బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే పురుషహంకారి

• వైకాపా నాయకులకు మహిళలను అవమానించడం కొత్తకాదు
• తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలని శ్రమిస్తున్న చంద్రన్న సతీమణినే అవమానించారు
• గిరిజన మహిళలను అవమానిస్తే రాబోయే కూటమి ప్రభుత్వంలో కఠిన చర్యలు తీసుకుంటాం
-తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి

అమరావతి: కొంతమందికి వయసు పెరిగినా బుద్ధి మాత్రం పెరగదని, అలాంటి వారు మహిళలను అవమానించి, వేధిస్తుంటారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బొబ్బిలి మండలం, డొంగూరు వలసలో ఓ గిరిజన మహిళను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను సంధ్యారాణి తీవ్రంగా ఖండించారు.

‘వైసీపీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాలను ఏం అభివృద్ధి చేశారు..కొండోళ్లం కొండోళ్లలాగే ఉన్నామని ప్రశ్నించిన ఓ గిరిజన మహిళపై చిన అప్పలనాయుడు కోపంతో ఊగిపోతూ..గతంలో మీకు కట్టుకోవడానికి చీరలు, రవికలు ఉన్నాయా?.. జగన్ వచ్చిన తర్వాతే అవి మీకు వచ్చాయంటూ మాట్లాడటాన్ని చినఅప్పలనాయుడు పురుషహంకారానికి నిదర్శనమని సంధ్యారాణి వ్యాఖ్యానించారు. చిన్నఅప్పలనాయుడికి డెబ్బై ఏళ్లు వయసు వచ్చినా బుద్ది మాత్రం మారలేదన్నారు. గిరిజన మహిళ అభివృద్ధిపై ప్రశ్నించడం తప్పా అని ఆవేధన వ్యక్తం చేశారు.

మహిళలను అవమానించడం వైసీపీ నాయకులకు కొత్తకాదని, పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన, తెలుగుజాతిని ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలబెట్టాలని అహర్నిశలు తపించే నాయకుడు చంద్రబాబు నాయుడి సతీమణిని అసెంబ్లీ సాక్షి అవమానించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గిరిజన మహిళలపై దాడులు, హత్యలు, అవమానాలు పెరిగిపోయాయన్నారు. ఇటీవల పల్నాడు జిల్లాలో త్రాగటానికి నీళ్లడిగిన గిరిజన మహిళ సామునిభాయిని వైకాపా వారు ట్రాక్టర్‌తో తొక్కించి చంపారన్నారు.

రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటర్లు వైసీపీ నాయకులకు తమ సత్తా చూపెడుతారన్నారు. గిరిజన మహిళలను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. మహిళలకు అన్యాయం, అవమానం జరిగితే బుల్లెట్ కంటే ముందే జగన్ రెడ్డి వస్తాడని చెప్పే వైసీపీ మహిళా నేతలు దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. గిరిజన మహిళలను అవమానిస్తే ఊరుకునేది లేదన్నారు. గిరిజనులపై దాడులకు, అవమానాలకు పాల్పడిన వారిపై రాబోయే కూటమి ప్రభుత్వంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply