Suryaa.co.in

Telangana

నేను నా భార్య సంభాషణ కూడా వినడం నీచం

– స్వేచ్ఛ ను హరించడం దుర్మార్గం
– ప్రభాకర్ రావు కి ఆదేశాలు ఇచ్చింది ఎవరో నిగ్గు తేల్చాలి.
– SIB, ఇంటిలిజెన్స్ అన్నీ ముఖ్యమంత్రుల అధీనంలో ఉంటాయి. అప్పటి సీఎం కేసీఆర్ ఉన్నారు
– ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చింది ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలి
– చట్టప్రకారం శిక్ష పడేలా చేయాలి లేదంటే వారితో ఈ ప్రభుత్వం కుమ్మక్కయినట్టే
– కాలయాపనతో ఎవరికి లాభం చేస్తున్నారు?
– ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉందా ? లేదా ?
– మీకు చేతకాకపోతే నిజాయితీగా సీబీఐకి అప్పగించండి వారు తేలుస్తారు.
-మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
– ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో సిట్ ఎదుట ఈటల రాజేందర్
– ఈటల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన సిట్ అధికారులు

హైదరాబాద్: రాజ్యాంగం కల్పించిన వ్యక్తి స్వేచ్ఛ హరించే అధికారం ఎవరికీ లేదు. దేశ భద్రత ప్రజల ప్రాణాలు తీసే వారి మీద పెట్టాల్సిన నిఘా మా మీద పెట్టారు.

నాయకుల వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులు, గన్ మాన్ల ఫోన్ టాపింగ్ చేశారు.

ప్రతి నిమిషం ఎక్కడ ఉన్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అని నిఘా పెట్టారు.

నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడే 2018 లోనే , నన్ను హుజురాబాద్ లో ఓడగొట్టేందుకు ప్రయత్నం చేశారు.

2021 లో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో 6 నెలల కాలంపాటు ఎన్నికల ప్రచారంలో కూడా టాప్ చేసి నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకొని.. నాయకులను బెదిరించి, డబ్బులు, పదవులు ఆశ చూసి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేశారు.

వందల ఆధారాలు చూపించారు. మా నాయకుల సంభాషణ కూడా వినిపించారు.

గజ్వేల్, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో కూడా ప్రతిక్షణం ట్యాపింగ్ చేశారు.

దమ్ము ధైర్యం లేనివాడు, నేరుగా యుద్ధం చేసే సత్తా లేనివాడు ఇలాంటి దుర్మార్గాలు చేస్తారు.

నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్న కాలయాపన చేయొద్దు. సంవత్సరం గడిచిపోయింది. అనేక కమీషన్లు వేశారు. విద్యుత్ కొనుగోళ్ళ మీద వేసిన కమీషన్ ఏమైందో తెలియదు. ఫోన్ టాపింగ్ కమీషన్, కాళేశ్వరం కమీషన్ రిపోర్ట్ ఇంకా రాలేదు. నాకు అనిపిస్తుంది ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉందా ? లేదా ?

బిఆరెస్, బీజేపీ ఒకటే అని చెప్పే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. లోపాయికారి ఒప్పందం లేకపోతే , లాలూచీ పడకపోతే ఎందుకు తూ తూ మంత్రంగా.. ఎందుకు నత్త నడకన ఈ ఎంక్వైరీ నడుస్తుంది? రిపోర్ట్ బయట ఎందుకు పెట్టడంలేదు. ఎందుకు భాద్యుల మీద చర్యలు తీసుకోవడం లేదు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది.

ప్రభాకర్ రావు డైరెక్ట్ ఐపీఎస్ కాదు, ప్రమోటీ. కెసిఆర్ చుట్టరికమా, చెప్తే వింటాడనా ఎందుకు వేసుకున్నారు? చట్టానికి లోబడి పనిచేసే వారు కాదు. నా ఇష్టానుసారం పనిచేసే వారు ఉండాలని నిబంధనలకు విరుద్ధంగా నియమించారు.

