Suryaa.co.in

Devotional

సాయి బాబా దేవుడా? కాదా?

ఇప్పుడు చర్చనీయాశం ,వివాదస్పదం అయిన విషయాల్లో ఇదొకటి!
ముందు సాయి గురించి మాట్లాడాలంటే..ఆయన ఒక ముస్లిం..ఎక్కడ కూడా ఆయన హిందూ సంప్రదాయాలు పాటించినట్లు మనం చూడలేదు..ఆయన ఒక సిద్దగురువుగా ,మసీదు లో ఉంటూ ..కొన్ని తన సొంత సిద్దాంతాలు ప్రతిపాదించడం జరిగింది..సాయి భక్తులందరూ వీటిని ఫాలో అవుతారు..

మరి ఏసు బోధలు పాటించే వారు క్రైస్తవులు,బుద్దుడి బోధలు పాటించే వారు బౌద్దులు,మహ్మద్ బోధలు పాటించే వారు మహమ్మదీయులు!

మరి సాయి బోదలు పాటించే వీరు ఎవరు?

వేద ప్రామాణ్యము కలవారు ,ప్రకృతి ఆరాధన చేసేవారిని మాత్రమే హిందువులని వివేకానంద కూడా చెప్పారు ..అలాంటప్పుడు ఏ శాస్త్ర ప్రమాణమూ లేని సాయి ఎలా దేవుడయ్యాడు..

హిందూ గ్రంథాల్లో ఎక్కడా సాయి అనే పేరు కనపడకపోవడం గమనించదగ్గ విషయం..

మరి దేని ఆధారంగా సాయిని దేవుడ్ని చేస్తున్నారు..?

దేవుడ్ని చేసుకోండి ,గుళ్ళు కట్టుకోండి మాకభ్యంతరం లేదు..కానీ ఏ సంబందం లేని ఒక పకీరుని తీసుకొచ్చి సనాతన ధర్మానికి అంట గట్టడం ఎంతవరకూ కరెక్ట్!
పూర్తి వేద బాహ్యమైన,అవైదికమైన సాయి తత్వాన్ని పూజలనూ సనాతన ధర్మం లో అంతర్భాగం చేయాలనుకోడం..

సనాతన ధర్మాన్ని అస్థిరపరచి సాయిని పరమాత్మ చేయాలనేది వాళ్ళ కుట్ర!
ఒకప్పుడు ఇలా వేద బాహ్యమైన ఆచారాలతో దేశం,ధర్మం క్షీణ దశలో ఉన్నప్పుడు
ఆదిశంకరులు వచ్చి సనాతన ధర్మ స్థాపన చేశారు..

మరలా ఇప్పుడు పూర్తి అవైదిక సాయి పూజసంప్రదాయం తో మకిలి పట్టిన సనాత హైందవ ధర్మ ప్రక్షాళనకు మళ్ళీ శంకర పీఠాలు నడుం బిగించాలి ప్రతీ ఒక హిందువు ఆలోచించాలి !

 

LEAVE A RESPONSE