Suryaa.co.in

Telangana

కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే

-దామోదర్ రెడ్డి హయాంలోనే సూర్యాపేట అభివృద్ధి
-రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్
-అర్హులైన వారందరికీ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు
రుణమాఫీ చేస్తాం
– రోడ్ షోలో నల్గొండ కాంగ్రెస్అ భ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి
-జానారెడ్డి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది
– దామోదర్ రెడ్డి

సూర్యాపేట : సూర్యాపేట అభివృద్ధి దామోదర్ రెడ్డి హయాంలోనే జరిగింది. పాలేరు రిజర్వాయర్ నుంచి సూర్యాపేటకు నీళ్లు అందించిందే జానారెడ్డి. సూర్యాపేటకు జగదీశ్ రెడ్డి ఏం చేశారో సమాధానం చెప్పాలి? బీజేపీ కి బీఆర్ఎస్ బీ టీమ్..ఇరుపార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి.

సూర్యాపేటకు ఇప్పటి వరకు బీజేపీ చేసిందేమీ లేదు..ఇక చేయబోయేది కూడా ఏమీలేదు. బీఆర్ఎస్ గత పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి పోయింది. అయినా..రేవంత్ సారథ్యంలోని మన ప్రజా ప్రభుత్వం ఐదు గ్యారెంటీలను అమలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటో తారీఖునే ప్రభుత్వోద్యోగులకు వేతనాలు అందుతున్నాయి. అర్హులైన వారందరికీ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం.. రుణమాఫీ చేస్తాం.

కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది పెద్దలు దామోదర్ రెడ్డితో కలిసి సూర్యాపేట అభివృద్ధికి కృషి చేస్తా. బీజేపీ, బీఆర్ఎస్ లకు ఒక్క ఓటు పడకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదే. ఈ రెండ్రోజులు మీరు కష్టపడండి.. వచ్చే ఐదేళ్లు మిమల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. సూర్యాపేట నుంచి భారీ మెజార్టీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపైనే ఉంది.

వార్ వన్ సైడే: దామోదర్ రెడ్డి
నల్గొండ పార్లమెంట్ లో వార్ వన్ సైడే. రఘువీర్ రెడ్డి గెలుపు పక్కా.. భారీ మెజార్టీయే మనందరి లక్ష్యం. సూర్యాపేట నుంచి 50 వేల మెజార్టీ ఇవ్వాలి. కాంగ్రెస్ ర్యాలీతో బీఆర్ఎస్ గుండెలో దడపుట్టింది. సూర్యాపేటకు పదేళ్లలో అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ చేసింది శూన్యం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దేశంలోనే అత్యధిక శాఖలు, అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన ఘనత జానారెడ్డిది. సూర్యాపేటలోని రహదారులన్నీ జానారెడ్డి పుణ్యమే. జానారెడ్డి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ప్రతీ ఒక్క కార్యకర్త ఈ రెండ్రోజులు కష్టపడి రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఎల్లవేళలా నా ఇంటి తలుపులు మీ కోసమే తెరిచి ఉంటాయి. ఇవాళ ఆయా పార్టీల నుంచి వెయ్యి మంది పార్టీలో చేరడం సంతోషం.

LEAVE A RESPONSE