రిటైర్ అయ్యాక కొనసాగించడం భాద్యత రాహిత్యం. కేంద్రం ఆదేశాలను తుంగలో తొక్కారు అనడానికి నిదర్శనం.

గొప్ప వాడు అయితే సలహాదారుగా పెట్టుకోవాలి తప్ప భాధ్యతయుతమైన పోస్ట్లలో పెట్టవద్దు. ఒక ఐపీఎస్, ఐజీ స్థాయి అధికారి ఉండాల్సిన చోట అక్రమంగా నియమించారు. కీలకమైన రాష్ట్ర దేశ భవిష్యత్తుంకోసం పనిచేసే ఇంటెలిజెన్స్

సీఎం కనుసన్నల్లో ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా ప్రభాకర్ రావు ను అక్రమంగా నియమించారు. 9 నెలల పాటు పని చేయించారు. ప్రణీత్ రావు, భుజంగరావు, రాధా కిషన్ రావు అందరూ పైన అధికారుల ఆదేశాల మేరకు పనిచేశామంటున్నారు. సమాచారం సేకరించడం, పని అయ్యాక కాలబెట్టామని కూడా చెప్తున్నారు.

స్వయంగా ప్రభాకర్ రావు చెప్పేది ఏంటంటే.. నేను చెప్పిన వారివే కాక వేరే ఫోన్లు.. బిజినెస్ సినిమా రంగంలో ఉన్న వారివి కూడా టాప్ చేసినట్టు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత బాధాకరమైన అంశం ఒక రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న ఇంద్రసేన రెడ్డి , జడ్జిల, మంత్రుల, ఎమ్మెల్యేల ఫోన్ టాప్ చేయడం దుర్మార్గం. పోలీసు అధికారుల ఫోన్ కూడా టాప్ చేశారట.

1975 లో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి దేశాన్ని జైలుగా మార్చి కొంతమందిని అడ్రస్ లేకుండా చావగొట్టిన నల్ల చీకటి అధ్యాయాలు, మళ్లీ ఈ రూపంలో కనిపిస్తున్నాయి. 50 ఏళ్లు గడిచింది ఎమర్జెన్సీ ముగిసి. ఫోన్ టాప్ చేసి అక్రమాలు దుర్మార్గాలు జరిపారు. ఈ విచారణ నత్తనడక కాకుండా, ఎవరి ఆదేశం మేరకు ఈ ప్రభాకర్ రావు పనిచేశారు. ఎందుకు ధ్వంసం చేశారు? సమగ్ర విచారణ జరగాలి.

మా భార్య నడుపుతున్న జమున హాచరీ అందరివి టాప్ చేశారు. వారి మధ్య ఉన్న చాట్ కూడా నాకు ఈరోజు చూపించారు. విక్రమ్ రెడ్డి, గిరి వర్ధన్ రెడ్డి, సతీష్, వేణు గోపాల్ రెడ్డి, సాయి అందరి స్టేట్మెంట్ తీసుకున్నారు. 2021 లో ప్రతి నిమిషం నిఘా పెట్టారు.

అధికారులందరూ ప్రభాకర్ రావు ఆదేశాలు మేరకు టాప్పింగ్ చేశామంటున్నారు. ప్రభాకర్ రావు ఎవరీ అండతో ఇది చేశారు? SIB, ఇంటిలిజెన్స్ అన్నీ ముఖ్యమంత్రుల అధీనంలో ఉంటాయి. అప్పటి సీఎం కేసీఆర్ ఉన్నారు. ఈ సీఎంకి తెలుసు కదా సమాధానం చెప్పాలి. ఇంటెలిజెన్స్, SIB గోప్యంగా పనిచేయాలి. కానీ వాటి చరిత్ర ఇంత మలినపడుతుంది అని ఊహించలేదు. నేను నా భార్య సంభాషణ కూడా వినడం నీచం దుర్మార్గం.
ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే, నిజాయితీ లేకపోతే మేమున్నాం. సీబీఐ కి అప్పగించండి. ఎవరు బాధ్యులో దోషులో ఎంతటి వారైనా తేల్చి శిక్షించే సత్తా సీబీఐ కి ఉంది.

 

LEAVE A RESPONSE