Suryaa.co.in

Political News

స్కిల్ స్కాం.. ఉన్నట్లా లేనట్లా?

ఎలక్ట్రోల్ బాండ్స్ కి హవాలా కు తేడా ఏంటో ఏజీపీకి తెలియదా…?
కాలయాపనకు మాత్రమే అనేక మలుపులు ఏజిపి స్కిల్ స్కాం కేసును తిప్పుతున్నారా?
ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా సేకరించిన ప్రతి రూపాయి హవాలా అయితే, ఇప్పుడు కోర్టు బోన్ లో ఏ ఏ పార్టీలు ఉండాలి?
ఇప్పటివరకు అత్యధికంగా 9189 కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో కొనుగోలు
వైసీపీకి 331 కోట్ల విరాళాలు

నిన్నటిదాకా స్కిల్ స్కాములో 370 కోట్ల రూపాయలు చంద్రబాబు కి లబ్ధి చే కోరుతుందని చెప్పి , ఈ రోజు 27 కోట్ల రూపాయలు టీడీపీ పార్టీకి హవాలా రూపంలో అందిందని చెబుతున్నారు. కానీ అది ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో అందిందని టిడిపి పార్టీ జమా ఖర్చుల నివేదిక చూస్తే తెలుస్తుంది. అంటే వీళ్ళకి హవాలా మార్గానికి, భారత ప్రభుత్వం చేత నిర్దేశించబడిన ఎలక్ట్రోరల్ బాండ్స్ పథకానికి కూడా తేడా తెలియదని అర్థం.

ఎలక్ట్రోరల్ బాండ్స్ అనేది అర్హత కలిగిన రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు. బ్యాంకింగ్ సాధనంగా ఉపయోగించబడుతుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 (43 ఆఫ్ 1951)లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ చేయబడి,గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల సభకు పోలైన ఓట్లలో ఒక శాతం కంటే తక్కువ కాకుండా సాధించిన రాజకీయ పార్టీని అర్హత కలిగిన రాజకీయ పార్టీ అంటారు.

ఈ పథకం కింద ఎలక్టోరల్ బాండ్‌లను భారత పౌరుడు లేదా భారతదేశంలో విలీనం చేసిన లేదా స్థాపించబడిన సంస్థలు కొనుగోలు చేయవచ్చు. తనకు నచ్చిన రాజకీయ పార్టీకి విరాళంగా అందజేయవచ్చు.

ఈ పథకం ప్రారంభించిన (2016-1017) దగ్గర్నుంచి, ఇప్పటివరకు (2021-2022) అత్యధికంగా 9189 కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో కొనుగోలు చేయబడి రాజకీయ పార్టీలకు అందచేయబడ్డాయి.
ఇవన్నీ వ్యక్తుల లేదా సంస్థల అకౌంట్ నుంచి డబ్బు జమ కాబడి ఒక్క SBI బ్రాంచ్ల ద్వారానే బాండ్ రూపంలో అందచేయబడతాయి.

ఇప్పటివరకు ఈ బాండ్ల రూపంలో అత్యధికంగా విరాళాలు పొందిన జాతీయ పార్టీలు
బిజెపి 5,272 CR
కాంగ్రెస్ 952 CR
అన్ని పార్టీలు 1784CR

ప్రాంతీయ పార్టీలు
తృణమూల్ కాంగ్రెస్ – 768cr
బిజూ జనతాదళ్ 622 cr
డీఎంకె 432 cr
బీఆర్‌ఎస్ 384 cr
వైసీపీ 331 cr గా గణాంకాలు ఉన్నాయి.

ఎలక్ట్రోరల్ బాండ్స్ ని పూర్తిగా లెక్కల్లోకి చూపించాలి. వ్యక్తులు వాడుకోవటానికి వీలు ఉండదు. 11 రాష్ట్రాల కు ఎన్నికలు జరిగిన 2020-2021 ముందు ఆర్థిక సంవత్సరం 2019-2020 లో అత్యధికంగా 2,665 కోట్లు విరాళంగా ఇవ్వబడ్డాయి. ఇవన్నీ తెలియకుండా విరాళాలుగా వచ్చిన డబ్బులను, క్విడ్ పోక్రో గా వచ్చిందని చెబుతున్న వారి ఆర్ధిక అవగాహన ఎంతవరకో అర్థం చేసుకోండి. ఈ వివరాలన్నీ కూడా సామాన్యులకు అర్థం కావటానికి ఇవ్వబడ్డాయి. ఎవరైనా సరే గూగుల్ లో చెక్ చేసుకోవచ్చనీ టిడిపి శ్రేణులు అంటున్నారు.

– ఘంటా వీరభద్రరావు

LEAVE A RESPONSE