జగన్ రెడ్డి విశాఖను డ్రగ్ క్యాపిటల్ గా మార్చారు

• టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో నెం.1 స్ధానంలో ఉన్న ఏపీ నేడు గంజాయి, డ్రగ్ రవాణాలో నెం.1 స్ధానంలో ఉంది
• నిన్న విశాఖలో వైసీపీ నేత కూనం పూర్ణచంద్రరావు సోదరుడు వీరభద్రరావుకి చెందిన సంధ్యా ఆక్వా ఎక్ప్ పోర్ట్ ప్రై.లి బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న 25 వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ తో కలిపి ఉన్న డ్రగ్స్ సీబీఐకి పట్టుబడ్డాయి
• ఈ మత్తు పధార్దాల విలువ సుమారు రూ. 50 వేల కోట్లు ఉంటుందని అంచనా
• ఈ కంటెయినర్ తనిఖీ చేయకుండా కొందరు రాష్ట్ర ఉన్నతాధికారులు అడ్డుపడ్డారని సీబీఐ తన నివేదికలో పేర్కొంది
• బ్రెజిల్ నుంచి మత్తు పదార్థాలు దిగుమతి చేస్తున్నారని తెలిసే జగన్ రెడ్డి తన అధికారులను పంపారా?
• ఆనాటి కొలంబియా దేశానికి చెందిన డ్రగ్ మాఫియా కింగ్ పాబ్లో ఎస్కోబార్ ని మించి తన డ్రగ్స్ గంజాయి సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ “ఆంధ్రా ఎస్కోబార్ గా అవతరించాడు జగన్ రెడ్డి
• రుషికొండకు గుండుకొట్టి విశాఖలో రూ. 500 కోట్లతో జగన్ రెడ్డి ప్యాలెస్ కట్టుకుంది మత్తుపదార్దాల మాఫియాను విస్తరించుకోవడానికేనా?
• ప్రాంతీయ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి బ్రెజిల్ దేశాధ్యక్షుడికి శుభాకాంక్షలు ఎందుకు చెప్పారో నేడు బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్ కంటెయినర్ తో బట్టబయలైంది
• విశాఖకు జగన్ వెళ్తానని హడావిడి చేస్తోంది తన డ్రగ్ మాఫియాను విస్తరించుకోవడానికేనా?
– కొమ్మారెడ్డి పట్టాభిరాం

టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో నెం.1 స్ధానంలో ఉన్న ఏపీ నేడు గంజాయి, డ్రగ్ అక్రమ రవాణాలో నెం.1 స్ధానంలో ఉందని, జగన్ రెడ్డి విశాఖను స్టేట్ క్యాపిటల్ గా కాకుండా డ్రగ్ క్యాపిటల్ గా మార్చారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ధ్వజమెత్తారు. శుక్రవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…..నిన్న విశాఖలో బ్రెజిల్ నుంచి సంధ్వా ఆక్వా ఎక్స్ పోర్ట్ ప్రై.లి పేరుతో దిగుమతి చేసుకున్న “ఎస్.ఈకేయూ 4375380” కంటెయినర్ లో 25 వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ తో కలిపి ఉన్న డ్రగ్స్ సీబీఐకి పట్టుబడ్డాయి.

ఈ కంటెయినర్ లోపల ఒక్కో బ్యాగ్ లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగ్ లు అంటే 25 వేల కేజీల ఎండిన ఈస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 49 నమూనాలను పరిశీలించగా వాటిలో కొకైన్, మెధాక్వలోన్ అనే నిషేదిత పదార్థాలు న్నాయి. మరో 27 నమూనాల్లో హెరాయిన్, మెస్కిలన్ వంటి భయంకర మత్తు పదార్థాలు న్నాయని సీబీఐ తన నివేదికలో దృవీకరించింది. ఈ మత్తు పధార్థాల విలువ సుమారు రూ. 50 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ డ్రగ్స్ కంటెయినర్ ని వైసీపీ నేత కూనం పూర్ణచంద్రరావు సోదరుడు వీరభధ్రరావుకి చెందిన సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్ ప్రై.లి కంపెనీ దిగుమతి చేసుకుంది.

