– రైతుల పంటను కాళ్లతో తొక్కి ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు
– ఐదు బేళ్ల పొగాకును కాళ్లతో తొక్కి పనికిరాకుండా చేసిన వైనం
– పనికిరాని పంటను ఎవరు కొంటారని రైతుల ఆవేదన
– జగన్ పొదిలి పర్యటనలో పొగాకు రైతుకు పొగ
(కిరణ్‌కుమార్)
జగన్ పార్టీ కార్యకర్తల ఆనందం.. వందలాది పొగాకు రైతుల పాలిట విషాదంగా మారింది. జగన్ రెడ్డి మూక ఇప్పుడు పొదిలి పొగాకు రైతుల పాలిట యమదండంగా మారింది. పాపం, కష్టపడి పండించిన పొగాకును మదపుటేనుగుల లెక్కన తొక్కి నాశనం చేస్తే, ఆ రైతుల కన్నీళ్లకు దిక్కు ఎవరు? జగన్ ముఖ్యమంత్రిగా లేడు, కనీసం ప్రతిపక్క్ష నేత కాదు. కనీసం పులివెందుల ఎమ్మెల్యేగా అన్నదాతలపై జాలి ఉండాలి కదా!
జగన్‌ను పొగాకు రైతులు పట్టించుకోలేదు.. అందుకే ఈ విధ్వంసం సృష్టించారు.. రైతుల మీద కోపంతో కష్టపడి పండించిన వాళ్ల పంటను ధ్వంసం చేశారు.. “5 బేళ్లు తెస్తే అన్నిటిని తొక్కేశారు.. ఆకు మొత్తం చెడిపోయింది. చెడిపోయిన పొగాకు బేళ్లను ఎవరు కొంటారు. రేటు లేకపోవడం కాదు ఆయనొచ్చి అసలు అమ్ముడుపోకుండానే చేశాడు” అని ఓ రైతు కంట నీరు పెట్టుకుంటే.. నెంబరు, పచ్చ, మాడు. అమ్ముకునే వాళ్ళం చివరకు జగన్ వచ్చి ‘సూర’ అమ్ముకునే పరిస్థితి తెచ్చాడు.. అంటూ మరో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు..
ఇలా చేసి మళ్లీ.. సిగ్గు లేకుండా ప్రభుత్వం పై మాట్లాడటం ఏంటి? రైతులకు ఇంతకంటే ఘోర అవమానం ఇంకేమైనా ఉంటుందా?
పొగాకు బేళ్ళను నాశనం చేసిన ఈ “గంజాయి రౌడీ మూక” పనులు చూస్తుంటే, వీరు మామూలు మనుషులు కాదని స్పష్టమవుతోంది. ఇదంతా మత్తు ప్రభావమేనా? రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి అన్నదాతల నోట్లో మట్టి కొట్టడం ఎంతవరకు సమంజసం?