ఆ హెరాయిన్.. హక్కానీదేనా?

 
– అది హైక్వాలిటీ హెరాయిన్
– దాని ధర కిలో 7 కోట్ల పైమాటే
– అది తాలిబన్ల పేరుతో పాక్ ఆడినా డ్రామా?
తాలిబాన్ అగ్ర నాయకుడు చనిపోయాడు.! ఇక, బారాదరి బందీగా ఉన్నాడు పాకిస్థాన్ చేతిలో.కాందహార్ లోని ఒక ఇంట్లో బారాదరీని బందీగా ఉంచి పాకిస్థాన్ అతి పెద్ద డ్రామా ఆడుతున్నది. తాలిబాన్ అగ్ర నాయకుడు హైబతుల్లా అఖున్జాద [Haibatullah Akhunzada ] చనిపోయినట్లు తెలుస్తున్నది .
హైబతుల్లా తాలిబాన్ నంబర్ 1, అయితే ముల్లా బరాదరీ నంబర్ 2 గా పరిగణిస్తారు. ముల్లా బారాదరీ ని కాందహార్ లో బందీగా ఉంచినట్లు తెలుస్తున్నది.లండన్ నుండి వెలువడే వెబ్ న్యూస్ పోర్టల్ ‘ది స్పెక్టేటర్’ కధనం ప్రకారం గత ఆగస్ట్ లో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షభవనం లో తాలిబాన్ లు హక్కానీ నెట్ వర్క్ నాయకులు సమావేశం అయినపుడు..  బరాదరీ తో పాటు అతని అనుచరులు అలాగే హక్కాని నెట్వర్క్ నాయకుడు ఖలీల్ –ఉర్ –రహమాన్ హక్కాని తో పాటు,  అతని అనుచరులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మొదట బారాదరీ ఎవరెవరికి ఏ ఏ పదవులు ఇవ్వదల్చుకున్నాడో పేర్లు చదవడం మొదలుపెట్టిన కొద్ది క్షణాలలోనే హక్కానీ ఆగ్రహంగా తన కుర్చీ లోనుండి లేచి మొదట అక్కడ ఉన్న వేడి గ్రీన్ టీ ఉన్న పెద్ద థెర్మోస్ ఫ్లాస్క్ ని బారాదరీ మీద విసిరి కొట్టాడు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న కుర్చీ తో బారాదరీ ని కొట్టాడు. అదే సమయంలో బారాదరీ అనుచరులు హక్కానీ అనుచరులతో బాహా బాహీ తలపడ్డారు. పరస్పరం తుపాకీలతో కాల్పులు జరుపుకున్నారు. సంఖ్య తెలియరాలేదు కానీ ఇరు వైపులా చాలామంది కాల్పులలో చనిపోయారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
తీవ్రంగా గాయపడ్డ బారాదరీ ని అక్కడ నుండి నేరుగా హాస్పిటల్ కి తీసుకెళ్ళి ప్రాధమిక చికిత్స చేసి అక్కడ నుండి కాందహార్ లోని గుర్తు తెలియని ప్రదేశం లో బందీగా ఉంచారు హక్కాని అనుచరులు.
ఇదంతా పాకిస్థాన్ ISI చీఫ్ అక్కడ ఉండగానే జరిగినది.తజక్ మైనారిటీ షియాలకి, అలాగే హజారా షియాల కి తన మంత్రి వర్గంలో స్థానం ఇవ్వడాన్ని హక్కానీ జీర్ణించుకోలేక పోయింది.
పాకిస్థాన్ కి షియాలకి మంత్రి పదవులు ఇవ్వడం అసలు ఇష్టం లేదు. కానీ దోహా లో చేసుకున్న ఒప్పందం ప్రకారం బారాదరీ తజక్ షియా మైనారిటీలకి మంత్రి పదవులు ఇవ్వాలనే పట్టుదలగా ఉన్నాడు.
తాలిబన్ల జెండా తో పాటు ఆఫ్ఘన్ జాతీయ జెండాలని రెండిటినీ అధ్యక్ష భవనం మీద, ఇతర ప్రభుత్వ కార్యాలయాల మీద ఎగుర వేయాలని బరాదరీ కోరిక. కానీ తాలిబాన్లు బలపడడం అస్సలు ఇష్టం లేని పాకిస్థాన్ తన పెంపుడు కుక్క హక్కానీ చేత దాడి చేయించింది.
ఇక గత మూడు వారాలుగా బరాదరీ కానీ తాలిబాన్ అగ్ర నాయకుడు హైబతుల్లా అఖున్జాద కానీ మీడియా ముందుకి రావడం కానీ ఇతర సమావేశాలకి కానీ హాజరవ్వలేదు. ఖతార్ విదేశాంగ మంత్రి కాబూల్ వచ్చినప్పుడు కూడా తాలిబాన్ అగ్ర నాయకులు సమావేశానికి రాలేదు.
కానీ, వారం రోజుల క్రిందట బరాదరీ చనిపోయాడు అని కాబూల్ లోకల్ న్యూస్ ఛానెల్స్ లో ప్రసారం అయిన తరువాత బారాదరీ మాట్లాడుతున్నట్లు ఒక వీడియొ మెసేజ్ ఆఫ్ఘన్ టెలివిజన్ ప్రసారం చేసింది. ఆ వీడియొ లో బరాదరీ నేను క్షేమంగానే ఉన్నాను అని సందేశం ఇచ్చాడు కానీ చుట్టూ ట్రైబల్ నాయకులు కూర్చొని ఉన్నారు కానీ బరాదరీ ఏదో తప్పనిసరి అన్నట్లుగా కెమెరా ముందు మాట్లాడినట్లు ఉంది కానీ చూసిన వాళ్ళకి బారాదరీ బందీగా ఉండి మాట్లాడుతున్నట్లుగా ఉంది.