కూనం పూర్ణచంద్రరావు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడికి గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నేత. నాగులుప్పలపాడు మండల వైసీపీకి ఇతనే పెద్దదిక్కు. ఇతనికి విజయసాయిరెడ్డితో సన్నిహిత సంబందాలున్నాయి. ఇతనికి వైసీపీ P.A.C.S చైర్మన్ పదవిని సైతం కట్టబెట్టింది. సీఎం జగన్, వైసీపీ నేతల ఫోటోలతో తన గ్రామంలో, మండలంలో ప్లెక్సీలు వేయించారు. ఆ మండలంలో వైసీపీ తరపున ఏ కార్యక్రమం జరిగినా ముందుంది నడిపించేది, సహాయ సహకారాలు అందించేంది వీరే.

గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీరు వైసీపీ ఆవిర్బావం నాటి నుంచే వైసీపీలో చేరి క్రియాశీలకంగా ఉన్నారు. వీళ్లు మొత్తం నలుగురు సోదరులు, ఒకరు అమెరికాలో స్ధిరపడ్డారు. పూర్ణచంద్రరావు, వీరభద్రరావుతో పాటు మరొక సోదరుడు ఇక్కడ స్ధిరపడ్డారు. ఇవన్నీ వాస్తవాలు కాదని వైసీపీ నేతలు చెప్పగలరా? 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడటంతో ఏం చేయాలో దిక్కుతోచక వైసీపీ పేటీమ్ బ్యాచ్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ కంటెయినర్ తనిఖీ చేయకుండా కొందరు రాష్ట్ర ఉన్నతాధికారులు అడ్డుపడ్డారని సీబీఐ తన నివేదికలో పేర్కొంది.

మత్తు పదార్థాలు న్న కంటెయినర్ ని తనిఖీ చేస్తుంటే రాష్ట్ర అధికారులు అడ్డుపడాల్సిన అవసరం ఏంటి? బ్రెజిల్ నుంచి మత్తు పదార్థాలు దిగుమతి చేస్తున్నారని తెలిసే జగన్ రెడ్డి తన అధికారులను పంపారా? బ్రెజిల్ అంటే ఎంపీ విజయసాయిరెడ్డికి ఎందుకంత ప్రేమ? రెండేళ్ల క్రితం బ్రెజిల్ అధ్యక్షునిగా ఎన్నికైన ప్రెసిడెంట్ లూలడా సిల్వకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రాంతీయ పార్టీకి చెందిన ఎంపీ బ్రెజిల్ దేశాధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏంటో నేడు బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్ కంటెయినర్ పట్టుబడితే కానీ అర్ధం కాలేదు.

విజయసాయిరెడ్డి తన ఫోన్ పోగొట్టుకున్నపుడు…మీ ఫోన్ లో ఏముంది బ్రెజిల్ దేశానికి చెందిన ఆర్దిక వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? అని రెండేళ్ల క్రితమే మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విజయసాయిరెడ్డిని మీడియా ముఖంగా ప్రశ్నించారు. బ్రెజిల్ మాఫియా ముఠాలతో వైసీపీ నేతలకు సంబందాలున్నాయని మాకు గతంలోనే అనుమానాలున్నాయి. నిన్న పట్టుబడ్డ డ్రగ్ కంటెయినర్ తో వీళ్లకున్న డ్రగ్ మాఫియా సంబందాలు కూడా బయటపడ్డాయి. గతంలో సీఎం ఇంటికి సమీపంలో ఉన్న విజయవాడలోని ఆశి ట్రేడింగ్ పేరుతో రూ. 9 వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడింది.

