Suryaa.co.in

Andhra Pradesh

ఇదిగో… జగన్ గారు మళ్లీ స్టేజ్ మీదకి వచ్చేసారు!

(బాబు)

ఇప్పటి ప్రభుత్వాన్ని భూ కేటాయింపుల మీద దుమ్మెత్తిపోస్తూ మాట్లాడుతున్నారు. కానీ మన వాడికి జ్ఞాపకశక్తి కొంచెం కాస్త వెలితిగా ఉంటుంది…

జస్ట్ రిమైండ్ చేస్తే సరిపోతుంది –
“భూ కేటాయింపుల” లో మాస్టరు ప్లాన్ వేసింది ఎవరు?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉండగా, కోట్లాది రూపాయల విలువైన లక్షలాది ఎకరాల భూములు అటు కర్ణాటక సరిహద్దు లేపాక్షి నాలెడ్జ్ హబ్, అనంతపురంలో సైన్స్ హబ్, రంగారెడ్డి జిల్లాలో అరబిందోకు, ప్రకాశంలో వాన్ పిక్, తమ కుటుంబానికి సరస్వతీ, కడపలో బ్రహ్మణీ స్టిల్స్, దాని గాలి ఎయిర్పోర్టుకు పదివేల ఎకరాలు, బోయింగ్ బోత్లిక్ అని ఇంటర్నేషనల్ డాన్ దిమిత్రీ ఫిర్టాస్ వరకు ప్రైవేట్ కంపెనీలకు గిఫ్ట్ ప్యాకెట్లలా ఇచ్చిన విషయం గుర్తుందా జగన్ గారు?

ఆఖరికి అమ్మతమ్ముడు రవీంద్ర నాథ్ రెడ్డికి కూడా ఇచ్చేసి భూమ్మరిది అనే మీడియాలలో చదివిన ఆ నాటి రోజులు గుర్తుకువస్తున్నాయి.

అక్కడి నుండి “క్విడ్ ప్రో కో” కథ మొదలైంది…
“నీవు నాకూ భూములు ఇవ్వు, నేనూ నీ పేపర్లో పెట్టుబడులు పెడతా!” అన్న సూత్రంతో జగన్ గారు “సాక్షి మీడియా సామ్రాజ్యం, భారతి సిమెంట్స్” నిర్మించారు.

ఇప్పుడు భూ కేటాయింపుల మీద నైతికత లెక్చర్లు ఇచ్చే స్థాయి ఎప్పుడొచ్చిందండీ?

జగన్ గారి విమర్శలు వింటుంటే, “దెయ్యాలు వేదాలు వల్లించినట్టు” అనిపిస్తోంది. “తన కంట్లోని దూలం కనిపించదు కానీ, ఎదుటి వారి కంట్లోని నలుసు కనిపిస్తుంది” అన్న సామెత గుర్తుకు వస్తుంది.

బపూన్ లెక్కన లూలూ గ్రూపును లిల్లీ గ్రూపు అంటూ.. భూములు రివర్స్ టెండర్ల మీద కట్టబెట్టరు ప్రభ్యత్వ పాలసీల ప్రకారం కట్టబెడతారని కూడా అయిదేళ్లు నేర్చుకోకుండా.. సజ్జల నుండి పెద్దిరెడ్డి వరకు అడవులు కూడా కట్టబెట్టేసి మాట్లాడితే… జనం ఉమ్మేస్తారు.

మట్టికూడా త్రవ్వేసి భూములు ఇవ్వాలి కాబోలు ఈ కమెడియన్ మాటల ప్రకారం.

ఈయన అవినీతి కేసుల జాబితా ఫెస్బుక్ ఫీడ్ లాగా స్క్రోల్ అవుతోంది జనం మదిలో.

జగన్ గారూ, మీకు తప్పుల పాఠాలు చెప్పే అర్హత ఈ జన్మకు రాదు.

ముందుగా మీరు వేసిన మానిఫెస్టోలో భూముల మీద పెట్టిన ఒడంబడికలు గుర్తు చేసుకోండి.
వెనుక తిరిగి చూస్తే – మీ పాలన కాలంలో “భూమి” అనేది “బహుమతి”గా మారిపోయింది.

ఇప్పుడు ఎవరైనా ప్రాజెక్ట్ కోసం భూమిని ఇచ్చినా – అది పారదర్శకంగా ఇస్తే – మీరు సాక్షి టీవీల్లో కామెడీగా కూడా అరిచే హక్కు లేదు.

ఇంకొంచెం జ్ఞాపకశక్తి రీఫ్రెష్ చేస్తే బాగుంటుంది –
“క్విడ్ ప్రో కో” పండితుడు వచ్చి “నైతికత” బోధిస్తే జనం ఫక్కున నవ్వుతారు!

LEAVE A RESPONSE