వృద్దులను చంపి ఆ నేరం తెలుగుదేశంపై మోపాలని జగన్ రెడ్డి కుట్ర

• ఇంటి వద్దకే ఫించన్లు ఇవ్వాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను జగన్ రెడ్డి భేఖాతరు
తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్

రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓడిపోతాడని తెలుసుకుని ఫించన్‌ల వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుంటూ..వృద్దులను చంపి ఆ నేరాన్ని తెలుగుదేశం పార్టీపై వేయాలని జగన్ రెడ్డి కుట్రపన్నాడని తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్ వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

పెన్షన్ డబ్బులు లబ్దిదారుల ఇంటి వద్దకే తీసుకెళ్లి ఇవ్వాలని ఏప్రిల్ 2, 2024 న ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా పెన్షనర్లు సచివాలయాలకే వచ్చి తీసుకోవాలని తిరిగి ఆదేశాలు జారీ చేయడం వెనుక భారీ కుట్ర దాగివుందన్నారు. ఇంటింటికి పెన్షన్లు తెలుగుదేశం పార్టీవారే ఆపారని లబ్దిదారులను నమ్మించేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా ఆదేశాలు జారీచేసిందన్నారు.

‘పింఛన్ల పంపిణీ పేరుతో జగన్ రెడ్డి మరో కొత్త నాటకానికి తెరలేపి రాజకీయంగా లబ్దిపొందేందుకు వృద్ధులను ఇబ్బంది పెడుతున్నారు. సచివాలయ సిబ్బంది చేతికి పింఛన్ నిధులు ఇవ్వకుండా వృద్దులను 9 గంటలకే సచివాలయాలకి రావాలని చెప్పడం వారి ప్రాణాలతో చెలగాటమాడటం కాదా? వైసీపీ కార్యకర్తలు వృద్దులు రావడానికి ఇష్టం లేకపోయినా వారిని మంచంలోనే ఉంచి ఎర్రటెండల్లో వారిని తీసుకురావడం రాజకీయలబ్ది కోసం కాదా? వైసీపీ వారి మాటలు విని సచివాలయాలకు వచ్చిన వృద్దులను గంటల తరబడి వేచియుండేలా చేసి వారికి కనీసం నీడ గానీ, కూర్చునే ఏర్పాట్లు గానీ, త్రాగేందుకు నీరు గానీ ఏర్పాటు చేయలేదు. బాబాయిని హత్య చేయించి ఆ సానుభూతితో అధికార పీఠం ఎక్కిన జగన్ రెడ్డికి వృద్ధుల ప్రాణాలంటే లెక్కలేదు.

Leave a Reply