Suryaa.co.in

Andhra Pradesh

పుష్ప శ్రీవాణి బోగస్ గిరిజనురాలు

– నిజమైన గిరిజనులకు ద్రోహం చేస్తున్న జగన్ రెడ్డి
– బోగస్ గిరిజనురాలైన పుష్ప శ్రీవాణికి ఎమ్మెల్యే, మంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులు
– అధికారిక పదవులు అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా దోచుకుంటున్న పుష్పశ్రీవాణి
– రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా కొండారెడ్డి నరహరి వరప్రసాద్

బొబ్బిలి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మోసపు పాలన, అవినీతి అక్రమ పాలనతో పాటు గిరిజనులకు రాజ్యాంగం ప్రసాధించిన రిజర్వేషన్ హక్కులను కూడా హరించే దుష్ట వైఖరి జగన్ మోసపు రెడ్డి పాలనలో కొనసాగుతోందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్ ధ్వజమెత్తారు.

ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా నరహర వరప్రసాద్ విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం, బాడంగి లక్ష్మీపురంలో శుక్రవారం సందర్శించారు. టిడిపి ఎంపీటీసీ, టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస గౌరు ఆధ్వర్యంలో జరిగిన గిరిజన నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

బోగస్ ఎస్టీ సర్టిఫికేట్లతో గిరిజనుల రాజకీయ హక్కులను హరిస్తున్న వైకాపా నేతలు:
రాష్ట్రంలో ఏ మూల చూసిన ఎస్టీ ఫేక్ సర్టిఫికెట్ల ఉదంతాలు గిరిజనులను కలవరపెడుతున్నాయి. పాముల పుష్ప శ్రీవాణి బోగస్ గిరిజనురాలు. పుష్ప శ్రీవాణీ కి సంబందించిన కొండ అనే కులం పేరు గిరిజన తెగలలో లేదు. ఈ వ్యవహారంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అనేకమంది మేధావులు జగన్ రెడ్డికి వినతులు అందజేసినా చర్యలు తీసుకోలేదని నరహరి తెలిపారు. కొండ అనే పేరు గిరిజన తెగల్లో లేకపోయినా పుష్పశ్రీవాణి ఎస్టీ హోదాలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఉపముఖ్యమంత్రిగా చలామణి అవుతూ, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అండదండలతో అసలైన గిరిజనులకు రాజకీయ అవకాశాలకు దూరం చేస్తున్నారు.

పుష్ప శ్రీవాణీ గిరిజన గ్రామాల్లో అభివృద్ధికి ఉపయోగించాల్సిన ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులు రూ.45 లక్షల పక్కదోవ పట్టించి తన సొంతానికి వాడుకున్నారు. గిరిజన యువతి యువకులు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక విలవిల్లాడిపోతుంటే గిరిజనుల నిధులు ప్రక్కదోవ పట్టిస్తారా? అని నరహరి ప్రసాద్ ప్రశ్నించారు.

రాష్ట్రం అభివృద్ధి పథంలో కొత్త పుంతలు తొక్కాలంటే.. రాష్ట్ర యువతీ యువకులకు ఉద్యోగాలు వచ్చి సొంత కాళ్లపై నిలబడాలంటే నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలి. రాబోవు తెలుగుదేశం-జనసేన ప్రభుత్వంలో రాష్ట్ర గిరిజన యువతి యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఒక బృహత్తర ప్రణాళిక తయారుచేయబోతున్నామని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల గిరిజన గురుకులాలు, గిరిజన విద్యాలయాలు అధోగతి పాలయ్యాయి. గిరిజన విద్యార్థుల భవిత ప్రశ్నార్ధకమయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోవు తెలుగుదేశం-జనసేన ప్రభుత్వంలో ఈ దుర్మార్గ వైసీపీ ప్రభుత్వంలో గిరిజనులు కోల్పోయిన రాజకీయ హక్కులు, విద్యా, ఉపాధి అవకాశాలు అన్నింటిని నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరిగి సాధించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గం టిడిపి ఎంపీపీ భాస్కర్, బొబ్బిలి మండల పార్టీ అధ్యక్షులు రవిబాబు, పాలకొండ నియోజకవర్గం గిరిజన జేఏసీ నాయకులు ఉమామహేశ్వరరావు, సీతంపేట ఎంపీపీ మాలకొండయ్య, లక్ష్మీపురం సర్పంచ్ పాలవలస పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE