Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని తెలంగాణలో ధారపోయిస్తున్న జగన్ రెడ్డి

-సొమ్ము ఏపీ ప్రజలది..రూ.. 500 కోట్ల పెట్టబడులు తెలంగాణకా.?
-ఇది జగనన్న పాలవెల్లువ కాదు, పాడి రైతుల దోపిడి
– టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణరాజు

అమూల్ దోచుకునే వనరులు ఏపీలో.. పెట్టుబడులు మాత్రం తెలంగాణలోనా.? రాష్ట్రంలోని సహకార డెయిరీలను దెబ్బకొట్టేందుకు తీసుకొచ్చిన అమూల్ పాల కంపెనీకి జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రజల నుండి అడ్డమైన పన్నులతో ముక్కుపిండి వసూలు చేసిన సొమ్ము అమూల్ కు రూ.2500 కోట్లు ధార పోశారు. ఈ సొమ్ముతో అమూల్ సంస్థ తెలంగాణలో రూ.500 కోట్లతో భారీ డెయిరీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. ఇది జగన్ రెడ్డికి తలవంపుగా లేదా.?

రాష్ట్ర ప్రజల శ్రమను తెలంగాణలో పెట్టుబడిగా పెట్టిస్తున్నారు. ప్రాజెక్టును సొంత రాష్ట్రంలో ఎందుకు పెట్టించలేకపోయారు.? సంస్థకు వెళ్లే నిధులు ఏపీ ప్రజలవి..పెట్టుబడులు మాత్రం తెలంగాణకా.? నిరుద్యోగంతో విలవిల్లాడుతున్న మన రాష్ట్రంలో అమూల్ డెయిరీ ఏర్పాటు చేస్తే వేలాదిమంది యువతకు ఉద్యోగం, ఉపాధి లభించేది. అమూల్ డెయిరీ రాష్ట్రానికి రాకపోవడానికి జగన్ రెడ్డి చేతకానితమే కారణం.

సహకార డెయిరీల కంటే అమూల్ కంపెనీ పాడి రైతులకు ఎక్కువ ఒనగూర్చుతున్నట్లు అబద్ధాలు వల్లిస్తున్నారు. పైసా పెట్టబడి పెట్టకుండా రైతులకు లాభం ఎలా చేకూర్చుతుంది.? ఇది గుజరాత్ కంపెనీలకు గులాంగిరీ చేయడమే. జగనన్న పాలువెల్లువ అంటే ఏమిటో ప్రజలకు అర్థం తెలపాలి. జగన్ మొహం చూడగానే గేదెలు పాలు ఎక్కువ ఇస్తాయా.? వాస్తవాలను కప్పిపెట్టి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. అమూల్ కు లాభం చేకూర్చేందుకు సహకార డెయిరీలను సైతం కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. సహకార డెయిరీలను నిర్వీర్యం చేసి కమీషన్ల కోసం గుజరాత్ సంస్థ కోసం తహతహలాడుతున్నారు. దీని వల్ల పాడి రైతులు వృద్ధి చెందరు..కమీషన్లు అందించే అమూల్ ఆస్తులు వృద్ధి చెందుతాయి.

ఇది జగనన్న పాలవెల్లువ కాదు పాడి రైతుల దోపిడి. అమూల్ ద్వారా పాడి రైతులకు రూ.10 కోట్ల లబ్ధి ఎక్కడ జరిగిందో ముఖ్యమంత్రి నిరూపించాలి. రాయలసీమ జిల్లాల్లో అమూల్ ఇప్పటికీ రైతులకు పాల బకాయిలను చెల్లించలేదు. అమూల్ బూచి చూపించి దశాబ్ధాల నుండి నడుస్తున్న రాష్ట్రంలోని డైయిరీలను నాశనం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే లీటరుకు రూ.4 బోనస్ ఇస్తానన్న పాదయాత్ర హామీని నేటికీ ఎందుకు అమలు చేయలేదు? పశుగ్రాసం కోసం ఇచ్చే రుణాలను సైతం ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇకనైనా తన స్వార్దం కోసం పాడి రైతులను మోసం చేయటం మానుకోవాలి.

LEAVE A RESPONSE