ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలకు వైసీపీ ప్రలోభాలు

-ఎన్నికల కోడ్ ఉల్లంఘించి వాలంటీర్లతో ఎన్నికల ప్రచారం
-ఎన్ని తాయిళాలిచ్చినా జగన్ రెడ్డిని తరిమేందుకు మహిళలు సిద్ధం
-మహిళలు దాచుకున్న సొమ్ము దోచేసిన నీచపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
-మరో 53 రోజుల్లో రాష్ట్ర మహిళలు జగన్ రెడ్డి కుర్చీ మడతబెడతారు
– తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత

ఓటమి ఖాయమని అర్థమయ్యే సరికి జగన్ రెడ్డి ప్రభుత్వం, ఓటర్లను ప్రలోభ పెట్టే పనులు చేస్తుందని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. మహిళలకు తాయిళాలు ఇచ్చి ప్రలోభ పెట్టేందకు వైకాపా అభ్యర్ధులు ప్రయత్నిస్తున్నారని సునీత మండిపడ్డారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆచంట సునీత ఓటర్లకు వైసీపీ అభ్యర్ధులు తాయిళాలు పంపిణీపై విరుచుకుపడ్డారు.

ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి అన్‌ఫిట్…
“వైసీపీ సర్కార్ ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించడంతో పాటు ఎన్నికల కమిషన్ చెప్పినా బేఖాతరు చేస్తూ వాలంటీర్లతో ఎన్నికల ప్రచారం చేస్తోంది. డ్రాక్కా సంఘాలను లీడ్ చేసే ఆర్పీలను కూడా ప్రలోభ పెట్టేందుకు వైసీపీ సర్కార్ యత్నించడం దిగజారుడుతనానికి నిదర్శనం. ఐదు సంవత్సరాల పాలన చూసి ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి ‘అన్ ఫిట్’ అని ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలకు సంక్షేమాన్ని దూరం చేసి, రాష్ట్రాభివృద్ధి కూడా లేకుండా జగన్ రెడ్డి చేశాడు. ఇక ఏం చేసినా గెలవమని జగన్ రెడ్డికి అర్థమయ్యింది.

అందుకే తన అభ్యర్ధుల చేత డ్రాక్రా మహిళలకు చీరలు, కుక్కర్లు, కాళ్ళ పట్టీలు ఇస్తామంటూ రక రకాల ప్రలోభాలు గురి చేస్తూ…మరోమారు మాకు ఓటు వేయాలని బ్రతిమిలాడుకుంటున్నారు. ప్రభుత్వ ధనంతో ఆసరా అంటూ చెప్పి జనవరి 20న బటన్ నొక్కితే ఇప్పటీ ఆ డబ్బులు డ్వాక్రా మహిళల అకౌంట్‌లో జమ అవ్వలేదు. ప్రజా ధనంతో కార్యక్రమాలు నిర్వహించి నీచ రాజకీయాలు చేస్తున్నారు” అని ధ్యజమెత్తారు.

డ్వాక్రా మహిళలు చంద్రబాబు మానసపుత్రికలు…
“విజయవాడ సెంట్రల్, పెనమలూరు, శ్రీకాకుళం, చంద్రగిరి నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్ధులు మాకు ఓటు వేయండి, మీకు అవి ఇస్తాం..ఇవి ఇస్తామంటూ ప్రలోభాలు పెట్టి, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వీటిపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వారిపై భౌతిక దాడులు చేస్తున్నారు. ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో డ్వాక్రా మహిళలకు చేసిన సంక్షేమం శూన్యం. నాడు చంద్రబాబు డ్వాక్రా మహిళలను మానసపుత్రికలుగా చూసుకొని ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టారు. డ్వాక్రా మహిళా అంటే తన కాల మీద తను నిలబడి కుటుంబానికి స్వాలంభంగా ఉండాలనే సదుద్దేశంతో చంద్రబాబు డ్రాక్రా సంఘాలను ప్రారంభించారు. కానీ జగన్ రెడ్డి మాత్రం తన కార్యక్రమాలకు రాకపోతే రుణాలు ఇవ్వమని, కుటుంబసభ్యులకు పెన్షన్ కట్ చేస్తామని బెదిరించి డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశాడు” అని మండపడ్డారు.

డ్వాక్రా మహిళలు దాచుకున్న సొమ్మును దోచుకున్న నీఛపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి….
“ఏం ముఖం పెట్టుకొని డ్వాక్రా సంఘాల మహిళలను ఓట్లు అడగడానికి వస్తున్నారు జగన్ రెడ్డి? డ్వాక్రా మహిళలకు నువ్వు చేసిందేంటో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అభయహస్తం పేరుతో డ్వాక్రా మహిళలు దాచుకున్న రూ.2 వేల కోట్లు కూడా జగన్ రెడ్డి దారి మళ్లించాడు. ఇళ్ల నిర్మాణాల పేరుతో డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న సొమ్మును కూడా జగన్ రెడ్డి దొంగతనం చేశాడు. మహిళలు దాచుకున్న డబ్బులతో బ్రతికిన నీచపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి ముఖ్యమంత్రిని ఇక ఎన్నడూ చూడ కూడదని డ్వాక్రా మహిళలు నిర్ణయించుకున్నారు” అని అన్నారు.

జగన్ రెడ్డి కుర్చీ మడతబెట్టడానికి మహిళలు సిద్ధం…
“మహిళా దినోత్సవం పేరుతో డ్వాక్రా ఆర్పీలు, యానిమేటర్లకు కోణ రఘుపతి తాయిళాలు ఇచ్చాడు. వాలంటీర్లను గడప గడపకు పంపించి ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తోంది ఈ ప్రభుత్వం. ఇచ్చిన హామీలను మరిచి డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లను మోసం చేశాడు. వాళ్ళకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా తాడేపల్లి ప్యాలెస్‌లో దాచుకున్నాడు. హక్కుల కోసం పోరాడిన అంగన్వాడీ మహిళలపై ఎస్మా ప్రయోగించి, పోలీసులతో కొట్టి వారిని ఇబ్బందులకు గురి చేశాడు.

కానీ తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసింది. రంపచోడవరంలో ఒక అంగన్వాడీ టీచర్‌కు అభ్యర్ధిగా అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వాలంటీర్లతో నిర్వహిస్తున్న సమావేశాన్ని అడ్డుకున్న మా అభ్యర్ధి రామాంజనేయులుపై దాడికి ప్రయత్నించారు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా లా & ఆర్డర్ నశించిపోయింది. అవినీతి రహిత పరిపాలన కావాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి… చంద్రబాబు రావాలి అని అన్ని వర్గాల ప్రజలు నిశ్చయించుకున్నారు. మరో 53 రోజుల్లో జగన్ రెడ్డి కుర్చీ మడతపెట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని ప్రలోభాలు, ఇబ్బందులు పెట్టినా ఏ ఒక్క మహిళా జగన్ రెడ్డికి ఓటు వేయరు. తెలుగుదేశానికి అధికారం కట్టబెట్టాలని వారు కంకణం కట్టుకున్నారు” అని తెలిపారు.

Leave a Reply