Suryaa.co.in

Andhra Pradesh

ప్రవీణ్ ప్రకాష్ వైసీపీలో చేరితే సరిపోతుంది

-ఏటా డీఎస్సీ అని హామీనిచ్చిన జగన్ రెడ్డి ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు
-ప్రవీణ్ ప్రకాష్ పై చర్య తీసుకోవాలి
-12 డీఎస్సీల ద్వారా దాదాపు లక్షా 70వేల ప్రభుత్వ టీచర్లను నియమించిన చరిత్ర టీడీపీది
-పేద విద్యార్ధులకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, విదేశీ విద్య వంటి పథకాలను రద్దు చేశారు
-జీవో నెం.117 తెచ్చి 25 వేల స్కూళ్లను మూసేసి, 50వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేశారు
-విద్యా హక్కు చట్టం గురించి అవగాహన లేని సీఎం జగన్ రెడ్డి
-విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జగన్ రెడ్డి తాబేదారులా మారిపోయారు
– శాసనమండలి మాజీ సభ్యులు ఏ.ఎస్ రామకృష్ణ

ప్రతి ఏటా మెగా డీఎష్సీ, నాడు – నేడు పనులు, సీపీఎస్ వారంలో రద్దు, పార్ట్ టైం లెక్చురర్లను రెగ్యులరైజ్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీని ప్రజలు నమ్మారు. తీరా అధికారంలోకి వచ్చాక విద్యలోని హామీలన్నింటిని తుంగలో తొక్కారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 2 డీఎస్సీలు వేసి 18వేల మంది టీచర్లను నియమించారు. డీఎష్సీలు నిర్వహించడంలో, ఉపాధ్యాయులను నియమించడంలో తెలుగుదేశం పార్టీ స్రభుత్వాలు ట్రెండ్ సెట్ చేసింది వాటిని ఇంత వరకు ఎవ్వరూ బద్దలుకొట్టలేకపోయారు.

టీడీపీ ఆవిర్బావం నుంచి ఎప్పుడు అధికారంలో ఉన్నా మొత్తం దాదాపు లక్షా 70వేల మంది ప్రభుత్వ టీచర్లను డీఎస్సీ ద్వారా నియమించిన ఘనత దక్కుతుంది. నాడు నేడు పథకం ద్వారా దండుకుంటున్నారు. స్కూళ్లను బాగు చేయాలన్న లక్ష్యం ఏ కోసానా లేదు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను ఎందుకు రద్దు చేశారు? విదేశీ విద్యతో 4,900 మంది బడుగు బలహీన వర్గాల విద్యార్ధులు లబ్ధి పొందారు కాని నేడు వారికి విదేశీ విద్యను దూరం చేశారు. అంబేద్కర్ పేరు తొలగించి జగన్ పేరు పెట్టుకున్నారు.

117 జీవో తెచ్చి 25వేలే స్కూళ్లను మూసేసి, 50వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసి, ఒక కి.మీ. దూరంలో ఉన్న 1,2,3 తరగతులను హైస్కూల్లో కలపడంతో విద్యావ్యవస్థ అస్థవ్యస్థమైంది. భూములు కొట్టేసేందుకు ఎయిడెడ్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారు. మున్సిపల్ స్కూళ్ల ఆస్తులను కొట్టేసేందుకు ప్రయత్నించారు. విద్య పట్ల అవగాహన లేని సీఎం జగన్ రెడ్డి. తిరుపతిలో ఇండియా టుడే లో జగన్ మాట్లాడుతూ.. మనకు కావాల్సింది నాణ్యమైన విద్యా హక్కు చట్టం అంటున్నారు. ప్రపంచంలో ఎక్కడా అటువంటిది లేదు. ఆదేశిక సూత్రాలో ఉన్న దానిని 2009లో కేంద్రం 82వ రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చిన విద్యా హక్కు చట్టం తీసుకువచ్చారు.

ఏప్రిల్ 01, 2010 నుంచి అమలు అవుతుందని జగన్ రెడ్డికి తెలియదు. ఆ చట్టంలోనే నాణ్యత ఉంటుంది. ఉదాహరణకు 8వ తరగతి వరకు తప్పని సరిగా తెలుగు మీడియాన్ని బోధించాలి. కాని జగన్ రెడ్డి వాటిని పాటించడం లేదు. ఇంగ్లీష్ మీడియానికి మేము వ్యతిరేకం కాదు. ఎవరో కొంత మంది చెప్పిన మాట విని 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టారు. అందుకు ఫలితంగా 8 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు తరలిపోయారు.

