Home » జగన్ రాజకీయ డ్రామా..

జగన్ రాజకీయ డ్రామా..

-షర్మిల హీరో.. రాధాకృష్ణ, కేసీఆర్ ప్రధాన పాత్రధారులు.. రేవంత్ ప్రత్యర్థి పాత్రధారి?
తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీ పెట్ట‌డం వెన‌క ఉన్నది జ‌గ‌నేన‌ని ఒక కొత్త సీక్రెట్ బయటపడింది… తెలంగాణ‌లో రేవంత్ రెడ్డిని అడ్డుకోవ‌డం కోసమే జ‌గ‌న్ త‌న చెల్లితో ఈ వ్యూహాన్ని అమ‌లు ప‌రుస్తున్నార‌ని ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. జగన్ అటు కేసీఆర్ ను, ఇటు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ‌ను వారికే తెలియకుండా వాడుకుంటున్నార‌నే టాక్ స్పష్టంగా వినిపిస్తోంది.
జగన్ – కేసీఆర్ : ఎవరు ఎవర్ని వాడుతున్నారు?
ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉండ‌డం వ‌ల్ల అటు ఏపీలో అధికారం ప‌రంగానూ.. ఇటు హైద‌రాబాద్‌లో ఉన్న త‌న వ్యాపార కార్య‌క్ర‌మాల ప‌రంగానూ జ‌గ‌న్‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ు. ఎందుకంటే కేసీఆర్ చంద్రబాబుకు రాజకీయ శత్రువు. కాబట్టి చంద్రబాబు రాజకీయంగా లాభపడే పనులు చేయడు. అదే జగన్ కి కావాల్సింది. అయితే, తాటిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడని సామెత. జగన్ నా చేతిలో ఉన్నాడు అని కేసీఆర్ అనుకుంటూ ఉంటే కేసీఆర్ నే జగన్ వాడుకుంటున్న కొత్త వాస్తవం బయటపడింది.
కేసీఆర్ ముందు జ‌గ‌న్ త‌గ్గిన‌ట్లు న‌టిస్తున్నార‌ట. దీనికి తన వ్యాపారాలు ఒక్కటే కారణం అని బయట చర్చ. కానీ అంతకుమించిన వ్యూహంతో జగన్ ముందుకు వెళ్తున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ అధికారంలో ఉండటం, లేకపోవడం జగన్ కి పాయింటే కాదు. జగన్ రాజకీయ, వ్యక్తిగత శత్రువు అయిన చంద్రబాబును అష్టదిగ్బంధనం చేయడమే జగన్ వ్యూహం. అందుకోసం చెల్లి షర్మిలను, రాధాకృష్ణను, కేసీఆర్ ను జగన్ వాడుకుంటున్నారు.
జగన్ అసలు వ్యూహం
జగన్ వ్యూహంలో అసలు టార్గెట్ రేవంత్ రెడ్డి. ఆయన్ని అధికారానికి దూరంగా ఉంచడమే జగన్ వ్యూహంలో ఫైనల్ గోల్. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వచ్చి పదేళ్లవుతుంది. అటు ప్రభుత్వ వ్యతిరేకత పీక్స్ లో ఉంటుంది. కేసీఆర్ పదవి నుంచి దిగిపోతే అప్ప‌టి ప‌రిస్థితి ఎలా అని జ‌గ‌న్ ముందే ఆలోచించార‌ట. ప్ర‌జ‌లు ఇత‌ర పార్టీల‌కు అధికారాన్ని అప్ప‌గించేందుకు మొగ్గుచూపే అవ‌కాశం ఉంటుంది. దీంతో తెలంగాణ‌ ప్రజలకు ఉన్న ప్రత్యామ్నాయం రేవంత్ రెడ్డి మాత్రమే.
దీనిని అందరికంటే ముందు గ్రహించింది వైఎస్ జగన్. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్ ఎంపిక‌వుతున్నార‌నే విష‌యం జ‌గ‌న్‌కు అందరికంటే ముందే తెలిసింది. అందుకే ఆ విషయం ఎవరికీ బయటకు పొక్కకుండానే షర్మిలను రంగంలోకి దించాడు.
అనుమానం రాకుండా ముందే షర్మిల ఎంట్రీ
రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్య‌త స్వీక‌రించేకంటే జగన్ కి ఆ విషయం తెలుసు కదా. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా వేగంగా వ్యూహం రచించి ముందే ష‌ర్మిల‌ను తెలంగాణ‌లోకి బ‌రిలో దించారు జ‌గ‌న్. రేవంత్ పీసీసీ ఛీఫ్ ప్రకటన కంటే ముందే షర్మిల పార్టీ ప్రకటన చేయడంతో జగన్ టార్గెట్ రేవంత్ అని ఎవరికీ అనుమానం రాలేదు.
పావుగా మారిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ
షర్మిల పార్టీ హాట్ టాపిక్ అవ్వాలంటే ఎలా అని జగన్ ఆలోచించాడు. టీవీ9 కి లీక్ ఇస్తే కేసీఆర్ డ్రామా అని ఎవరైనా కనిపెడతారేమో అని జగన్ కేసీఆర్ లకు బద్ధ శత్రువు అయిన ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌ను ఎంచుకున్నారు. రాధాకృష్ణక లీకిస్తే నిజంగా అన్నాచెల్లెల్లకి గొడవులు ఉన్నాయని జనాల్ని నమ్మించడం సులువు అన్నది జగన్ ఐడియా.
