2019లో రాష్ట్రం అంతా జగన్ గాలి వీస్తే ఆ గాలికి ఎదురు నిలబడి గెలిచిన వ్యక్తి వల్లభనేని వంశీ.. ఆ గెలుపుకి ఒక ప్రత్యేకత ఉంది. గన్నవరంలో 1999, 2009లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలవర్ధన రావు, 2014లో గన్నవరంలో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిన దుట్టా రామచంద్రరావు, కొత్తగా వైసీపీలో చేరి అతి తక్కువ కాలంలో మాస్ ఫాలోయింగ్ పెంచుకున్న యార్లగడ్డ వెంకటేశ్వరరావు. ఈ ముగ్గురూ వైసీపీ వైపు నిలబడగా వంశీ ఒక్కడే టీడీపీ వైపు నిలబడి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వీచిన జగన్ గాలిని సైతం ఎదిరించి ఎమ్మెల్యేగా గెలిచాడు.
టీడీపీలో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో పట్టు కోసమో, ఆస్తుల రక్షణ కోసమో, ఇక టీడీపీకి భవిషత్తు లేదని నమ్మకంతోనో, తన మిత్రుడు కొడాలి నాని సూచనల ప్రకారమో కానీ 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీలోకి జంప్ చేశాడు వంశీ..
వంశీ కమ్మ కులానికి చెందిన నాయకుడు అవ్వడం వలన జగన్ కి అతని మీద నమ్మకం లేదు. అతని చేరికపై ఇష్టం కూడా లేదు. కేవలం చంద్రబాబుకి ప్రతిపక్ష నేత హోదా లేకుండా చెయ్యాలనే ప్లాన్ లో భాగంగా వంశీని వైసీపీలోకి చేర్చుకున్నాడు. అప్పటికే పార్టీలో ప్రభుత్వంలో కమ్మ వారికి ఎటువంటి పనులు జరగడానికి వీల్లేదు అని జగన్ అంతర్గతంగా నిర్ణయం తీసుకున్న కారణంగా, వైసీపీలో చేరిన వల్లభలేని వంశీకి చాలాకాలం పాటు జగన్ ప్రాపకం దొరకలేదు.
జగన్ ప్రాపకం కోసం అప్పట్లో వంశీ చాలా ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా జగన్ ను ఎప్పుడైనా కలవగలిగే విజయసాయి రెడ్డి అనుచరుడు గుర్రంపాటి దేవేంద్ర రెడ్డికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేశాడు. గుర్రంపాటి దేవేంద్ర రెడ్డిని కలవడం కోసం వంశీ అనుచరుల్లో ఒకరైన వ్యక్తి ,అప్పట్లో కొన్నిసార్లు నాకు ఫోన్ చేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆ తర్వాత కాలంలో దేవేంద్ర రెడ్డిని వంశీ కలిసాడు. ఆవిధంగా దేవేంద్ర రెడ్డికి దగ్గరైన తర్వాత కొడాలి నాని, దేవేంద్ర రెడ్డితో కలిసి లోకేష్ జూమ్ కాల్ మీటింగ్ లోకి చొరబడిన విషయం మీ అందరికీ తెలిసిందే.
చంద్రబాబుని మానసికంగా వేధించడం కోసం భవనేశ్వరి ని తిట్టే విధంగా కమ్మ కులానికి చెందిన వంశీకి బాధ్యతలు ఇచ్చాడు జగన్. భువనేశ్వరి ని తిడితే వంశీకి టీడీపీలో శాశ్వతంగా తలుపులు మూసుకుపోతాయి. అప్పుడు ఎలక్షన్స్ లో సీటు ఇవ్వకపోయినా వైసీపీలోనే ఉండిపోతాడు. ఆవిధంగా ప్లాన్ ప్రకారం నారా భువనేశ్వరి ని తిట్టే విధంగా తాడేపల్లిలో స్క్రిప్ట్ తయారు చేసి వంశీకి ఇచ్చాడు.
భువనేశ్వరి ని వంశీ అన్న మాటలు వంశీ సొంత మాటలు కాదు, జగన్ ప్లాన్ లో భాగంగా అన్న మాటలు.. చంద్రబాబు ని, లోకేష్ ని తిట్టించడం కోసం GVD కృష్ణ మోహన్ అనే వ్యక్తి తాడేపల్లిలో స్క్రిప్టులు రాస్తూ ఉంటాడు. ఈ విషయం నేను చెప్పడం కాదు, అప్పట్లోనే వైసీపీ నుండి బయటకు వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది. రీసెంట్ గా బీజేపీలో చేరిన రవిచంద్రా రెడ్డి కూడా ఆ విషయం చెప్పడం జరిగింది.
స్క్రిప్ట్ ఎవరిదైనా, ప్లాన్ ఎవరిదైనా తిట్టింది వంశీ కాబట్టి అతను ఖచ్చితంగా శిక్షార్హుడు. వారు తిట్టమని చెప్పినంత మాత్రాన తిట్టడానికి వంశీకి బుద్ధి జ్ఞానం విచక్షణ అనేవి ఉండాలి. ఎంత జగన్ ప్రాపకం కోసం ఎదురు చూస్తే మాత్రం మాజీ సీఎం కూతురు, మాజీ సీఎం అలాగే అప్పటి ప్రతిపక్ష నేత భార్య అయిన 70ఏళ్ల మహిళ క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడటం చాలా పెద్ద తప్పు.
ఇక్కడ టీడీపీ అభిమానులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ..టీడీపీ ఎమ్మెల్యే మీద టీడీపీ అభిమానులే పగపట్టే విధంగా జగన్ స్కెచ్ వేసాడు అనే విషయం. మర్డర్ చేసిన వ్యక్తి కన్నా చేయించిన వ్యక్తి అసలైన నేరస్థుడు. అలాగే భువనేశ్వరి ని తిట్టిన వంశీ కన్నా తిట్టించిన జగన్ అసలైన దుర్మార్గుడు. ఈ విషయాన్ని మరచి కేవలం వంశీ మీదనే పగ పెంచుకున్న కారణంగా ..జగన్ ను కూడా ఈ విషయంలో భాగస్తుడిని చెయ్యాలని టీడీపీ అభిమానులకు నా సూచన.
– అమృత్