Home » జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ

జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ

-జగన్ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చిన బందిపోటు
-ఐదేళ్లలో జగన్ అండ్ కో ఉత్తరాంధ్రలో రూ.40 వేల కోట్ల విలువైన ఆస్తులు కొట్టేశారు
-నాడు ఐటి హబ్ గా ఉన్న విశాఖ నేడు గంజాయి హబ్ గా మారింది
-అగ్గిపెట్టె లాంటి ఇళ్ళులు కట్టి గొప్పలు చెబుతున్నారు..మేం రాగానే 3 సెంట్ల స్థలంలో పేదలకు ఇళ్ళు నిర్మిస్తాం
-ఈ రాష్ట్రానికి నేనే సేఫ్ డ్రైవర్ ని, రాష్ట్రం కోసమే టీడీపీ, జనసేన బీజేపీ పొత్తు
-శృంగవరపు కోటను విశాఖ జిల్లాలో కలుపుతాం
-శృంగవరపు కోట ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

శృంగవరపుకోట ఎన్నికల సమరానికి శృంగవరపుకోట సై అంటోంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలనలో నిండామునిగిన ప్రజల్లో బాధ, ఆవేదన, ఆక్రందన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ 43వ ప్రజాగళం సభ.. మన సభలకు భారీగా  ప్రజల నుంచి స్పందన వస్తోంది. ఊర్లకు ఊర్లు కదులుతున్నాయి.. ఎక్కడికక్కడ జనసముద్రాన్ని తలపించేవిధంగా సభలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పాలన అంతం కావాలి మా అందరి భవిష్యత్తు భాగుండాలనేది మీ అందరి ఆకాంక్ష.

హుద్‍హుద్ తుఫాన్ కంటే దారుణమైన తుఫాన్ మే13వ తేదీన రాజకీయ తుఫాన్ రాబోతోంది. ఈ దెబ్బకు వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. వైసీపీ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా బతికే పరిస్థితి ఉందా? గుంటూరుకు చెందిన కోవూరి లక్ష్మీ ఆదర్శ మహిళామండలిని నిర్వహిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషిచేసే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.

రాష్ట్రంలో విచ్చవిడిగా గంజాయి సరఫరా, ప్రైవేట్ భూముల కబ్జాపై పోరాటం చేసింది. రాష్ట్రంలో అరాచకాలపై ప్రధాని మోదీ, సీజేఐని కలవడానికి ప్రయత్నిస్తే అనుమతి లభించకపోతే నిరసనగా కోవూరి లక్ష్మీ తన బొటన వేలు కట్ చేసుకుని నిరసన తెలిపింది. నా బొటనవేలు పోయిన పర్వాలేదు వైసీపీ అరాచక పాలన పోవాలి, ప్రజలకు న్యాయం జరగాలని సంకల్పించిందంటే.. రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి.

రాష్ట్రంలో ప్రతి శుక్రవారం విధ్వంసాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం లేదు నియంతృత్వం, అహంకారికి సైకో తనం కలిసివచ్చిన పాలన సాగుతోంది. ఎస్.కోటలో విచ్చలవిడిగా గంజాయి విక్రయిస్తున్నారు. రాష్ట్రమంతా గంజాయి, డ్రగ్స్, నాసిరకం మద్యం మయమైంది. ఓ వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు.

దేశంలో ఎక్కడ గంజాయి మూలలు దొరికినా విశాఖను నుంచి వచ్చిందనే బాధాకరమైన పరిస్థితి తీసుకొచ్చారు. విశాఖను భూబకాసురులు దోచుకున్నారు. ప్రశాంతమైన ఈ ప్రాంతానికి వైసీపీ రాక్షసమూక వచ్చి కూల్చివేతలు, సెటిల్‍మెంట్లు, కబ్జాలు, భూమాఫియాతో కొల్లగొట్టి అశాంతి, అలజడి నెలకొల్పారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ప్రశాంతమైన విశాఖ మరో పులివెందులగా మారిపోరే పరిస్థితి ఉంది. పులివెందుల రౌడీ రాజకీయాలు ఇక్కడ సాగనీయకూడదు.

టీడీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయి.. జగన్ వస్తే గంజాయి వస్తుంది. ఉత్తరాంధ్రలో రూ.40 వేల కోట్ల విలువైన ఆస్తులు కొట్టేశారు. సెంట్ పట్టాల పేరుతో స్మశానాలు, వాగులు, వంకలు, అడవుల్లో స్థాలాలు ఇచ్చి పేదలకు ద్రోహం చేశారు. ఇంటి నిర్మాణానికి కేవలం కేంద్రనిధులనే ఇచ్చి అగ్గిపెట్టిలాంటి ఇళ్లు కట్టారు. టీడీపీ అధికారంలోకి వస్తే రెండు లేక మూడు సెంట్ల స్థలం ఇచ్చి ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అన్ని సౌకర్యాలు, హంగులతో టిడ్కో ఇళ్లు నిర్మిస్తే.. వాటిని పేదలకు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు.

