Suryaa.co.in

Andhra Pradesh

దళితుల మేనమామని అని అనడానికి జగన్ కి సిగ్గుగా లేదా?

-అన్యాయంగా జైళ్లల్లో మగ్గుతున్న దళిత ఖైదీలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం కమిషన్ ను వేయాలి
-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

అన్యాయంగా జైళ్లల్లో మగ్గుతున్న దళిత ఖైదీలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం కమిషన్ ను వేసి విచారణ చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు…

కోడికత్తి శీను ఎందుకు ఐదున్నర సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్నాడు
కోడికత్తి శీను.. ఎందుకు చిన్న కేసులో ఐదున్నరేళ్లుగా జైల్లో మగ్గుతున్నాడో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణకు ఆదేశించాలి. రాష్ట్రంలో జైళ్లల్లో అనవసరంగా మగ్గుతున్న దళితుల స్థితిగతులపై ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలి. కోడికత్తి శీను కేసులో చంద్రబాబు అనుమతితో త్వరలో డిల్లీలోని సెంట్రల్ ఎస్సీ కమిషన్ ను కలుస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో దళితుల హాహాకారాలు వినిపిస్తున్నాయి. దళితుల ఘోష వినేవారే లేరా? అని జైళ్లలోని 8,551 మంది దళిత ఖైదీలు గగ్గోలు పెడుతున్నారు. చివరకు దళితులు దగాపడ్డ తమ్ముళ్లుగా మిగిలారని ముఖ్యమంత్రి గమనించాలి.

జగన్ ను అమాయక దళితులు నమ్మి, భ్రమపడి, మాయలోపడి ఓట్లేసి ఎగిరెగిరి తన్నించుకునే పరిస్థితులొచ్చాయి. డొక్కా మాణిక్య వరప్రసాద్ కు చంద్రబాబు 5 పదవులిచ్చి గౌరవించారు.. జగన్ 50 పదవులిస్తారని వెళ్లి భంగపడ్డారు. జగన్ ను నమ్మినందుకు పదిమందిలో భోరున ఏడ్చారు. ఎండమావుల్ని నీరు అనుకొని టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్లినవారు అనుభవిస్తున్నారు. డొక్కా జీవితం వారికి ఆదర్శం కావాలి. జగన్.. దళితులను తన ఇనుప పాదాలకింద వేసి పాతాళానికి తొక్కినట్టు తొక్కడాన్ని దళితులు గమనించాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. దళితులకు స్వాతంత్ర్యం వచ్చినట్లుగా లేదు.

రాష్ట్రంలో జగన్ ఇనుప పాదాల కింద దళితులు నలుగుతున్నారు
రాష్ట్రంలో మాల, మాదిగలు ప్రభుత్వ ఇనుప పాదాల కింద నలుగుతున్నారు. పోలీసులు ఛార్చిషీట్లు వేయటంలేదు, రిమాండ్ కు పంపి చేతులు దులుపుకుంటున్నారు, కేసులు దర్యాప్తు చేయడం లేదు. అందుకే జైళ్లలో దళితులు మగ్గుతున్నారు. ఎస్ ఐ కూడా సెల్యూట్ చేయని హోం మినిష్టర్ పదవిని దళిత మహిళకిచ్చి జగన్ అవమానపరిచారు.

– దళితుడైనందున కోడికత్తి శ్రీను ఐదున్నరేళ్లుగా జైల్లో మగ్గుతున్నాడు. జగన్ అతని విడుదలకు అంగీకరించడంలేదు. మామూలు సిటిజన్ కు ఉన్న రక్షణ దళితుడికి లేదా? ఉంటే ఐదున్నరేళ్లుగా చిన్న కేసులో కోడికత్తి శీనును జైల్లో ఎందుకు ఉంచారు? కోడికత్తి శీను జైలు నుంచి బయటకొస్తే జగన్ గుట్టు రట్టు అవుతుందని జగన్ కు భయం.
– బాబాయి తల నరికినోడు బయట ఉన్నాడు. కోడికత్తి గుచ్చినోడు మాత్రం ఐదున్నరేళ్లుగా జైల్లో మగ్గుతున్నాడు. ఇదెక్కడి న్యాయం? ఇప్పటికైనా సుప్రీం కోర్టు గౌరవనీయులైన ఛీఫ్ జస్టీస్ వైవీ చంద్రచూడ్ కల్పించుకొని కోడికత్తి శీనుకు న్యాయం చేయాలి.

కేవలం ఛార్జిషీటు వేయకుండా ఉన్న రిమాండ్ ఖైదీలు 2018లో 270 మంది ఉంటే 2022లో ఈ జగన్ ముఖ్యమంత్రిత్వంలో దళితుల 1470 మంది ఉన్నారు
కేవలం ఛార్జిషీటు వేయకుండా ఉన్న రిమాండ్ ఖైదీలు 2018లో 270 మంది ఉంటే 2022లో ఈ జగన్ ముఖ్యమంత్రిత్వంలో దళితుల 1470 మంది ఉన్నారు. జైళ్లల్లోని ఖైదీల హాజరుపట్టికను పరిశీలిస్తే అగ్ర కులాల సంఖ్య తగ్గింది, దళితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రభుత్వానికి, పోలీసులకు, జగన్ కు పట్టనప్పుడు వారికి దిక్కెవరు? ఈ దిక్కులేని వారి బయట ఉన్న వారసులు ఏమవ్వాలి. రాష్ట్ర దళితులందరూ కాస్త మనసు పెట్టి ఆలోచించాలి. డొక్కా మాణిక్యవరప్రసాద్ జగన్ ముఖారవిందాన్ని చూపించి పుణ్యం కట్టుకొండని ఆయన పది మందిలో ఏడ్వడం జగన్ మనస్తత్వాన్ని తెలుపుతోంది.

పూతలపట్టు ఎమ్మెల్యే బాబును కూడా భోరున ఏడ్చారు. తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇంతవరకు ఎమ్మెల్యే ముఖమే చూడలేదని బాబు అన్నాడు. టికెట్ ఇవ్వడంలేదని భోరున ఏడ్చాడు. జగన్ హయాంలో దళితుల పరిస్థితి ఇలా వుంది. వారికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర దళితులందరూ ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు దర్జాగా ఉండేవాడు. ఇప్పుడు ఒక తాగుబోతుని తిప్పినట్లుగా చొక్కావిప్పి తిప్పించారు.

జగన్ ఆదిమూలపు సురేష్ ను ఆట బొమ్మగా ఆడుకున్నాడు. నేను చంద్రబాబునాయుడుతో రోజూ మాట్లాడుతాను. ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉండి కూడా జగన్ తో మాట్లాడలేడు. చంద్రబాబు ఆలోచనల్లో నేను రోజూ పాలుపంచుకుంటాను, ఆదిమూలపు సురేష్ నీవు జగన్ ఆలోచనలతో పాలుపంచుకోగలవా? ఆదిమూలపు సురేష్ మున్సిపల్ శాఖలో ఏం జరుగుతోందో జగన్ ఏం చేయబోతున్నాడో నీకు తెలుసా?

జగన్ తాను దళితుల మేనమామనని చెప్పుకోవడం సిగ్గుచేటు
దళితుల మేనమామని అని అనడానికి జగన్ కి సిగ్గుగా లేదా? ఇంకా దళితులు జగన్ గురించి ఆలోచించడం వృధాయే. ఇప్పటికైనా దళితులు సరైన నిర్ణయం తీసుకోవాలి. కోడికత్తి శీనుని ఐదున్నరేళ్లుగా బాధపెడుతున్నందుకు నాకు సైతం బాధగా ఉంది. చంద్రబాబు తో 5 నిమిషాలు మాట్లాడుతాను. హైకోర్టు ఛీఫ్ జస్టీస్, సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టీస్ లు కోడికత్తి శీను కేసుపై స్పందించాలి. గుచ్చించుకొని లబ్దివపొంది అతన్ని మాత్రం జైలు పాలు చేయడంపై న్యాయశాస్త్రాలు ఏమీ చేయలేవా? భారతదేశపు పీనల్ కోడ్ ఏమీ చేయలేదా? క్రిమినల్ జ్యుడిస్పిరిడెంట్? ఇండియన్ ఈవెడెంట్స్ యాక్ట్? విజ్ఞులు, మేధావులు, పెద్దలు ఆలోచించి ఏం చేయలేరా?

వైసీపీలో ఉన్న దళిత నాయకులు సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకు కోడికత్తి శీనుని జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉంచుతున్నాడు? బయటికి రాకుండా తన శక్తి యుక్తులు ఉపయోగిస్తున్నాడు?. కోడికత్తి శీను కేసు కోసం, కోడికత్తి శీను బయటికి రాకుండా ఉండటానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉండి ఉండవచ్చు. రాష్ట్రంలో దళిత జాతి జైళ్లలో ఉంది. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటానికి కోడికత్తి శీను జగన్ ను కోడికత్తితో గుచ్చడం జరిగింది. వాడివల్ల జగన్ ముఖ్యమంత్రి అయ్యాడని ఇంకా కోడికత్తి శీనుకు రివార్డు, అవార్డు ఇవ్వాల్సిందిపోయి, ఐదున్నరేళ్లు జైల్లో ఉంచడం ఇదెక్కడి న్యాయం?

ఏమీ తెలియని వ్యక్తులను ఎంపీలు చేయడంలో జగన్ దిట్ట
ఎవరికీ ఏమీ తెలియని వ్యక్తులను కూడా ఎంపీలను చేయడం జగన్ కే చెల్లుతుంది. బాగా తెలివైనవాడిని ఎంపీగా చేస్తే అతను పార్లమెంటుకు వెళ్లి మాట్లాడుతాడు, అతని ద్వారా దళితులకు న్యాయం జరుగుతుంది. అందులో గొప్పతనముంది. ఏమీ తెలియని వ్యక్తిని ఎంపి చేయడంలో జగన్ గొప్పతనం ఇమిడివుంది. ఇప్పటికైనా జైళ్లల్లో ఉన్న దళిత బిడ్డలందరూ విడుదల కావాలి. త్వరలో ఇవన్నీ మా చంద్రబాబుకు సవివరగా వివరిస్తాం. న్యాయమూర్తులను కలుస్తాం. సవివరంగా విషయాలను తెలుపుతాం, ఒక విచారణ కమిటీని వేయమని కోరుతాం. దళిత వ్యతిరేక ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పాల్సిన అవసరం ఆసన్నమైందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వివరించారు.

LEAVE A RESPONSE