Suryaa.co.in

Andhra Pradesh

వ్యాపారస్తులను జగన్ రెడ్డి ప్రభుత్వం నిలువు దోపిడి చేస్తోంది

-ఎవరి హయాంలో వ్యాపారులకు మేలు జరిగిందో బహిరంగ చర్చకు సిద్దమా?
-చందాల శ్రీను సీఎం సతీమణి భారతిరెడ్డికి రూ. 65 లక్షల విలువైన బంగారపు వస్తువు ఎందుకిచ్చారు?
– టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్

వ్యాపారస్తులకు వైసీపీ పాలనలో ఒనగూరింది ఏమీ లేదని సీఎం జగన్ నిర్ణయాల వల్ల అన్ని రకాల వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ ద్వజమెత్తారు. శనివారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జె ట్ లో వ్యాపారస్తులకు ఒరిగిందేమీ లేదు, వ్యాపారులను నిలువునా దోపిడి చేస్తున్నారు. వ్యాపారస్తులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వ్యాపారస్తులపై కక్ష్యగట్టి వేధించటం దుర్మార్గం.

నిమ్మకాయను పిండినట్టు వ్యాపారస్తుల దగ్గర ట్యాక్స్ లు పిండి వసూలు చేస్తున్నారు. వ్యాపారస్తులకు ఇవ్వాల్సిన రాయితీలు తగ్గించారు, వ్యాపారస్తులు రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం లేదా? జగన్ రెడ్డి మాదిరి వ్యాపారులు అక్రమంగా వేల కోట్లు దోచుకోలేదు, కష్టపడి సంపాదించుకుంటున్నారు. జగన్ రెడ్డి నిర్ణయాల వల్ల తోపుడు బండి వ్యాపారస్తుల దగ్గర నుంచి మెగా ఇండస్టరీస్ వ్యాపారస్తుల వరకు రూ. 10 లక్షల కోట్లు నష్టపోయారు. వ్యాపారస్తులకు ఎవరి హయాంలో మేలు జరిందో బహిరంగ చర్చకు వైసీపీ సిద్దమా?

చంద్రబాబు నాయుడు హయాంలో వ్యాపారులకు చేసిన మేలుపై ఆధారాలతో చర్చించడానికి నేను సిద్దం. గ్రానైట్ వ్యాపారులపై ఇష్టానుసారం దాడులు చేస్తున్నారు. గ్రానైట్ పరిశ్రమ మీద ఎన్ని వేల కుటుంబాలు ఆధాపరడి ఉన్నాయో సీఎం జగన్ కి తెలుసా? పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గ్రానైట్ పై అధికారులు కారం పొడి ప్యాకెట్లతో దాడులకు వెళ్లడం ఏంటి? జగన్ రెడ్డి పాలనలో అధికారుల వాహనాలకు నంబర్ ప్లేట్లు ఉండవు, పోలీసులకు నేమ్ బ్యాడ్జ్ లు ఉండవు.

జగన్ రెడ్డి పాలన దెబ్బకు అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. స్నిన్నింగ్ మిల్లులు మూసివేశారు. టీడీపీ హయాంలో సంవత్సారానికి రూ. 10 లక్షలు వచ్చిన కరెంట్ బిల్లు నేడు రూ. 16 లక్షలు వస్తోంది. కోల్డ్ స్టోరేజ్ లు మూసేశారు. బట్టల వ్యాపారులకు ఉన్న 5 శాతం జీఎస్టీని 12 శాతానికి పెంచాలన్న నిర్ణయంపై వెల్లంపల్లి ఎందుకు మాట్లాడలేదు? వ్యాపారస్తులకు మేలు చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు ఏంటి? రెండు కేజీల బెల్లం అమ్మినందుకు వ్యాపారస్తులపై అక్రమ కేసులు పెట్టారు. జగన్ రెడ్డి అన్ని రకాల వ్యాపారస్తుల గొంతు కోశారు. చెత్తపన్ను, ప్రాపర్టీ ట్యాక్స్ ఇలా అన్ని పెంచారు.

విజయవాడలో చందాల శ్రీను (వెల్లంపల్లి శ్రీను ) వ్యాపారుల దగ్గర చందాలు వసూలు చేసి దాన్ని తాడేపల్లి ప్యాలెస్ కి పంపిస్తున్నారు. సీఎం సతీమణి భారతి రెడ్డికి రూ. 65 లక్షల విలువైన బంగారపు వస్తువు చందాల శ్రీను ఇవ్వటం వాస్తవం కాదా? వెల్లంపల్లి శ్రీను నియోజకవర్గం ఎందుకు మారాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి. వెల్లంపల్లి శ్రీను దేవాదాయ శాఖమంత్రిగా ఉన్నపుడే హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. పూజారులను హింసించారు. వెల్లంపల్లి నోరు అదుపులో పెట్టుకోవాలి.

వ్యాపారస్తులకు మేలు జరిగింది టీడీపీ హయాంలోనే ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ వ్యాపారులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటాం. వ్యాపారులను వేధిస్తున్న జగన్ రెడ్డి బుద్ది చెప్పేందుకు వ్యాపారులంతా సిద్దంగా ఉన్నారని డూండి రాకేష్ అన్నారు.

LEAVE A RESPONSE