వివేకా హత్యకేసులో సీబీఐ బిగిస్తున్న ఉచ్చు నుంచి తనను, తన శ్రీమతిని కాపాడుకోవడానికే జగన్ రెడ్డి ఢిల్లీ యాత్ర

– విచారణలో ఇన్నివాస్తవాలు బయటపడ్డాక చట్టం చట్రం నుంచి ఎలా తప్పించుకుంటారు ముఖ్యమంత్రి గారు?
• అవినాశ్ రెడ్డి కాల్ లిస్ట్ లో సీబీఐ గుర్తించిన నవీన్ ఎవరు?
• నవీన్ కు ఫోన్ చేస్తే, అతను శ్రీమతి భారతికి ఫోన్ ఇస్తాడని, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలంటే మరోఫోన్ కి కాల్ చేస్తానన్న అవినాశ్ రెడ్డి వ్యాఖ్యలపై ఏం చెబుతారు ముఖ్యమంత్రి గారు?
• వివేకాహత్యజరిగిన రోజు, అవినాశ్ రెడ్డి ఫోన్లో శ్రీమతి భారతి, జగన్మోహన్ రెడ్డిలతో ఏం మాట్లాడాడో ప్రజలకు తెలియచేయండి.
• వివేకాహత్యకేసు అనే రాజకోట రహస్యానికి, తాడేపల్లి అంతపురానికి సంబంధం లేదని ముఖ్యమంత్రిగా మీరు చెప్పగలరా?
• ఇంత జరిగిన తర్వాత ఇంకా బుకాయించకుండా, సీబీఐ ముందు నిజాలు కక్కాలని ముఖ్యమంత్రికి సూచిస్తున్నాం.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

వివేకాహత్యోదంతం అనే రాజకోట రహస్యానికి, తాడేపల్లి అంత:పురానికి ఉన్న సంబంధం ఏమిటో, అవినాశ్ రెడ్డి కాల్ లిస్ట్ లో సీబీఐ గుర్తించిన నవీన్ ఎవరో, అవినాశ్ రెడ్డి అతనికి ఫోన్ చేసి, శ్రీమతి భారతితో ఎలామాట్లాడాడో, తనతో మాట్లాడటానికి అవినాశ్ రెడ్డి ఎవరికి ఫోన్ చేసేవాడో ముఖ్యమంత్రే చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే…

“అవినాశ్ రెడ్డి కాల్ లిస్ట్ లో సీబీఐ గుర్తించిన నవీన్ ఎవరు? వివేకాహత్యజరిగిన రోజున అవినాశ్ రెడ్డి, నవీన్ కు ఎన్నోసార్లు ఫోన్ చేసింది నిజంకాదా? అవినాశ్ రెడ్డి ఫోన్ చేసినప్రతిసారి నవీన్ ద్వారా ఆఫోన్ ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి భారతికి వెళ్లింది నిజంకాదా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలంటే, నవీన్ వద్ద ఉం డే మరోఫోన్ కి అవినాశ్ రెడ్డి కాల్ చేసింది వాస్తవంకాదా? నిన్నటినుంచి ముఖ్యమం త్రి హావభావాలు, ముఖకవళికలు కుడితిలో పడ్డ ఎలుకలా ప్రస్ఫుటంగా కనిపించాయి. నిన్న ఆయన హాడావుడిగా ఢిల్లీ వెళ్లిన విధానం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీలో జరిగే పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి హాజరుకావాల్సిన పనిలేదు.

సీబీఐ ఉచ్చునుంచి రక్షించుకోవడానికే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్ర
వివేకా హత్యకేసు నుంచి తనను, తన సతీమణిని రక్షించుకోవడానికే జగన్ రెడ్డి ఢిల్లీ యాత్ర చేపట్టారు. సీబీఐ ఉచ్చు మీ దంపతుల మెడకు చుట్టుకోకుండా ఉండటానికా.. కాదా ముఖ్యమంత్రిగారు? వివేకాహత్య జరిగినప్పుడు నారాసుర రక్తచరిత్ర అన్నారు. ఇప్పుడు రోజుకొకటిగా బయటికొస్తున్న వాస్తవాలతో వ్యవహారం మొత్తం జగనాసుర రక్తచరిత్రగా మారింది. వివేకానందరెడ్డి పోస్ట్ మార్టమ్ నివేదిక చూస్తే, గొడ్డలిపోట్లకు ఎలా కట్టుకట్టారో తెలుస్తుంది. అదేదో సినిమాలో మాదిరి శవానికి చికిత్స చేశారు.

