Suryaa.co.in

Andhra Pradesh

ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో బాగుపడింది జగన్ ఒక్కడే

-ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో బాగుపడింది జగన్ ఒక్కడే
-1500 బస్సులు..రూ.15 కోట్ల ఖర్చు…ఇదీ జగన్ సభల తీరు
-42 ఏళ్ల టీడీపీ ఏనాడూ ఆస్తులు పోగేసుకోలేదు…ప్యాలెస్ లు, బంగ్లాలు కట్టుకోలేదు
రాష్ట్రం కోసం పోరాడుతున్న టీడీపీకి విరాళాలిచ్చి సాయం చేయండి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

-tdpforandhra.com వెబ్ సైట్ ను ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు
-విరాళాల కోసం ప్రజలకు విజ్ణప్తి…తన వంతుగా *రూ.99,999లు ఆన్ లైన్ ద్వారా విరాళం

అమరావతి :- ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో బాగుపడింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఒక్కో రోజుకు 1500 బస్సులు..రూ.15 కోట్ల ఖర్చుతో జగన్ సభలు జరుగుతున్నాయని ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. జగన్ ఏమైనా వ్యవసాయం చేశారా…వ్యాపారం చేశారా అని నిలదీశారు. బస్సు యాత్ర సాగేటప్పుడు ఐప్యాక్ టీంను పెట్టుకుని ప్రీపెయిడ్ హ్యూమన్ యాంగిల్ చూపిస్తారన్నారని అన్నారు. పార్టీకి విరాళలందించేందుకు గాను tdpforandhra.com సైట్ ను మంగళవారం ఆవిష్కరించారు. విరాళాల కోసం ప్రజలకు విజ్ఞప్తి చేసిన చంద్రబాబు…తన వంతుగా రూ.99,999లు ఆన్ లైన్ ద్వారా చెల్లించారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ….‘‘రాష్ట్రాన్ని జగన్ రివర్స్ గేర్ లో నడిపిస్తున్నారని అన్నారు. టీడీపీ చరిత్ర కలిగిన పార్టీ అని, 42 ఏళ్లు అనుభవం ఉందన్నారు. రాజకీయాల్లోకి ధనవంతులు, భూస్వాములు కాకుండా..విద్యావంతులు రావాలి..నీతివంతులతో సామాజిక న్యాయం కోసం టీడీపీ ముందుకు వెళ్లిందన్నారు. చదువుకున్న వారిని ఎమ్మెల్యే, ఎంపీలుగా చేశాం. విలువతో రాజకీయాలు చేశాం. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో మా పార్టీకి కార్యాలయాలు లేవు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు కాకుండా కార్యాలయాలు కట్టుకోవాలని ఏనాడూ ఆలోచించలేదు. టీడీపీ ఏనాడూ భూములు తీసుకుని ప్యాలెస్ లు కట్టలేదు. ప్రజలు అంటే మా నేతలు భయపడి పనిచేశారు. తెలుగుజాతిలో టీడీపీ ఒక భాగం.

తెలుగుదేశం రాకముందు…తర్వాత అన్న పరిస్థితి ఉంది. ఒకప్పుడు తెలుగుజాతికి ఉనికి లేదు…మదరాసి అనేవాళ్లు…అక్కడి నుండి పుట్టింది. ఆత్మగౌరవాన్ని చాటిచెప్పి, ఆత్మవిశ్వాసం ఉన్న పార్టీ టీడీపీ. పార్టీకి 2 ఏళ్లకు ఒకసారి సభ్యత్వం ద్వారా వచ్చిన డబ్బులను కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాం. వైసీపీలాగా అక్రమ సొమ్ముతీసుకోవడం లేదు. రూ.160 కోట్లకు వైసీపీ జూదగాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని విలువల గురించి మాట్లాడుతోంది. ఆన్ లైన్ జూదాన్ని అధికారికంగా ఒప్పుకున్నారు. అలాంటి నీచనమైన పనులు చేయడం దుర్మార్గం. మేము తెలుగు ప్రజలపైనే ఆధారపడుతున్నాం. అందరూ ముందుకు వచ్చి తోచిన విధంగా పార్టీకి సాయం అందించాలి. ఎన్ఆర్ఐలు కూడా విరాళాలు చెల్లించేందుకు అవకాశం ఉంది.

రంగులకు ఇచ్చిన ప్రాధాన్యత విద్యా ప్రమాణాలకు ఇవ్వలేదు
రాష్ట్రంలో నష్టపోని ఏ వ్యక్తీ లేరు. ఐదు కోట్ల మందిలో జగన్ ఒక్కడే బాగుపడ్డారు. రాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో నడిపిస్తున్నారు. నా జీవితంలో ఎప్పుడూ చూడని ప్రస్టేషన్ ప్రజల్లో ఉంది. నేను ఎక్కడికి వెళ్లినా మహిళలు, చిన్నారులతో సహా వస్తున్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. ఇంగ్లీష్ ను నేర్చుకోవచ్చు…కానీ నాలెడ్జ్ ను నేర్చుకోలేం. ప్రైమరీ విద్యనంతా మాతృభాషలో చదువుకుని తర్వాత ప్రొఫెషనల్ కోర్సుల్లో ఇంగ్లీష్ నేర్చుకుంటారు. రంగులు కొట్టేదానికి ఇచ్చే ప్రాధాన్యత విద్యాప్రమాణాలకు ఇవ్వడం లేదు. ప్రపచంలో ఉండే తెలుగువాళ్లు కూడా ప్రభుత్వ స్కూళ్లు, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుకున్నారు..కానీ ఇప్పుడు అంతటి ప్రమాణాలు స్కూళ్లలో లేవు.

స్కూళ్లు అందుబాటులో ఉంటేనే చదవగలురుగుతారు. అమెరికా లాంటి దేశాల్లో పొలిటికల్ డొనేషన్స్ లీగల్ అనుమతులు ఉన్నాయి. రూ.2000, రూ.500, రూ.200 నోట్లు కూడా రద్దు చేయాలని గతంలో చెప్పాను. దీని ఎన్నికల్లో పంపకాలు ఆగిపోతాయి. పంపకాలు ఆగిపోతే అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం వస్తుంది….ఇది కూడా పేదరికం లేని దేశంగా మారడానికి మనకు అవకాశం ఉంది. పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్ ద్వారా రోడ్లు, టెలికాం రంగం అభివృద్ధి చెందింది. పీ4 ద్వారా పేదరికం నుండి పైకి తీసుకురావచ్చు. ప్రతి ఇంటిపై కూటమి జండాను కట్టాలి. స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి మా పోరాటంలో కలిసి సహకరించాలి. తణుకు నిడదవోలు, పి.గన్నవరం, అమలాపురంలో పవన్ తో కలిసి ప్రచారంలో పాల్గొంటాం.

ఫేక్ లెటర్లతో వైసీపీ ఫేక్ ప్రచారం
కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలతోనూ సమన్వయం చేసుకుని ముందుకు వెళతాం. వైసీపీ ఓడిపోతుందన్న సీఐడీ హెరిటేజ్ పత్రాలు తగలబెట్టింది. రియల్ సినిమా రాబోతోంది…అర్థమై ఇవన్నీ చేస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా నా పేరుతో ఫేక్ లెటర్లు విడుదల చేస్తున్నారు. సూపర్-6 పథకాలు రద్దు చేశామని సోషల్ మీడియాలో తిప్పారు. ఇవన్నీ 420, పేటియం బ్యాచ్ లక్ష్యంగా పెట్టుకుంది. కుట్రలు, కుతంత్రాలు, ఫోన్ ట్యాపింగ్ లు జరిగాయి. నిత్యం అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. ప్రతి రోజూ తాడేపల్లిలోకి కంటెయినర్లు వెల్తున్నాయి..తాడేపల్లికి బయట నుండి సాయంత్రం వెహికల్స్ వేరే రూటులో వస్తాయి. అక్రమ సొమ్మును లెక్కబెట్టడానికి మిషన్లు కూడా ఉన్నాయంటున్నారు. ఆ సొమ్మును ఇప్పుడు బయటకు పంచుతున్నారు. టెక్నాలజీని చేతుల్లో పెట్టుకుని భూమి రికార్డులు కూడా తారుమారు చేస్తారు. రాయల్టీ వసూళ్ల బాధ్యతను ప్రైవేట్ వ్యక్తులకు జిల్లాల వారిగా అప్పగించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించి కొన్ని మీడియా సంస్థలు వ్యాపారం చేస్తున్నాయి.

LEAVE A RESPONSE