Suryaa.co.in

Andhra Pradesh

నకిలీ ఓట్లను చేర్చెందుకు జగన్ రెడ్డి కుట్ర

-బీ.ఎల్.వోలనూ పనిచేయ నివ్వకుండా అడ్డంకులు
-ఓట్ల నమోదు క్యాంపు అంటూ,దగా చేస్తున్నారని వర్ల కుమార్ రాజా ఆగ్రహం

ఇన్నాళ్లూ నకిలీ ఓట్లు నమోదు చేయించిన జగన్ రెడ్డి.. ఇప్పుడు అందులోని తప్పొప్పులను సరిదిద్దే అవకాశాలని కూడా హైజాక్ చేస్తున్నాడని పామర్రు టిడిపి ఇంచార్జి వర్ల కుమార్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల డ్రాఫ్ట్ లోని లోపాలను సవరించడం, కొత్త ఓట్లను చేర్చడం, డూప్లికేట్ ఓట్ల తొలగింపు కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాం అని చెప్తూ మోసాలకు తెర లేపారు జగన్ రెడ్డి.

పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం పమిడిముక్కల గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాంపుని వర్ల కుమార్ రాజా పరిశీలించారు. సాయంత్రం వరకు బీ.ఎల్.వోలు విధులకు హాజరవ్వకుండా వారికి వేరే విధులు అప్పజెబుతున్నారని మండిపడ్డారు. వందలాది మంది యువకులు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు పడిగాపులు కాస్తున్నారు. ఐయినా అధికారులు రాకపోవడం జగన్ రెడ్డి కుట్రలో భాగమే అన్నారు. ఒకవైపు వేలాదిగా చనిపోయిన ఓటర్లున్నారు.

మరోవైపు దొంగ ఫారం 7 దరఖాస్తులతో ఓట్లు తొలగించారని ఫిర్యాదులు వచ్చాయి. అయినా బీ.ఎల్.వోలు రాకపోవడం జగన్ రెడ్డి మార్క్ ఎన్నికల కుట్రే అన్నారు. తక్షణమే అధికారులు ఓట్ల పరిశీలన విషయంలో తగు చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై న్యాయ పోరాటం చేస్తామని వర్ల కుమార్ రాజా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ హెడ్లు,యూనిట్ ఇంచార్జ్ లు, భూత్ కన్వీనర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE