Suryaa.co.in

Andhra Pradesh

నూజివీడు నేతలతో చంద్రబాబునాయుడు భేటీ

నూజివీడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన ఎంపీటీసీలు, సర్పంచులతో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలలో వారు చేసిన దౌర్జన్యాలు, అరాచకాలు అంతా ఇంతా కాదు. ప్రారంభంలో మన వాళ్లను అనేక ఇబ్బందులు పెట్టారు. మీరు సర్పంచులుగా పోటీ చేసి గెలిచినా కూడా వైసీపీ గెలిచినట్లుగా ప్రకటించుకున్నారు. ఎక్కడైతే వీరోచితంగా పోరాటం చేశారో అక్కడే తెలుగుదేశం పార్టీ గెలిచింది.
28 శాతానికి పైగా తెలుగుదేశం పార్టీ గెలవటం జరిగింది. ఈ ఎన్నికలను పార్టీ బహిష్కరించినా.. మీరు పోటీ చేసి గెలచారంటే అది మీకు పార్టీపై ఉన్న అభిమానం. మిమ్మల్నందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేమాదిరిగా మున్సిపాల్టీ ఎన్నికల్లో కూడా అనేక అరాచకాలు చేశారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నీతిలేని రాజకీయాలు చేశారు. ఎన్నికలకు ముందు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేశారని చంద్రబాబునాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE