Suryaa.co.in

Andhra Pradesh

మిర్చి పంటలను కాపాడింది టీడీపీ ప్రభుత్వమే

– పయ్యావుల కేశవ్

విడపనకల్ ఏప్రిల్ 29: మండల పరిధి జనార్దనపల్లి, వేల్పుమడుగు, పెద్ద కొట్టాలపల్లి, వి కొత్తకోట, విడపనకల్, ఆర్. కొట్టాల గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పయ్యావుల కేశవ్ రోడ్ షో

ఆయా గ్రామాలలో పయ్యావుల కేశవ్ కి మహిళలు హారతులతో స్వాగతం పలికారు కార్యకర్తలు, నాయకులు భారీ జనసందోహం నడుమ కేశవ్ రోడ్ షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..
విడపనకల్ మండలంలో రైతులకు జిబిసి ఆయుపట్టు, దీని క్రింద సాగుచేసిన మిర్చి ఇతర పంటలను టీడీపీ హయాం 2016లో జిబిసి కి సాగునీరు బంద్ అయితే ఆరోజు ప్రభుత్వాన్ని ఒప్పించి గవర్నమెంట్ ఇంజనీర్లు కాదంటే.. ప్రవేట్ ఇంజనీర్ల ద్వారా సర్వే చేయించి హంద్రీనీవా నీటిని జిబిసి కాలువకు మల్లించి వేల ఎకరాల మిర్చి పంటలను కాపాడింది టీడీపీ పార్టీనే.

అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసింది ఈ పయ్యావుల కేశవ్ వే..
ప్రస్తుతం 2016లోని పరిస్థితి మిర్చి రైతులకు ఈసారి ఏర్పడితే అధికార పార్టీలో ఉన్నా కూడ విశ్వేశ్వరెడ్డి ఒక్క ఎకరానికి కూడ సాగునీరు అందివ్వలేకపోయాడు. దీనితో మిర్చి రైతులు వందల కోట్లు రూపాయలు నష్టపోయారు. పెద్ద కొట్టాలపల్లిలో హంద్రీనీవా కాలువ పనులు చేసి ఉంటే వేల ఎకరాలు సాగులేకి వచ్చేవి అని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక్క గంప కాలువ మట్టి కూడ తీయించలేకపోయింది అన్నారు.
జనార్ధన పల్లిలో టీడీపీ ప్రభుత్వంలో 245రేషన్ కార్డులు ఉంటే 84రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం తొలగించింది. 99పెన్షన్ లు వస్తుంటే 33తొలగించారు. ఈ గ్రామంలో స్కూల్స్ కావచ్చు, అంగన్వాడీ కేంద్రం కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, మండల కేంద్రం నుంచి జనార్దనపల్లికి తారు రోడ్డు కావచ్చు.. విడపనకల్ సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ నుండి వేల్పుమడుగు మీదగా పైప్ లైన్ వేయించింది నేనే అన్నారు. జనార్దనపల్లికి ఏమి చేసిన కూడ అది పయ్యావుల కేశవ్ తప్ప వేరే ఎవరూ చేయలేదని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE