వైయస్ బొమ్మ పెట్టుకోవడానికి మీకు సిగ్గుగా లేదా?

-వైసిపి పై రాజ్యసభ మాజీ సభ్యుడు కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచంద్ర రావు ఆగ్రహం

విజయవాడ:ప్రధాని మోదీ దర్శనం దొరికినందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అభినందనలు తెలపాలి.ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగనే.

ఇసుక, మద్యం కుంభకోణం లో దేశంలో చాలా మంది నేతలు అరెస్టు అయ్యారు కానీ ఎపిలోని నేతలకు మాత్రం మినహాయింపు కలిగించారు. బిజెపి దృష్టిలో దేశంలో ఎలాంటి మరక లేని ప్రభుత్వం ఏపీ ఒక్కటే అనుకుంటా.

ఏపీ లోని ఏ మంత్రి పైనా ఎంపిల పైనా కేసులు, అరెస్టులు ఎందుకు లేవో బిజెపి చెప్పాలి. దేశం అంతా నగదు రహిత లావాదేవీలు ఉన్నా ఏపీ లో మాత్రం అంతా నగదు తోనే విక్రయాలు జరిగినా కేంద్రం పట్టించుకోదు.

వైఎస్ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడగడానికి వెళ్తున్న వైసిపి నేతలకు సిగ్గు లేదు.పోలవరం పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియటం లేదు.పోలవరం విషయంలో ఏపీ భావితరాలు జగన్ ప్రభుత్వాన్ని, గత టిడిపి ప్రభుత్వాన్ని క్షమించవు.

పోలవరం పూర్తి అయితే చాలా ఎత్తిపోతల పథకాలు నిర్మించుకునే వీలుంది. 2 వేల టిఎంసి ల నీరు వినియోగించుకోవచ్చు.వైసిపి ప్రభుత్వం పోలవరాన్ని ఏటీఎమ్ లా వాడుకుంటోదని, కేంద్రంలో ఉన్నత స్థాయిలో నీ వ్యక్తి నాతో అన్నారు.అది బ్యారేజి లా మిగిలి పోకూడదు.

ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ కేంద్రం నుంచి ఏం సాధించుకునీ వచ్చారో తెలియదు.పాత అంశాలనే చెప్పి మళ్ళీ ఏపీ ప్రజలను మభ్య పెడతారు. సొంత చెల్లెలు , తల్లి పై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకొని అసమర్థ ప్రభుత్వం ఏపిలో ఉంది.

ప్రభుత్వాధినేత గా ఏపీ లో కేసులు పెడితే తీసుకోరు పొరుగు రాష్ట్రంలో కేసులు పెడితే సహకరించరు. ప్రధాని మోదీ, బిజెపి పార్టీలు ఏపీ ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారు.2014 లో మోదీ తిరుపతి ఎన్నికల ప్రచార సభలో పార్లమెంటు లోనూ చెప్పారు. అది ఏమైందో తెలియదు.

రాజధాని అమరావతి నిర్మాణ సమయంలో మోదీ కలుషిత మట్టి, కలుషిత జలాలు తెచ్చి ఏపీ నోట్లో మట్టి కొట్టారు .టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పార్టీల పొత్తులు మార్చడం లో నితీష్ కుమార్ ను మించి పోయారు.అమిత్ షా పైనా, రాహుల్ గాంధీ పైనా రాళ్ళు వేయించిన ఘనత ఆయనదే.

నిన్న అమిత్ షా, జెపి నద్దా ను కలిసి ఏం అంశాలు చర్చించారు.ప్రత్యేక హోదా, పోలవరం, అమరావతి గురించిన హామీలు ఏమైనా ఇచ్చారా?చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి.

2019 నుంచి 2024 వరకూ బిజెపి ఏపీ కి ఏం మేలు చేసింది? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే.

Leave a Reply