Suryaa.co.in

Andhra Pradesh

వైకుంఠపురం ప్రాజెక్టు ఇక వైకుంఠానికేనా?

– పాలకులలో సీరియస్‌నెస్ ఏదీ
– బనకచర్ల కంటే ముఖ్యమైన ప్రాజెక్టు
– కృష్ణా నది పైన వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం బహుళార్థక సాధక బ్యారేజీ ప్రయోజనాలు

వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం చేయడం వల్ల అనేక బహుళ ప్రయోజనాలు ఉన్నాయి అయినప్పటికీ కూటమి ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్యం వహిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజుల్లో అసెంబ్లీలో జరిగిన చర్చలో వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి అయ్యి రెండో సంవత్సరంలో అడుగుపెట్టినా కూడా వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం మీద ఎటువంటి కదిలిక లేదు

రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ఉన్న కాలంలో 2018 వ సంవత్సరంలో వైకుంటపురం బ్యారేజీకి శంకుస్థాపన చేశారు ప్రభుత్వం చివరి దశలో శంకుస్థాపన చేసిన ఆశించినంత స్థాయిలో పనులు జరగలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి జల వనరుల శాఖలో 25 శాతం లోపు లో ఉన్న పనులను అన్నిటిని రద్దు చేశారు. దీనివల్ల ఆనాటి కాంట్రాక్టర్ సంస్థ మిషనరీని తీసుకువెళ్లారు.

వైకుంఠపురం బ్యారేజీ పూర్తిస్థాయిలో నిర్మాణం జరగడానికి నిర్మాణం పనులు మొదలుపెట్టిన దగ్గర్నుంచి మినిమం 7 నుంచి 9 సంవత్సరాలు సమయం పడుతుంది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే కూటమి ప్రభుత్వం కూడా 2028 వరకు బ్యారేజీ నిర్మాణం గురించి పట్టించుకునే అవకాశాలు కనిపించడం లేదు

ఎన్నికలు మరో సంవత్సరంలో ఉన్నాయి అనగా శంకుస్థాపన చేసి మరల మేము వచ్చేనే వైకుంఠపురం బ్యారేజీ పనులు పూర్తవుతాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే టెండర్లను రద్దు చేస్తాడు వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం పూర్తి కావాలంటే మా పార్టీకి ఓట్లు వేస్తేనే ఈ ప్రాజెక్టు అవుతుంది అని చెప్పటానికి చూస్తున్నట్టుగా ఉంది ప్రస్తుతం పరిస్థితులు.

ప్రస్తుతం సంక్షేమ పథకాలకు కన్నతల్లి ప్రేమతో కొన్ని వేల కోట్ల రూపాయలను కేటాయించి అభివృద్ధిని సవతి తల్లి ప్రేమ లాగా చూస్తున్నారు.

వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలు

1.వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం పూర్తి చేయటం వల్ల కృష్ణా నదికి ఉపనదులు అయిన పాలేరు మున్నేరు కు వరదలు వచ్చిన సందర్భంలో ఆ నీరుని వైకుంటపురం బ్యారేజీలు నిలువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది

2. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం పూర్తి చేయటం వల్ల ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి.

3. ఆంధ్రుల రాజధాని అమరావతికి తాగునీరు అందించడానికి బాగా అనుకూలంగా ఉంటుంది.

4. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది

5. వైకుంఠపురం నుంచి పులిచింతల ప్రాజెక్టు వరకు కృష్ణా నదికి రెండు పక్కల కలిపి 70 పైగా సాగు తాగు సాగునీటి పథకాలు ఉన్నాయి ప్రస్తుతం ఎత్తిపోతల పథకాలకు సక్రమంగా నీరు అందటం లేదు సాలీ సాలనీ నీరు వల్ల మోటార్లు తరచూ రిపేరింగ్ వస్తున్నాయి దీనివల్ల కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది సాగునీరు అందక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు త్రాగునీరు అందక ప్రజానీకం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు

6. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం పూర్తి చేయడం వల్ల ఎన్టీఆర్ జిల్లాలోని దాములూరు గ్రామం నుంచి పులిచింతల ప్రాజెక్టు వరకు పది టీఎంసీలకు పైగా నీటి నిల్వ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది దీనివల్ల నదికి రెండు పక్కలా ఉన్న అనేక సాగు తాగునీటి ఎత్తిపోతల పథకాలు సమృద్ధిగా నడుస్తాయి

7. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం పూర్తి చేయటం వల్ల భవిష్యత్తు తరాలకు కొన్ని వేలకోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి పెట్టే అక్షయపాత్ర లాగా మారుతుంది

8. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది

9. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో కృష్ణా డెల్టాకు నీటి ఎద్దడి వచ్చినా కూడా వైకుంటపురం బ్యారేజీలో ఉన్న నీటిని కొంతవరకు వాడుకోవచ్చు

10. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా కృష్ణనదికి రెండు పక్కలా ఉన్న ప్రాంతాలకు లంక భూములు దివిసీమ వరదలు వచ్చిన సందర్భంలో ఇవి పూర్తిగా మునిగి పోతున్నాయి బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత వరదలను కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు

11. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం పూర్తి చేయడం వల్ల విజయవాడ మహా నగరానికి తాగునీటి ఎద్దడి లేకుండా చేయవచ్చు

12. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా వైకుంఠపురం నుంచి పులిచింతల వరకు జల రవాణా కు మంచి అనుకూలంగా ఉంటుంది దీనివల్ల లాంచీలు ప్రయాణం బలకట్టు ప్రయాణం ద్వారా జగ్గయ్యపేట ప్రాంతాల్లో ఉన్న సిమెంట్ ద్వారా సిమెంటు రవాణా తక్కువ ఖర్చుతో జల రవాణాకు అవకాశం ఉంటుంది ప్రయాణికానికి కూడా రాజధాని అమరావతికి విజయవాడకు ప్రయాణం అత్యంత సులభతరంగా ఉంటుంది

13. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా వైకుంటపురం నుంచి పులిచింతల ప్రాజెక్టు వరకు నిలిచిన పది టీఎంసీల నీటిలో మత్స్య సంపద అభివృద్ధి చెందుతుంది దీని ద్వారా అనేకమంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతారు

ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్న బ్యారేజీ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ముందుకు రాకపోవటానికి రాజకీయపరమైన కారణాలే ఉన్నాయా అనిపిస్తుంది ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ గా వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణాన్ని చూపెట్టి వాడుకోవచ్చు. ఓటర్లను సెంటిమెంట్ తో దెబ్బ కొట్టి ఓట్లు మొత్తాన్ని గుంత గప్పగా మన ఖాతాలో వేసుకోవచ్చు అనే ఆలోచన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.

అందువల్లే ఈ బ్యారేజీ నిర్మాణం గురించి ప్రస్తుతం పట్టించుకోవడం లేదు దీనిపైన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అనేక ప్రజాసంఘాలు స్వచ్ఛంద సంస్థలు రైతు సంఘాలు ముందుకు వచ్చి ఈ వైకుంఠపురం బ్యారేజీ యొక్క ఆవశ్యకత గురించి చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే తప్ప ఈ కోటకు ప్రభుత్వం ఈ వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణాన్ని మొదలుపెట్టే అవకాశం కల్పించడం లేదు.

LEAVE A RESPONSE