వాటర్‌ మేనేజ్‌మెంట్‌, నిర్వహణపై ప్రత్యేకాధికారులు

ఉమ్మడి పది జిల్లాలకు నియమిస్తూ ఆదేశాలు

వాటర్‌ మేనేజ్‌మెంట్‌, నిర్వహణపై ఉమ్మడి పది జిల్లాలకు 10 మంది ఐఏఎస్‌ అధికారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్‌ నిర్మల్‌ – ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, కొమరం భీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల్‌కు కృష్ణ ఆదిత్య, కరీంనగర్‌, జగిత్యాల్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లకు ఆర్‌.వి.కర్ణన్‌, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేటలకు అనిత రామచంద్రన్‌, నిజామాబాద్‌, కామారెడ్డిలకు శరత్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరిలకు విజయేంద్ర, మహబూబ్‌నగర్‌, నారాయణపేట్‌, వనపర్తి, జోగులాంబ, గద్వాల్‌, నాగర్‌ కర్నూల్‌లకు శృతి ఓజ, వరంగల్‌, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌లకు గోపి, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేటలకు భారతి కొలిగేరి, ఖమ్మం భద్రాద్రి, కొత్తగూడెంలకు సురేంద్ర మోహన్‌లను నియమితులయ్యారు. ఈ రెండు నెలలపాటు అధికారులు ఎవరూ సెలవులు పెట్టకూడదని ఆదేశాల్లో పేర్కొంది. జిల్లాల వారీగా తాగునీటి సమస్యలు రాకుండా నిర్వహణ బాధ్యతలు అప్పగించింది.

Leave a Reply