Suryaa.co.in

Telangana

మంది పెళ్ళిళ్ళలకు మంగళహారతి పెట్టినట్టు ఉంది

– రేవంత్ రెడ్డి వచ్చాక ఆగం ఆగం జగన్నాథం
– క్యాబినెట్ లో అర గ్యారెంటీ పైన కూడా చర్చ జరగలేదు
– బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్

ఖమ్మం: నిరుద్యోగ యువతకు, ఉద్యోగస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.6 గంటల పాటు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆరు గ్యారెంటీలు కాదు కదా అర గ్యారెంటీ పైన కూడా చర్చ జరగలేదు.

రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉందని ప్రజలను నమ్మించడం కోసం క్యాబినెట్ సమావేశం పెట్టినట్టుంది.

ప్రజల సమస్యలు చర్చించడానికి కాదు. ప్రజా వ్యతిరేకత కప్పి పుచ్చడం కోసం ఈ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. రాజీవ్ యువ వికాసానికి 16 లక్షల 22 వేల అప్లికేషన్ లు వచ్చాయని, అది వికాసం చెందక ముందే విధ్వంసం అయింది. ఊరిచ్చి ఊరిచ్చీ ఒక్క పీఆర్సీ ఇస్తానంటున్నారు. 2వది ఆరు నెలల తర్వాత అంటున్నారు. అది హక్కుగా వచ్చేదే కదా? మీ గొప్పదనం ఏంటి?

ఇదే జిల్లాకు చెందిన మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రవేశ పెట్టారు. కాబట్టి, దాని పై క్యాబినెట్ లో ఎందుకు చర్చించలేదో చెప్పాలి. కాంట్రాక్ట్ ఉద్యోగుల శ్రమదోపిడి పై చర్చ జరగాలి. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వారికి కూడా ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయం అందాలి.

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ పై చర్చ లేదు. ఉద్యోగ నోటిఫికేషన్ ల పై క్లారిటీ రాలేదు. క్యాబినెట్ సమావేశంలో ఏం చర్చ జరిగింది అసలు!? ఎట్టకేలకు రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని, క్యాబినెట్ అంటూ ఒకటి ఉందని, గెలిపించి అధికారం ఇచ్చిన కర్మకు ఆర్నెళ్లకోసారి ప్రజల గురించి ఆలోచిస్తున్నారని మీడియా ద్వారా ప్రజలకు చెప్పడం కోసం ఈ క్యాబినెట్ మీటింగ్ పెట్టినట్టు స్పష్టమైంది.

ఎనకటికి ఒక సామెత ఉండేది. ముందు నాగలి సక్కగ పోతే వెనక నాగలి సక్కగ వస్తదని.. కానీ, కాంగ్రెస్ పార్టీలో దేశవ్యాప్తంగా మొదటి నుండి అంత వంకరేనాయె. రేవంత్ రెడ్డి వచ్చాక ఆది ఇంకా ఆగం ఆగం జగన్నాథం అయ్యే.

కానీ, ఈ క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు చూస్తే ప్రజల సమస్యలు దూరం చేయడానికి, పాలన పై చిత్తశుద్ధి తో పెట్టినట్టు లేదు. ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చడం కోసం పాలనకు డెంటింగ్ చెయ్యడం కోసం పెట్టినట్టుంది.

6 గంటల పైగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణమైన ఆరు గ్యారంటీల అమలు పై అసలు చర్చ జరగలేదు. ఆరు గ్యారెంటీలు కాదుకదా అర గ్యారంటీ పైన కూడా క్లారిటీ ఇవ్వలేదు. ప్రజలంతా ఆశగా ఎదురుచూసిన అంశాలు కాకుండా, ఇందులో కూడా ఏ నిర్ణయం తీసుకుంటే అందులో కొంత కమిషన్ నలవొచ్చో చూసుకొని వాటినే ముందేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

యువత ఎంతో ఆశగా ఎదురుచూసిన ఉద్యోగ నోటిఫికేషన్ ల పై ఊసే లేదు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగాల పై మాట్లాడుతారు అనుకున్నాం. ఆఖరికి క్యాబినెట్ సమావేశంలో కూడా ఉద్యోగాల ఊసే లేదు. పైగా ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ ఉద్యోగాల అంశం వచ్చినా 60 వేల ఉద్యోగాలు నేనే ఇచ్చామని బుకాయిస్తున్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం లో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లకు అపాయింట్మెంట్ లీటర్లు ఇచ్చి నేనే ఇచ్చానని పోసులు కొడుతున్నారు. ఇది చూస్తుంటే రేవంత్ రెడ్డి వ్యవహారం మంది పెళ్ళిళ్ళలకు మంగళహారతి పెట్టినట్టు ఉంది.

స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అబద్ధాల కొరుగా పట్టపగలే అబద్ధాల నిజం చెయ్యడానికి సిగ్గు లేకుండా ప్రయత్నం చేస్తుంటే ఇంకెవరు నమ్ముతారు? అందుకే నిస్సిగ్గుగా నన్నెవరూ నమ్మడం లేదు. దొంగను చూసినట్టు చూస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. నీలాంటి వాణ్ణి అలాగే చూస్తారు మరి!

ప్రియాంక గాంధీ వచ్చి యూత్ డిక్లరేషన్ ఇచ్చారు. 125 ఏళ్ల గ్రాండ్ ఓల్డ్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా తెలంగాణ ఇక నమ్మే పరిస్థితి లేదు. 18 నెలల నుండి పీఆర్సీ ప్రస్తావనే లేదు.

 

 

 

LEAVE A RESPONSE