వివేకానందరెడ్డి శవానికి కుట్లు వేశారని, అదిహత్యని మీకు, మీ సతీమణికి తెలియదా ముఖ్యమంత్రి గారు? వివేకానందరెడ్డి తల రెండుముక్కలయ్యాక కూడా ఆత్మహత్యగా చిత్రీకరించిన విధానం మీకు తెలియదా? హత్యజరిగినప్పుడు విచారణకోసం వచ్చిన పోలీసుల్ని పక్కకు పంపించమని మీకు ఎవరుచెప్పారు ముఖ్యమంత్రి గారు? వివేకా హత్యను గుండెపోటు అనిచెప్పిన ఏ2 ఎక్కడున్నాడు? వివేకాహత్య జరిగిన తర్వాత ఎన్నిడ్రామాలు ఆడారు ముఖ్యమంత్రిగారు? మీలో పెద్ద నటుడుఉన్నాడు అని నిరూ పించుకున్నాడు. చంద్రబాబే వివేకానందరెడ్డిని చంపించాడని, నారాసుర రక్తచరిత్ర అని మొసలికన్నీరు కార్చారు.

హత్యపై సీబీఐ దర్యాప్తు కావాలని కోర్టులో పిటిషన్ వేశారు. గవర్నర్ ని కలిసి తనతప్పేమీ లేదన్నారు. ఇంతచేసిన మీరు, ముఖ్యమంత్రి అయ్యాక సీబీఐ దర్యాప్తు కోరుతూ వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కు తీసుకున్నారో ఇప్పుడైనా సమాధానం చెప్పండి జగన్ గారు. ముఖ్యమంత్రి హోదాలో ఒక్కరోజు కూడా వివేకా హత్యకేసు దర్యాప్తుపై ఎందుకు సమీక్ష చేయలేకపోయారు? స్థానిక పోలీస్ సీబీఐకి ఎందుకు సహకరించలేదనే ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారు?

కొల్లురవీంద్ర పీఏకు ఫోన్ వచ్చిందని, మాజీమంత్రిని 58రోజులు జైల్లో పెట్టించిన జగన్మోహన్ రెడ్డిగారు, అవినాశ్ రెడ్డి నుంచి మీకు వచ్చిన ఫోన్లకు ఎన్నిరోజులు జైల్లో ఉంటారు?
హత్యకేసు విచారణ ఈ స్టేజ్ కు వచ్చాక తనను తాను ముఖ్యమంత్రి ఎలా రక్షించుకుం టారు? చట్టం చట్రం నుంచి ఎలా తప్పించుకుంటారు? మచిలీపట్నంలో హత్యజరిగిన తర్వాత ఏదో ఒక ఫోన్ కాల్ మాజీమంత్రి కొల్లురవీంద్ర పీఏకు వచ్చిందని, రవీంద్రని అరెస్ట్ చేసి 58రోజులు జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఇప్పుడు మీకు వచ్చిన ఫోన్ కాల్స్ పై ఎన్నిరోజులు జైల్లో ఉంటారు? వివేకా హత్యజరిగాక మీకు, మీ శ్రీమతికి ఎన్నిఫోన్లు వచ్చాయో చెప్పండి? హత్యకేసు విచారణలో ఇంత బయటపడ్డాక కూడా మీకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉందా?

సీబీఐ ఎప్పుడైతే నవీన్ కు నోటీసులు ఇచ్చిందో, అప్పుడే జగనాసుర రక్తచరిత్ర బట్టబయలైంది. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలు లేకుండా ఇదంతా జరగలేదంటే సమా ధానం చెప్పగలరా ముఖ్యమంత్రి గారు? హత్యగురించి అంతా బయటపడ్డాక హైదరా బాద్ వెళ్లి, సీబీఐ విచారణకు సహకరించకుండా, ఢిల్లీ పర్యటనలు ఎందుకు ముఖ్య మంత్రి గారు? కడపఎంపీ సీటుకోసమే వివేకానందరెడ్డి హత్యజరిగిందని మీ సొంతచెల్లి షర్మిల చెప్పిన దానిపై మీ దగ్గర సమాధానం ఉందా? సీబీఐ ఛార్జ్ షీట్ లో కడపఎంపీ సీటు కోసమే వివేకాహత్యజరిగిందని రాసింది నిజంకాదా? హత్య జరిగినప్పుడు అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి సాక్ష్యాలు చెరిపేసింది నిజం కాదా?

వివేకాహత్యకు రూ.40కోట్ల సుపారీ ఇచ్చారు. అవినాశ్ రెడ్డి తన ఆస్తులన్నీ రూ.18వేలేనని ఎన్నికల అఫిడవిట్లో చెప్పాడు. అలాంటప్పుడు వివేకాహహత్యకోసం హంతకులకు రూ.40కోట్లు ఇచ్చిందిఎవరు? వివేకానందరెడ్డి కూతురు శ్రీమతి సునీత పడిన కష్టాని కి ఫలితం ఇప్పుడు దక్కబోతోంది. ముఖ్యమంత్రిగా తన గౌరవం కాపాడుకోవాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉంటే, ఆయన తక్షణమే వివేకాహత్య జరిగింది మొదలు నేటివరకు తొక్కిపెట్టిన అన్నివాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి” అని రామయ్య డిమాండ్ చేశారు.

Leave a Reply