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో జగన్ రెడ్డి మీ భూములపై పడే పరిస్థితికొచ్చారు. మీకు పూర్వీకుల నుంచి వచ్చిన స్థలాల పట్టాదారు పాసుపుస్తకంపై సైకో ఫోటో వేయడం ఏంటని అడుగుతున్నా. మీ భూముల సర్వే రాళ్లపై సైతం సైకో జగన్ రెడ్డి బొమ్మ వేశారు. భూ రికార్డ్ అన్ని తొలగించి మీ ఆస్తులు మొత్తం ఆన్‍లైన్ చేసి.. పెత్తనం జగన్ రెడ్డి చేతిలో పెట్టుకొని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే మన ఆస్తులు కూడా దోచుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. మీ బిడ్డ బిడ్డ అంటూ వస్తున్న జగన్ రెడ్డి.. ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ.

రాష్ట్రంలో కొత్తగా గులకరాయి డ్రామాను చూశారు. జగన్ మీటింగ్‍లో కరెంట్ ఎలా కట్ అయ్యింది.. నా మీటింగుల్లో ఎక్కడా పవర్ కట్ కాలేదు. మీపైన నమ్మకం లేకనే జనరైటర్‍ సైతం ఏర్పాటు చేసుకున్నాం. కేవలం గులకరాయి డ్రామా కోసమే పవర్ కట్ నాటకాలు ఆడారు. సింపతీ ఓట్ల కోసం డ్రామాలాడే దుర్మార్గుడు జగన్ రెడ్డి. జగన్ బాబాయ్ వివేకాను చంపి నాపై హత్యాయత్నం కేసు పెట్టాడా లేదా. విశాఖలో కోడికత్తి డ్రామా నాపై నెట్టాలని చూశాడు. మళ్లీ ఎన్నికలు వచ్చినందుకే గులకరాయి డ్రామా మొదలుపెట్టారు. నేను, పవన్ కల్యాణ్ సభల్లో రాళ్లు, కర్రలతో దాడి చేశారు.

టీడీపీ పాలనలో రూ.200 ఉన్న కరెంట్ బిల్లు క్యాన్సర్ గడ్డ పాలనలో రూ.1000కి చేరింది. నా పాలనలో ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు.. భవిష్యత్తులో పెంచబోమని చెప్పా. ఈ పాలనలో రూ.60 ఉన్న మద్యం ధర రూ.200కు చేరింది. నాసిరకమైన మద్యం సరఫరాతో ప్రజల ప్రణాలతో చెలగాటమాడుతున్నాడు క్యాన్సర్ గడ్డ జగన్ రెడ్డి. క్యాన్సర్ గడ్డ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. నిరుద్యోగంలో సైతం దేశంలో ఏపీ మొదటిస్థానంలో ఉంది.

ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నా. డీఎస్సీ నిర్వహించారా?, జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? పెట్టుబడులు వచ్చాయా? అని ప్రశ్నిస్తున్నా. యువగళం కింద మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే పెట్టి.. టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. నా హాయంలో ఎనిమిది డీఎస్సీలు, ఎన్టీఆర్ హాయాంలో మూడు డీఎస్సీలు కలిపి టీడీపీ హాయంలో మొత్తం 11 డీఎస్సీలు నిర్వహించాం. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 75 శాతం టీడీపీ హాయంలో ఉద్యోగాలు పొందినవారే.

వాలంటీర్ల జీతాల పెంచుతాం
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తాం. వైసీపీ నేతల బెదిరింపుకు భయపడి ఎవరూ రాజీనామా చేయకండి. వాలంటీర్లకు జీతాలు పెంచడంతో పాటు లక్షలు సంపాధించే మార్గం చూపిస్తాం. వాలంటీర్లు ఒత్తిడి కారణంగా తప్పు చేయకుండా, రాజీనామా చేయకుండా తిరుగుబాటు చేయాలి. అహంకారి, దోపిడీదాడురు, విధ్వంసకారుడు మీ జీవితాలను నాశనం చేయాలని ఆలోచిస్తున్నాడు. వాలంటీర్లలో స్కిల్స్ అభివృద్ధి చేసి ఆదుకుంటాం.

కూటమి అధికారంలోకిరాగానే
విశాఖ జిల్లాలో ఉండాల్సిన ఎస్.కోటను విజయనగరం జిల్లాలో పెట్టారు. మంత్రి బొత్స రాజకీయ స్వార్థం కోసం ప్రజాభిష్టానీకి వ్యతిరేకంగా ఎస్.కోటను విజయనగరంలో కలిపారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్.కోటను అభివృద్ధి చెందిన విశాఖ జిల్లాలో చేర్చి అభివృద్ధి చేస్తాం.

Leave a Reply