నిజానికి తనకే ఈ లీక్ ఎందుకు వచ్చిందని రాధాకృష్ణకు అనుమానం రాకుండా షర్మిల, జగన్ జాగ్రత్త పడ్డారు. ఒక వైసీపీ నేత ద్వారా జ‌గ‌నే ఆ ప‌త్రిక‌కు లీక్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. టీవీ5, టీవీ9 లాంటి న్యూస్ ఛానెళ్లు ఉన్న‌ప్ప‌టికీ ఆంధ్ర‌జ్యోతినే ఎందుకు ఎచ్చుకున్నారంటే.. రాధాకృష్ణకు రేవంత్‌కు సానుకూల సంబందాలు ఉన్నాయి. కేసీఆర్ కి జగన్ కి ఆ పత్రిక నెగెటివ్ కాబట్టి రాధాకృష్ణకు లీకిచ్చారు. జగన్ నెగెటివ్ వార్తకు టాప్ ప్రయారిటీ ఇచ్చే రాధాకృష్ణ త‌న అన్న‌తో రాజకీయ విభేదాల కార‌ణంగా తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీ పెట్ట‌బోతున్న‌ట్లు ప్రచురించారు.
షర్మిల గురించి ఎన్టీవీ, టీవీ9, నమస్తే తెలంగాణ, సాక్షి రాస్తే ఉపయోగం లేదు. కాబట్టి ఆంధ్రజ్యోతి రాస్తేనే వారికి ఉపయోగం. అందుకే రాధాకృష్ణను ట్యాప్ చేశారు. ఇపుడు భారీ ఎత్తున రాధాకృష్ణకు ఫండింగ్ చేస్తూ రేవంత్ ఓట్లను చీల్చిగలుగుతుందని అనుకున్న షర్మిల పార్టీని రాధాకృష్ణకు దగ్గర చేశారు. అంతేగాకుండా రాధాకృష్ణకు డబ్బులు గుమ్మరించారు. మీరు సరిగ్గా గమనిస్తే షర్మిల పార్టీ మొదలైనప్పటి నుంచి ఆంధ్రజ్యోతికి ఏపీ గవర్నమెంటు నుంచి యాడ్స్ వస్తున్నాయి. అంతకుముందు 2 సంవత్సరాలు ఒక్క యాడ్ కూడా రాలేదు.
అన్నాచెల్లెల్ల మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని.. త‌న‌కు రాజ‌కీయంగా ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డంతో అలిగిన చెల్లి తెలంగాణ‌లో సొంతం పార్టీ పెట్టుకుందని.. అప్ప‌టి నుంచి ఈ అన్నాచెల్లెల మ‌ధ్య దూరం మ‌రింత పెరుగుతూ వస్తోందని.. ఇలా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న చెల్లి ష‌ర్మిలపై ఎన్నో వ్యాఖ్య‌లు వినిపించాయి. ష‌ర్మిల త‌న తండ్రి పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టేందుకు జ‌గ‌న్‌తో అభిప్రాయ భేదాలే కార‌ణ‌మ‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇవన్నీ శుద్ధ తప్పని కీలక సమాచారం అందుతోంది.
ఆ త‌ర్వాత కూడా ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతికి ష‌ర్మిల ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌డం కూడా జ‌గ‌న్ ఆడించిన నాట‌కంలో భాగ‌మేన‌ని తెలుస్తోంది. గ‌త రెండేళ్లుగా లేనిది జ‌గ‌న్ ఇప్పుడు ఆంధ్ర‌జ్యోతికి ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇస్తున్నారు. అన్న‌చెల్లెల్ల మ‌ధ్య విభేదాలు ఉన్న‌ట్లు ఆంధ్ర‌జ్యోతి పేరుతో రేవంత్‌ను నమ్మించ‌డ‌మే జ‌గ‌న్ ప్ర‌ణాళిక‌గా తెలుస్తోంది. పైగా రాధాకృష్ణ రేవంత్ ని హీరో చేయకుండా డబ్బులతో లాక్ చేసి షర్మిలకు భారీ ప్రచారం కల్పించేలా వ్యూహం పన్నారు. దీంతో ఆటోమేటిగ్గా రేవంత్ మీద రాధాకృష్ణ ఫోకస్ ఎంతో కొంత తగ్గుతుంది.
జగన్ ఎందుకు ఇదంతా చేస్తున్నారు?