అయితే గత మూడు వారాలుగా ‘హైబతుల్లా అఖున్జాద’ మాత్రం ఎక్కడా కనపడలేదు. నిజంగా హైబతుల్లా అఖున్జాద బ్రతికే ఉంటే బారాదరీ చేత వీడియొ తీసి చెప్పించినట్లు ‘హైబతుల్లా అఖున్జాద’ తో కూడా ఒక వీడియొ మెసేజ్ ప్రసారం చేసేవారు కదా ? కానీ చనిపోయిన వాడి చేత ఎలా మాట్లాడిస్తారు ?
So! అధ్యక్ష భవనంలో జరిగిన కాల్పులలో ‘హైబతుల్లా అఖున్జాద’ మరణించాడు అన్నమాట ! ఇప్పుడు తాలిబన్ల కి నాయకుడు అంటూ ఎవరూ లేరు. అంతా హక్కానీ నెట్వర్క్ అధికారం నడుస్తున్నది.
గత వారం అంటే సెప్టెంబర్ 13 న కాందహార్ నుండి రెండు కంటైనర్లు ఇరాన్ లోని బందర్ అబ్బాస్ పోర్ట్ ద్వారా గుజరాత్ ముంద్రా పోర్ట్ కి వచ్చినవి కేవలం హక్కానీ నెట్వర్క్ వాళ్ళవే ! పేరు తాలిబాన్ అని ప్రచారం జరుగుతున్నది.
21 వేల కోట్ల రూపాయల విలువచేసే కంసైన్మెంట్ బహుశా వెయ్యి కోట్లకి బేరం చేసి సరఫరా చేసి ఉండవచ్చు ఎందుకంటే 21 వేల కోట్లు ఖరీదు అనేది అంతర్జాతీయ మార్కెట్ రేట్ కానీ భారత్ లో ఉగ్రవాదులకి డబ్బు ఇచ్చే నెపం తో ఉచితంగానే పంపించి ఉండవచ్చు పాకిస్థాన్.
ఆదేమన్నా పాకిస్థాన్ డబ్బా ? గత 2015 నుండి టన్నుల కొద్దీ శుద్ధి చేసిన హై క్వాలిటీ హెరాయిన్ ఆఫ్ఘనిస్తాన్ లో గుట్టలు గుట్టలుగా పేరుకొని పోయి ఉన్నాయి. అధికారం హక్కానీ చేతిలో ఉంది కాబట్టి డబ్బు గురుంచి ఆలోచన ఉండదు కేవలం భారత్ లోని తమ స్లీపర్ సెల్స్ కి హెరాయిన్ చేరితే చాలు డబ్బు అదంతట అదే వస్తుంది..
ఇంతకీ కంసైన్మెంట్ కి ముందుగానే డబ్బులు ఎవరు చెల్లించారు ? ఎవరూ ఇచ్చి ఉండరు బహుశా ! పాకిస్తాన్ కంటైనర్ రవాణా ఖర్చులు పెట్టుకొని ఉంటుంది. ఇక్కడ దానిని విడిపించుకోవడానికి పెద్దగా డబ్బు అవసరం ఉండదు ఎందుకంటే టాల్కమ్ పౌడర్ అదీ సెమీ ఫినిష్ చేసింది టన్నుకి 8 డాలర్లు చెల్లిస్తే చాలు. గుజరాత్ నుండి కంటైనర్లు రవాణా చేయడానికి ఒక లక్ష రూపాయలు చాలు అది ఇక్కడి ఉగ్ర గ్రూపులు ఇచ్చేస్తాయి.
ఇక నుండి ఏది జరిగినా అది హక్కానీ నెట్వర్క్ కె చెందుతుంది తప్పితే తాలిబన్ల కి కాదు. మీడియా ప్రచారం చేస్తున్నట్లు తాలిబాన్లు 1995 లో ఉన్నంత బలవంతులు కాదు ఇప్పుడు కేవలం రోజుకూలి తీసుకొని పని చేసే పనివాళ్ళు మాత్రమే. అసలు వాళ్ళకి నాయకుడు అనే వాడు లేడు ఉన్న ఒక్క బరాదరీ పాకిస్థాన్ చేతిలో బందీగా ఉన్నాడు.
తాలిబాన్ పేరు ఉంటుంది కానీ హక్కాని చేస్తుంది లేదా చేయిస్తుంది. హక్కానీ అంటే పాకిస్థాన్ ! That’s It!
పట్టుబడ్డ 21 వేల కోట్ల రూపాయల హెరాయిన్ ని చాలా మీడియా సంస్థలు 2 వేల కోట్ల రూపాయలు అంటూ దుష్ప్రచారం చేస్తున్నాయి. దొరికింది హై క్వాలిటీ హెరాయిన్ అని ఫోరెన్సిక్ లాబ్ టెస్ట్ లో తెలిసింది. కిలో 7 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. ధనవంతులు 1 గ్రాము హై క్వాలిటీ హెరాయిన్ ని 7 లక్షలకి కొంటారు.
చెడ్డ పేరు తాలిబన్లకి ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నది పాకిస్థాన్. ఇక మీడియాలో మీరు తాలిబాన్ పేరు విన్నా,చూసినా, చదివినా దానిని హక్కానీ గా వినండి, చూడండి, చదవండి.

Leave a Reply