Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగుల జీతాల్లో కోత కోసిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ రెడ్డి ఒక్కడే

– గిరిజన ఉద్యోగుల ద్రోహమే జగన్ రెడ్డి ప్రభుత్వ విధానం
– రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గిరిజన ఉద్యోగులు ఎన్నడూ లేనంతగా అన్యాయంకు గురయ్యారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహర ప్రసాద్ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గిరిజన వ్యతిరేక విధానాలతో పాలన సాగించిన జగన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో గిరిజన ఓటు దెబ్బేంటో రుచి చూడబోతున్నారని హెచ్చరించారు. ఉద్యోగుల సంక్షేమమే అజెండాగా గత తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తే..జగన్ రెడ్డి వారిని మోసం చేయడమే విధానంగా పెట్టుకున్నారు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇస్తే.. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని రివర్స్ చేసిందని మండిపడ్డారు. సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి జగన్ రెడ్డి మడమ త్రిప్పాడన్నారు. సిపిఎస్ ఏంటో తెలియక జగన్ రెడ్డి హామీ ఇచ్చాడని తన పెద పాలేరు సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించిన విధానం చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఏ విధంగా మోసం చేశారో ప్రజలు అర్ధం చేసుకోవాలని నరహరి ప్రసాద్ కోరారు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ రెడ్డి జిపిఎస్ అనే కొత్త విధానాన్ని తీసుకువచ్చి మరో కొత్త మోసానికి తెరలేపారన్నారు. గిరిజన ఉద్యోగులకు ఇవ్వాల్సిన కరువు భృత్యం జాప్యం చేస్తూ గిరిజనుల ఉసురు పోసుకుంటోదని అన్నారు.

ఏ ప్రభుత్వమైనా పీఆర్సీ కమిటీ ఆధారంగా ఫిట్‌మెంట్లను నిర్దేశిస్తుంది. కానీ, ఈ దుర్మార్గ వైసీపీ ప్రభుత్వం చరిత్రలో మొట్ట మొదటిసారి పీఆర్సీ నివేదిక ఆధారంగా కాకుండా ఆఫీసర్స్ కమిటీ నివేదిక ఆధారంగా ఫిట్‌మెంట్ నిర్ణయించింది. ఐఆర్ 27% కంటే తక్కువగా 23% ఫిట్మెంట్‌ ఇచ్చి ఉద్యోగుల జీతాల్లో కోత కోసిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ రెడ్డి ఒక్కడే అని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు వారి అవసరాల నిమిత్తం..అనగా పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఆరోగ్య అవసరాలకు దాచుకున్న జిపిఎఫ్ సొమ్ములను సైతం వారికి తెలియకుండా దోచుకున్న గిరిజన ద్రోహి జగన్ రెడ్డి.

గిరిజన ఉద్యోగులు వారు దాచుకున్నన నిధుల కోసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి జగన్ రెడ్డి తీసుకొచ్చారు. హెచ్ఆర్ ను సెక్రటరీయేట్ ఉద్యోగులకు 30 నుంచి 24 శాతానికి, ఇతర ఉద్యోగులకు 20% నుంచి 16% తగ్గించి ప్రభుత్వ ఉద్యోగులకు తీరని అన్యాయం చేసిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ అని విరుచుకుపడ్డారు.

LEAVE A RESPONSE