Home » కొత్త యేడాదిలో ప్రజలకు సాధికారత రావాలి

కొత్త యేడాదిలో ప్రజలకు సాధికారత రావాలి

-బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల క్షేమమే లక్ష్యంగా త్వరలో కూటమి మేనిఫెస్టో
-వాలంటీర్లకు ఉగాది రోజున తీపి కబురు చెప్తున్నా….జీతం రూ.10 వేలకు పెంచుతాం
-నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకూ నీళ్లు…వైసీపీ ప్రభుత్వం కనీసం తాగునీళ్లూ ఇవ్వలేకపోతోంది
-టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
-మంగళగిరిలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

అమరావతి :- ఈ కొత్త యేడాదిలో రాష్ట్ర ప్రజలకు సాధికారత రావాలని…తద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆకాక్షించారు. ఆశయంతో, ఉత్సాహంతో చేసే ప్రతి పనీ నెరవేరాలని, ప్రతి ఒక్కరి కృషికి ఫలితం రావాలన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉగాది వేడుకల్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి, శాంతి భద్రతలు ఉండాలి. సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని మంచికోసం ఖర్చు చేయడం అంతే అవసరం. వైశ్యులు వ్యాపారం చేస్తారు…వ్యాపారంలో వచ్చిన ఆదాయంలో కొంత సంక్షేమానికి ఉపయోగిస్తారు. అదే అలవాటు తెలుగుజాతి మొత్తానికి రావాలి. సంపాదనలో తెలగువారికి మించిన వారు ఎక్కడా లేరు. సేవాభావం కూడా తెలుగువారికి అవసరం. అలాంటప్పుడే రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉంటారు.

ప్రజలకు ఐదేళ్లుగా కారం, చేదే మాత్రమే మిగిలాయి
ఉగాది అనగానే మనకు ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. షడ్రచులతో దీన్ని తయారు చేస్తారు. తీపి, వగరు, చేదు, పులుపు, ఉప్పు, కారం రుచులతో పచ్చడి చేస్తారు. మన జీవితంలో కష్టాలుంటాయి…ఇబ్బందులుంటాయి. వీటన్నింటికీ ముందగా సిద్ధమవ్వడానికే తెలుగు యేడాది తొలిరోజున ఉగాది పచ్చడితో ప్రారంభిస్తారు. ఐదేళ్లుగా ప్రజలకు కారం, చేదు మాత్రమే మిగిలాయి. నిద్ర లేస్తే భయం…రోజు ఎలా గడుస్తుందో చెప్పలేం. ఇంటికి భద్రంగా తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేదు. మన ఆస్తులు మనకు ఉంటాయో లేదో తెలీదు. మెడపై కత్తిపెట్టి ఇస్తావా…చస్తావా అని బెదిరించేవారు. చరిత్రలో కుంభకర్ణుడు పోరు పడలేక నాడు ఊరికొకరు బండెడు అన్నం పంపించేవారు…నేడు రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. ఎక్కడ చూసినా ప్రజల్లో అశాంతి, అభద్రతా, ఆవేశం ఉన్నాయి.

మరింత పేదలుగా మారిన ప్రజలు
రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయి…పేదలు మరింత పేదలు అయ్యారు. జగన్ రూ.10 లు ఇచ్చి వంద లాగుతున్నాడు. ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారింది. పేదలు అప్పులపాలయ్యారు. ప్రభుత్వం ఇచ్చే సాయం ఎంతో అవసరం…విధానాలు సరిగా లేకపోతే అది ఉపయోగపడదు. ఈ ఉగాదితో ప్రజలకు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది…హైదరాబాద్ తెలంగాణకు వెళ్లింది. పెన్షన్లు కూడా ఇవ్వగలమా అన్న సందిగ్ధంలో ఉన్నాం. అమరావతిని అభివృద్ధి చేసి హైదరాబాద్ కంటే మిన్నగా చేయాలని రూపకల్పన చేశాం. పోలవరం నిర్మాణం కూడా వేగవంతం చేశాం. రాష్ట్రానికి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం….6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అభివృద్ధి చేయడమే కాదు..సంపద సృష్టించి ప్రజలకు చేరవేయాలి. ప్రజలకు వంద సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. సంక్షేమాన్ని తీసుకొచ్చి ఆదుకుంది టీడీపీనే.