తెలంగాణ‌లో రేవంత్ సార‌థ్యంలోని కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే అది త‌న‌కు ప్ర‌తికూలంగా మారే ప్ర‌మాదం ఉంద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు విశ్లేష‌కులు చెప్తున్నారు. జగన్ జుట్టు హైదరాబాదులో ఉంది. జగన్ కి రేవంత్ కి ఎపుడూ సఖ్యత లేదు. పైగా తనను ఇరికించిన కేసీఆర్ కు జగన్ జిగినీ దోస్త్. రేపొద్దున రేవంత్ కనుక తెలంగాణ సీఎం అయితే, కచ్చితంగా జగన్ ని టార్గెట్ చేస్తాడు. కేసీఆర్ ఉంటే బాబును ఎపుడూ కెలుకుతూ ఉండొచ్చు. రేవంత్ అధికారంలోకి వస్తే బాబుకు పాజిటవ్ తనకు నెగటివ్. అందుకే దీన్ని ఎలా అయినా అడ్డుకోవాలి అని జగన్ రాజకీయ డ్రామా మొదలుపెట్టారు. ఈ డ్రామాలో షర్మిల హీరో. రాధాకృష్ణ, కేసీఆర్ ప్రధాన పాత్రధారులు. రేవంత్ ప్రత్యర్థి పాత్రధారి.
రేవంత్ పార్టీ మారినా.. చంద్రబాబుకు ఎన్నటికీ ప్రత్యర్థి అవడు. అందువల్ల రేవంత్ గెలిస్తే అటు ఏపీలో బాబుని ఏదైనా చేయాలన్నా కుదరదు. ఎందుకంటే రేవంత్ సీఎం అయితే హైద‌రాబాద్‌లో ఉన్న జ‌గ‌న్‌ వ్యాపార సంస్థ‌ల‌ను ఏమనుకుంటే అది చేయగలడు. అదేంటి.. రేవంత్ జగన్ ఇద్దరూ రెడ్లే కదా అని అనుకోవచ్చు.
అయితే, రేవంత్ …. వైఎస్ ఫ్యామిలీ ఒక ఫేక్ రెడ్డి కమ్యూనిటీ అని నమ్ముతాడు. వారు తాతల కాలం నుంచి క్రిస్టియన్లు. వారు రెడ్డి కులానికి ఐకాన్ కావడం ఏంటి? రెడ్లంటే హిందువులు అన్నది రేవంత్ అభిప్రాయం.
షర్మిల సాధించేది ఏంటి?
అవును… మీ పిచ్చి కాకపోతే షర్మిలను ఎవరు పట్టించుకుంటారు అనుకుంటున్నారా? జగన్ ని మీలాగే చంద్రబాబు కూడా తక్కువ అంచనా వేశారు. జగన్ అసాధారణమైన తెలివితేటలు ఉన్న వ్యక్తి. మూలాల నుంచి నరుక్కొస్తాడు. రేవంత్ రెడ్డి వస్తే ఏం జరుగుతుందో జగన్ కి బాగా తెలుసు. కేసీఆర్ వ్యతిరేక ఓటును బలంగా చీల్చగలగడమే కాకుండా తెలంగాణ ప్రజలను తనవైపు తిప్పుకోగలిగిన మాటకారి. రెడ్లు శాసించే స్థాయిలో ఉన్న తెలంగాణలో వారికి చుక్కానిలా మారిన రేవంత్ రెడ్డి బలమైన శక్తిగా అవతరిస్తాడని జగన్ నమ్మాడు. జగన్ నమ్మిందే జరిగింది. రేవంత్ పదవి చేపట్టాక తిరుగుబాటు చేసిన సీనియర్లు కూడా కేడర్లో రేవంత్ ఆదరణ చూసి అన్నీ మూసుకుని కూర్చున్నారు.
అందుకే రేవంత్‌ను అడ్డుకోవ‌డం కోస‌మే జ‌గ‌న్.. ష‌ర్మిల‌ను తెర‌పైకి తెచ్చిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ నుంచి వెళ్లిపోయే క్రిస్టియ‌న్ ఓట్లు 70 శాతం, ముస్లిం మైనారిటీ ఓట్ల‌ను ఒక 20 శాతం, వైఎస్ అభిమానుల ఓట్ల‌ను 80 శాతం, రెడ్డి సామాజిక వ‌ర్గంలో కొంత శాతం ఓట్ల‌ను ష‌ర్మిలను చీల్చగలదు అని జగన్ పథకం రచించారు. కాంగ్రెస్ ను కనీసం పాత ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కంట్రోల్ చేస్తే రేవంత్ ను పదవికి దూరం చేయొచ్చు అని వ్యూహాత్మకంగా షర్మిల అదే ప్రాంతాలపై ఎక్కువ ఫోకస్ చేసింది.
మొత్తానికి జగన్ ప్లాన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇటీవలి కాలంలో ఇంత లోతుగా రాజకీయ వ్యూహాలు పన్నుతున్న నేత లేడనే చెప్పాలి. ఇంకో విషయం గమనించాలి. వైఎస్ జగన్ అనుమతి లేకుండా ఆ పార్టీలో ఎవరైనా గీత దాటగలరా? మరి ఆళ్ల, సుబ్బారెడ్డి ఇలా వైసీపీ నేతలు షర్మిలను కలవగలరా? కలిశాక వైసీపీలో ఉండగలరా? జగన్ బాణం కాబట్టే .. వారంతా ఆమెకు మద్దతు పలుకుతున్నారు.

– దండే ప్రసాద్

Leave a Reply