Suryaa.co.in

Andhra Pradesh

జగనే పెద్ద వెన్నుపోటు దారుడు

– జిల్లా టిడిపి అధ్యక్షులు గండి బాబ్జి

విశాఖ: కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను అని రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జి అన్నారు.

మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

వైసిపికి వెన్నుపోటు దినం నిర్వహించే నైతిక హక్కు లేదు. జగనే పెద్ద వెన్నుపోటు దారుడు అని పేర్కొన్నారు శివ కుమార్ కి వెన్నుపోటు పొడిచి పార్టీ ని జగన్ తీసుకున్నాడు. బాబాయ్య కి గొడ్డలి పోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహిస్తావా? అని ఎద్దేవా చేశారు సొంత చెల్లికి, తల్లికి వెన్ను పోటు పొడిచింది నువ్వు కాదా అని ప్రశ్నించారు.

రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్, దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ సీతం రాజు సుధాకర్ మాట్లాడుతూ..జగన్ అధికారంలోకి రావడంతోనే విధ్వంసంతో పాలన మొదలుపెట్టాడు . ఆపాలనను చూసి రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందు రాలేకపోయారు. చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసినప్పుడు 100 దేశాలలో నిరసన తెలిపారు.

అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి విధ్వంసం తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయాడు. వాలంటీర్లు నియామాకం చేసి వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టాడు వారు ఎక్కడ ఉద్యోగం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే గద్దలాగా వాలిపోదామని ఎదురుచూసే వ్యక్తిత్వం జగన్ ది అని మండిపడ్డారు. నేను నా అనే ధోరణితో వైసిపి కార్యకర్తలు కూడా రోడ్డుమీద పడితే పరిస్థితికి తీసుకొచ్చాడు జగన్ అని అన్నారు.

LEAVE A RESPONSE