జగన్ రెడ్డి వల్ల పోలీస్ వ్యవస్థకూ చెడ్డ పేరు

0
36

– తప్పుడు కేసులు పెడుతున్న అధికారులపై డీజీపీ చర్యలు తీసుకోవాలి
– ట్విట్టర్లో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

ఏపీలో సీఐడీ అధికారులు కొత్త చట్టాలు, కొత్త రాజ్యాంగం ఏమైనా అనుసరిస్తున్నారా? ఎన్ని సార్లు న్యాయస్థానాల నుండి చీవాట్లు, మొట్టికాయలు పడ్డా మీ పంథా మారదా? ఒక అధికారి ఎవరో అవినీతికి పాల్పడుతున్నారు అని వార్తలు వస్తే, దాన్ని షేర్ చేసిన పాపానికి 73 ఏళ్ళ జర్నలిస్ట్ ను మీరు అక్రమంగా అరెస్ట్ చేసిన విధానంతో సమాజం నివ్వెరపోయింది. అవినీతి ఆరోపణ వచ్చిన అధికారుల గురించి విచారించకుండా వార్తలు రాసే జర్నలిస్ట్ లకు సంకెళ్ళు విధిస్తారా? జగన్ రెడ్డి చెప్పిన ప్రతి దానికీ తల ఆడించి మీ విధులు మీరు చట్ట ప్రకారం నిర్వర్తించకపోతే భవిష్యత్ లో ఖచ్చితంగా మీరే ఇబ్బంది పడతారు. పదే పదే అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నప్పటికీ డీజీపీ గారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరి కాదు. ఇది ఇలాగే కొనసాగితే ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుంది. తక్షణమే డీజీపీ సీఐడీ ను ప్రక్షాళన చేసే దిశగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. నిబంధనలు పాటించకుండా, తప్పుడు కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేస్తూ, కోర్టు నుండి షో కాజ్ నోటీస్ అందుకోవడానికి కారకులైన అధికారులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలి