ఏపీ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

కడప లోక్‌సభ నుంచి బరిలో షర్మిల

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిలారెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సోమవారం ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. కడప నుంచి వై.ఎస్‌.షర్మిల, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జె.డి.శీలం, కాకినాడ నుంచి పళ్లంరాజు, అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్‌, విశాఖ నుంచి సత్యారెడ్డి, ఏలూరు నుంచి కావూరి లావణ్య, రాజంపేట నుంచి నజీర్‌ అహ్మద, చిత్తూరు నుంచి చిట్టిబాబు, హిందూపురం నుంచి షాహిన్‌ పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఎన్నికల్లో పోటీకి దూరంగా రఘువీరారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు.

Leave a Reply