తాగునీరు ఇవ్వలేని సీఎం 3 రాజధానులు కడతాడా.?
కరువు నివారణకు ఏపీలో అవకాశం ఉంది. నదుల అనుసంధానంతో పాటు డ్రిప్ అందిస్తే ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చు. రాష్ట్రంలో భూగర్జ జలాలు ఇంకిపోయాయి…జలాశయాల్లో నీళ్ల లేవు. కర్నూలు జిల్లాలో వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి…ప్రమాదకర పరిస్థితులు వచ్చాయి. ప్రజలకు తాగునీరు ఇవ్వలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడా.? ఐదేళ్లలో మంచి రోజులు కాదు….నరకం ఏంటో ప్రజలు చూశారు. తాగడానికి నీళ్లు లేవు…భూగర్భ జలాలు లేవు. భూ గర్భ జలాలు పెంచడానికి ఇంకుడు గుంతలు మనం తవ్వించాం. ప్రకృతిని పెంచడానికి కృషి చేశాం. జగన్ ను ప్రజలు దించేయబోతున్నారు. మంచిరోజులు రాబోతున్నాయి. పట్టిసీమ ద్వారా నీళ్లు ఆదా చేశాం. శ్రీశైలం నుండి హంద్రీనీవా ద్వారా నీళ్లందించాం. అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం పన్నుల భారం మెపింది. గంజాయి, డ్రగ్స్ తో పాటు దాడులు చేస్తోంది. హింసా రాజకీయాలు, ఎర్రచందనం, ఇసుక మాఫియా ఇష్టారీతిన ప్రవర్తిస్తోంది. ఈ రోజు నుండి 34 రోజుల్లో తెలుగుజాతికి పూర్వవైభవం రావాలి. రాజకీయం లేకుండా పంచాంగం లేదు. పంచాంగం స్ఫూర్తిని ఇస్తుంది…ఆ స్ఫూర్తిని అమలు చేసేది…విశ్లేషించి మంచిని ముందుకు తీసుకెళ్లే శక్తి రాజకీయాల్లో ఉంది.

2047 నాటికి ప్రపంచలో అగ్రగామిగా భారత్
జగన్ వచ్చాక రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారు. రూ.1.5 లక్షల కోట్లు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పులు ఉంది. రాష్ట్ర పునర్మిర్మానం కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని టీడీపీ, జనసే, బీజేపీ జట్టుకట్టాయి. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్ర సాకారం అవసరం. పార్టీ ఆవిర్భావం తర్వాత 22 ఏళ్లు అధికారంలో ఉన్నాం…ఎలాంటి వివక్ష లేకుండా పాలించాం. ప్రపంచం నాలెడ్జ్ ఎకానమీతో ముందుకు వెళ్తోంది. 2047 నాటికి దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతుంది. ప్రస్తుతం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉన్నాం. 2030 నాటికి 3వ స్థానానికి చేరుతుంది..2047 నాటికి మొదటి స్థానికి వెళ్తుంది. ప్రపంచంలో నెంబర్-1 స్థాయిలో తెలుగుజాతి ఉండాలి. తలసరి ఆదాయంలో నెంబర్-1గా ఉన్నారు…ఆరోగ్యంలో ఉంటారు. పేదరికం లేని సమాజం రావాలి…ఇది ఎన్టీఆర్ ఆశయం.. పేదరికం లేని సమాజాన్ని నేను తప్పకుండా చూస్తాను. ఇవన్నీ చేయాలంటే కేంద్ర సాకారం అవసరం…వచ్చేది కూటమి ప్రభుత్వమే. సమాజంలో సైకో పార్టీకి స్థానం లేకుండా చేయాలి.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల క్షేమమే లక్ష్యంగా త్వరలో కూటమి మేనిఫెస్టో
కూటమి ప్రకటించిన సూపర్-6 ఇంటింటికీ వెళ్తే ప్రత్యర్థులకు డిపాజిట్లు రావు. ప్రభుత్వం అంటే సంపద సృష్టించాలి…అభివృద్ధి చేయాలి. త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టో తీసుకొస్తాం. మహిళలు, బీఎస్సీ, బీసీ, మైనారిటీల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో తెస్తాం. వృద్ధులు, వితంతువులకు పెన్షన్ విధానాన్ని ఎన్టీఆర్ తెచ్చారు. రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2,000 వేలు చేసింది టీడీపీ. సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే. కూటమి అధికారంలోకి రాగానే రూ.4 వేల పెన్షన్ 1వ తేదీనే ఇస్తాం. ఒక నెలలో తీసుకోకపోతే మరొక నెలలో కూడా అందిస్తాం. వికలాంగులకు రూ.6 వేలు పెన్షన్ అందిస్తాం. వాలంటీర్ల జీవితాలతో సీఎం ఆడుకుంటున్నారు. తమ పార్టీ వాళ్లే ఉన్నారని జగన్ అన్నారు. వాలంటీర్లతో జగన్ లబ్ధిపొందాలని చూశాడు. పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగులతో ఇవ్వండని ఈసీ నిర్ణయం తీసుకుంటే…శవ రాజకీయాలు చేశాడు. ముసులి వాళ్లను తెచ్చి పెన్షన్ ఇవ్వకుండా పంపడంతో కొందరు చనపోయారు.