నేడు వైసీపీ నేత సోదరునికి చెందిన సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్ ప్రై.లి కంపెనీ పేరుతో దిగుమతైన డ్రగ్స్ కంటెయినర్ పట్టుబడింది. ఏపీ డ్రగ్స్ స్మగ్లింగ్ లో నెం. 1 స్ధానంలో ఉందని గతంలో కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ విడుదల చేసిన డి.ఆర్.ఐ నివేదిక వెల్లడించింది. మరో వైపు గంజాయి అక్రమ రవాణాలో సైతం ఏపీ నెం. 1 స్ధానంలో ఉంది. గంజాయి, హెరాయిన్, కొకైన్ వంటి డ్రగ్ మాఫియాలతో జగన్ రెడ్డి మన బిడ్డల జీవితాల్ని నాశనం చేస్తున్నారు. ఆనాటి కొలంబియా దేశానికి చెందిన డ్రగ్ మాఫియా కింగ్ పాబ్లో ఎస్కోబార్ ని మించి, తన డ్రగ్స్ గంజాయి సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ “ఆంధ్రా ఎస్కోబార్ గా అవతరించాడు జగన్ రెడ్డి”.

టీడీపీ హయాంలో అభివృద్ది, సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణలో ముందున్న రాష్ట్రాన్ని నేడు జగన్ రెడ్డి ఈ విధంగా నాశనం చేశారు. రుషికొండకు గుండుకొట్టి విశాఖలో రూ. 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంది ఇందుకేనా జగన్ రెడ్డి ? అక్కడ నుంచి సముద్రంలో మత్తుపధార్దాల కంటెయినర్లు ఏషిప్ లో ఎప్పుడు వస్తున్నాయో ఎక్కడి వరకు వచ్చిందో చూసుకోవడానికా? విశాఖకు జగన్ వెళ్తానని హడావిడి చేస్తోంది తన డ్రగ్ మాఫియాను విస్తరించుకోవడానికేనా? రాష్ట్రంలోని గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ వంటి పోర్టులన్నీ జగన్ రెడ్డి కబ్జా చేసింది ఈ విధంగా మత్తు పధార్దాల వ్యాపారం చేయడానికా?

జగన్ రెడ్డి డ్రగ్ మాఫియాతో వేల కోట్లు దిగమింగుతూ మన బిడ్డల జీవితాల్ని నాశనం చేస్తున్నారు. జగన్ డ్రగ్ మాఫియా సంబందాలను అన్ని ఆధారాలతో సహా నిరూపించాం. దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారు? వైసీపీ నేతల కుమారులు సైతం డ్రగ్స్ తో వ్యాపారం చేస్తున్నారు. గతంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్ తో పట్టుబడలేదా? మన బిడ్డల్ని మత్తు పధార్దాలకు బానిసలుగా చేసి వేల కోట్లు దిగమింగుతున్న జగన్ రెడ్డికి మే 13 జరగనున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలి.

జగన్ రాజకీయాలకు అనర్హుడు. ఇతను జైల్లో ఉండాలి. ల్యాండ్, శాండ్, వైన్, డ్రగ్ మాఫియాలతో పొత్తుపెట్టుకుని ఎన్నికలకు వెళ్తూ పైకి మాత్రం తాను సింగ్ ల్ గా వస్తున్నానని జగన్ రెడ్డి చెప్పుకోవటం సిగ్గుచేటు. రాష్ట్రంలో డ్రగ్ మాఫియాను ప్రోత్సహించి యువత జీవితాల్ని నాశనం చేస్తుంటే టీడీపీ చూస్తూ ఊరుకోదు. గతంలో మాదిరి డ్రగ్ మాఫియాపై పెద్దఎత్తున ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. సీబీఐ ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి ఈ డ్రగ్ కుంభకోణం వెనుక ఉన్న వైసీపీ పెద్దలపై చర్యలు తీసుకోవాలని పట్టాభిరాం డిమాండ్ చేశారు

Leave a Reply