Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో జే.ట్యాక్స్, జిల్లాలో మినిస్టర్ ట్యాక్స్, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ట్యాక్స్

– కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరిస్తే పనులెలా సాగుతాయి.?
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
దేశంలో ఎక్కడైనా కొబ్బరికాయ కొట్టి పనులు మొదలు పెడితే రాష్ట్రంలో మాత్రం జే.ట్యాక్స్ కట్టి పనులు పనులు ప్రారంభించాల్సి వస్తోంది. రాష్ట్రంలో జె.ఎమ్.ఎమ్ ట్యాక్సులు దందా నడుస్తోంది. రాష్ట్ర స్థాయిలో జేట్యాక్స్.. జిల్లా స్థాయిలో మినిస్టర్ ట్యాక్స్.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ట్యాక్సులు చెల్లిస్తేనే వైసీపీ నేతలు పనులు చేయనిస్తున్నారు. ఈ మూడు రకాల ట్యాక్సుల దందాతో రాష్ట్రం అదోగతిపాలవుతోంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి సన్నిహితుడు జయరామిరెడ్డి బరితెగింపులే ఇందుకు నిదర్శనం. వీరి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా.
రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం పనులు చేసే ముందు వైసీపీ ఎమ్మెల్యేలను కలసి ముడుపులు చెల్లించాలా.? పనులు చేపట్టిన వారిని బెదిరించడం ఎంత సిగ్గుచేటు.? మీ తీరుతో రాష్ట్రంలో ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. లిక్కర్, ఇసుక, మైనింగ్, పేకాట ద్వారా వచ్చేయం సరిపోక ఇప్పుడు కాంట్రాక్టర్లపై పడ్డారు. రెండేళ్ల కాలంలో వందలాది మంది కాంట్రాక్టర్లు పనులు చేపట్టి మీ దోపిడీకి భయపడి వెళ్లిపోయారు. పనుల్లో బ్రిడ్లు వేసేందుకు రావడానికి కూడా జంకుతున్నారు. ముడుపుల కోసం బెదిరించి పనులు చేయకుండా తరిమేస్తున్నారు. రాష్ట్రంలో రోడ్లు వేయడం మర్చిపోయారు.
సరైన బాటలు లేక ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. జగన్నాద రథ చక్రాలొస్తున్నాయని ప్రజలకు చెప్పి..వాహనాల చక్రాలు ఊడిపోయేలా పాలన చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనలు సాగనివ్వండి. రోడ్లు సరిగా లేక ప్రజలు వాహనాల నుండి ప్రజలు పడిపోయే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. మీరు తీరు ఇలాగే వుంటే..రహదారుల గోతుల్లో మిమ్మల్ని, మీపార్టీని తొక్కేస్తారు.

LEAVE A RESPONSE