భారతీయ యువతకు ఇది మంచి సమయం

– ప్రధాని మోదీ

తిరుచ్చిరాపల్లి: భారతీయ యువత తమ నైపుణ్యాలతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. చంద్రయాన్‌ వంటి ప్రయోగాలతో మన శాస్త్రవేత్తలు భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటారని ప్రశంసించారు.. తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో ఉన్న భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ”యువత ధైర్యవంతమైన సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలనే నినాదంతో భారతీదాసన్‌ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ప్రస్తుతం దేశ యువత అదే పనిలో నిమగ్నమై ఉంది. యువత అంటేనే శక్తికి నిదర్శనం. నైపుణ్యంతో వేగంగా పనిచేయడం వారికున్న సామర్థ్యం. దేశాభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు యువతకు ఇది మంచి సమయం. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా, నైపుణ్యాలను పెంచుకుంటూ, కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలి” అని యువతకు మోదీ సూచించారు.

Leave a Reply