Suryaa.co.in

Telangana

ఇజ్రాయిల్ నుంచి మృతదేహం తెప్పించాలని రాజేశం గౌడ్ విజ్ఞప్తి

– స్పందించిన ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్

హైదరాబాద్: ఇటీవల ఇజ్రాయిల్ దేశంలో మృతి చెందిన జగిత్యాల పట్టణం మార్కెట్ ప్రాంతానికి చెందిన రేవెల్ల రవీందర్ (57) మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తెప్పించాలని మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్ మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్ లోని ప్రవాసీ ప్రజావాణి లో సీనియర్ ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్ కు వినతిపత్రం సమర్పించారు. ఆయన వెంట తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి ఉన్నారు.

వెంటనే స్పందించిన దివ్యా దేవరాజన్ రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ ఎన్నారై విభాగం ఐఏఎస్ అధికారి సిహెచ్ శివ లింగయ్య తో మాట్లాడారు. ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్ లోని ఇండియన్ ఎంబసీతో, ఢిల్లీ లోని విదేశాంగ శాఖతో సమన్వయము చేసి త్వరగా మృతదేహాన్ని తెప్పించాలని సూచించారు.

LEAVE A RESPONSE