గత 76 ఏళ్లల్లో ప్రజావ్యతిరేక, అన్యామైన విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ లాంటి అధికారిని ఎప్పుడూ చూడలేదు, వినలేదు. చరిత్రలో దరిద్రమైన అధికారిగా ఈయన నిలిచిపోతాడు. అధికారం ఉంది కదా అని స్కూళ్లకు వెళ్లి నేరుగా పరీక్షిస్తారు. నీ కింద అధికారులు ఉండి ఏం ఉపయోగం. సస్పెండ్ చేయడమే ఈయన పని. తప్పును సరి చేయాల్సింది పోయి సస్పెండ్ చేయడం తప్పా మరేమి చేతకాదు. విద్యా శాఖ ద్వారా వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయించారు.

ప్లస్ 2 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, అప్ గ్రేడెడ్ హైస్కూల్స్ 504 ఉన్నాయి. గత ఏడాది మే 15 నుంచి అడ్మిషన్లు చేశారు. ఇప్పుడు మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. అలాంటప్పుడు గత ఏడాది లానే అడ్మిషన్లు చేయవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు పెట్టారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 1 వరకు విద్యార్ధులు సెలవల్లో ఉంటారు. టీచర్లు తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం నిర్వహిస్తున్న నాడు నేడు, విద్యాకానుక, గోరుముద్దలు, ఉచిత పుస్తకాల గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుందని చెప్పాలి. తద్వారా జగన్ రెడ్డికి ఓట్లు పెరగుతాయన్న ఉద్దేశ్యంతో వైసీపీకి తాబేదారుగా పని చేస్తున్నారు. ప్రవీణ్ ప్రకాష్ కు నిజంగా రాజకీయాల మీద అంత ప్రేమ ఉంటే రాజీనామా చేసి వైసీపీలో చేరితే సరిపోతుంది.

ఒక వైపు ప్రైవేటు కళాశాల్లో నోటిఫికేషన్ రాకముందే అడ్మిషన్లు చేయవద్దని ప్రభుత్వం ఒక వైపు చెబుతూ మరో వైపు ప్రభుత్వ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు పెట్టడం అన్యాయం. సెలవల్లో ఉండాల్సిన లెక్చులర్లను బలి చేస్తున్నారు. ఇంటర్ జనరల్ 88, నాన్ పారామెడికల్ లో క్లాస్ కి 40 మంది, పారా మెడికల్ లో క్లాస్ కి 30 మంది ఉండాలని హుకుం జారీచేశారు. విద్యార్ధులకు మేలు చేస్తున్నామంటూ తల్లిదండ్రులకు టీచర్లు నూరుపోయాలంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంత వరకు అధ్యాపకులే లేరు. టీచర్లను బలిపశువులు చేయవద్దు.

ఎన్నికల ప్రచారం చేస్తున్నారని టీచర్లను ఎన్నికల కమీషన్ సస్పెండ్ చేస్తే బాధ్యులు ఎవరు? ఈ ఏడాది 1 నుంచి 10వ తరగతి వరకు టెస్ట్ పుస్తకాలు ప్రింట్ చేసే బాధ్యత రూ.600 కోట్లకు పాత కాంట్రాక్టర్లకే ఇచ్చి దోచుకున్నారు. అంతే కాకుండా దాని మీద జగన్ బొమ్మను కొనసాగిస్తున్నారు. అదే విధంగా విద్యా కానుక మీద జేవికే అంటూ ముద్రిస్తున్నారు. ఈ పుస్తకాలన్నింటిని ఎన్నికల కమీషన్ చూపించిన తరువాతే ప్రచురణ చేయాలి. వైసీపీ దింపుడు కల్లం ఆశలో ఉంది. విద్యను కూడా ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారు. దీనిపై ఎన్నికల కమీషన్ విచారణ జరిపి ప్రవీణ్ ప్రకాష్ పై చర్య తీసుకోవాలి.

LEAVE A RESPONSE