీఆర్ ను విమర్శించే హక్కు ఉందా ?
కేసీఆర్ 240 టీఎంసీ లు వాడుకునే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే తప్పు గా కనిపిస్తుందా ? మేడిగడ్డ ను బంద్ పెట్టి తెలంగాణ ను ఎండబెడుతున్న మీరా కేసీఆర్ పై విమర్శలు చేసేది. బనకచర్ల పై కేసీఆర్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు ఎన్ని చేసినా సీఎం రేవంత్ సఫలం కారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ గోదావరి ,కృష్ణా నీళ్లు సద్వినియోగం చేసుకునేందుకు సర్వశక్తులు వినియోగించారు.
రేవంత్ రెడ్డి అజ్ఞానం :ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్
తెలంగాణ నీళ్ల మీద ,రాష్ట్రం మీద యుద్ధం జరుగుతోంది. రాష్ట్రానికి సీఎం అయి ఉండి అన్నీ వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించారు. రేవంత్ రెడ్డి అజ్ఞానం మరోసారి బయట పడింది. సుందిళ్ల నుంచి నీరు వెళ్ళేది ఎల్లంపల్లి కి అయితే, మిడ్ మానేరు కు అని సీఎం మరోసారి తన తెలివి ని బయట పెట్టుకున్నారు. రేవంత్ కు సబ్జెక్టు లేదు .సరుకు లేదు. కృష్ణా జలాల పై అబద్దాలు మాట్లాడారు
కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణ కు 299 టీఎంసీ ల వాటా కోసం అంగీకరించింది నిజం కాదా ? దీనికి సంబంధించి అధికారులు సంతకం పెట్టలేదా ? చేపల పులుసు గురించి పదే పదే సీఎం మాట్లాడే దౌర్భాగ్యం తెలంగాణది.
తుమ్మిడి హట్టి నీటి లభ్యత గురించి కూడా అబద్దాలు మాట్లాడారు. సబ్జెక్టు లేక అవే అబద్దాలు ఆడుతున్నారు. 3 వేల టీఎంసీ ల నీళ్లు గోదావరి లో వృధా గా కలుస్తున్నాయని కేసీఆర్ కాదు చెప్పింది కాదు. యాభై యేండ్ల cwc లెక్కలే చెబుతున్నాయి. ఇలాంటి అబద్దాల సీఎం దేశం లో ఎక్కడా లేరు.
రెండు రాష్ట్రాల సీఎం లు కూర్చుని మాట్లాడుకోవాలని కేసీఆర్ అంటే రేవంత్ కు తప్పు గా ఎలా కనిపిస్తోంది? గోదావరి నీళ్లను ఏపీ కి తాకట్టు పెట్టే ప్రయత్నమే రేవంత్ లో కనిపిస్తోంది. చంద్రబాబు పై ప్రేమతో రేవంత్ కేసీఆర్ ను తిడుతున్నారు. మా మీద ఎన్ని ఆరోపణలు చేసినా బనక చర్ల పై పోరాటాన్ని ఆపం.
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి :ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
చంద్రబాబు కు కేసీఆర్ యే టార్గెట్. రేవంత్ రెడ్డి కి కూడా బనకచర్ల టార్గెట్ కాకుండా కేసీఆర్ యే టార్గెట్ అయ్యారు. బీజేపీ పోలవరానికి జాతీయ హోదా ఇచ్చింది .ఇపుడు బనక చర్ల కు అనుమతి నిచ్చే ప్లాన్ లో ఉంది. మిషన్ కాకతీయ ,సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసిన కేసీఆర్ చిత్తశుద్ధినా కాంగ్రెస్ నేతలు శంకించేది ? కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి.
గోదావరి ట్రిబ్యునల్ వస్తే ఏపీ కి అదనంగా నీటి కేటాయింపులు చేసుకునేందుకు చంద్రబాబు బనక చర్ల స్కెచ్ వేశారు. గోదావరి జలాలను కృష్ణా నదీ మార్గం నుంచి తరలించి తెలంగాణ వెనకబడిన జిల్లాలకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తే తప్పా ? అసెంబ్లీ సమావేశాలు పిలిస్తే ఎవరు వద్దన్నారు ? అఖిల పక్షాన్ని ఢిల్లీ కి ఎందుకు తీసుకెళ్లడం లేదు ? బనక చర్ల ను కేంద్రం టోటల్ గా తిరస్కరించాలి.
సోమవారమే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
బనక చర్ల పై అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని బీ ఆర్ ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వచ్చే సోమవారమే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి.బీ ఆర్ ఎస్ తరపున హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇస్తారు. రేవంత్ రెడ్డి తాను గానీ ఇంకా ఎవరితోనైనా ఇప్పించాలి. ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ .రమణ,బీ ఆర్ ఎస్ నేత వై .సతీష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.