వాలంటీర్లను తొలగించం….జీతాలు పెంచుతాం…
వాలంటీర్లను రాజీనామాలు చేయాలని చెప్పాడు…కానీ చాలా మంది చేయలేదు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం. వాలంటీర్లు వైసీపీకి కాకుండా ప్రజలకు చేస్తే అండగా ఉంటాం. జగన్ నిన్నటి దాకా వాలంటర్లు రాజీనామా అన్నాడు..ఇప్పడు వ్యవస్థే లేదు అంటున్నాడు. అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థపై పెడతా అన్నాడు…మరి వ్యవస్థ లేనట్లే కదా.? జగన్ మోసం చేస్తున్నాడు దగా…అవకాశ వాద రాజకీయం చేస్తున్నాడు. పూటకో మాట మాట్లాడుతున్నాడు. రాజీనామా చేయకుండా పార్టీకి సేవ చేయాయలని చెప్తున్నాడు..కేసుల ఎదుర్కొంటే మంచి చదవులు చదువుకుంటే వారి పరస్థితి ఏంటి.? కూటమి తరపున వాలంటీర్లకు ఉగాది సందర్భంగా తీపి కబురు చెప్తున్నా…వాలంటీర్ ఉద్యోగాలు తొలగించం…కొనసాగిస్తాం. రూ.5 వేలు కాదు…రూ.10 వేలు పారితోషికం ఇస్తాం. మీలో సమర్థత, శక్తి ఉన్నాయి..మీ ఇంట్లో మీరు కూర్చుని వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు. నిరుద్యోగ భృతి కూడా అందిస్తాం. స్కిల్ డెవలెప్మెంట్ ద్వారా భవిష్యత్తును నిర్మిస్తాం. తప్పుడు పనులు చేసి జైలుకుపోయి జీవితాలు పాడు చేసుకుంటారా…రాష్ట్రాభివృద్ధిలో బాగమవుతారో వాలంటీర్లు తేల్చుకోవాలి. జగన్ వచ్చేది లేదు..సచ్చేది లేదు నమ్మి మోసపోవద్దు. పెన్షన్లు నేనిస్తున్నా అంటున్నాడు….నువ్వు ఇవ్వడం ఏంటి… పెన్సన్ ఎవరిచ్చారు…నువ్విచ్చావా.? నీ భారతి సిమెంట్ నుండి ఇచ్చావా..? ప్రజలు కట్టిన ట్యాక్స్ నుండి పెన్షన్ ఇస్తున్నారు. అప్పులు చేయడం కాదు…సంపద సృష్టింది అప్పులు భారం లేకుండా సంక్షేమాన్ని ఇస్తాం. మంచికి మీరంతా సహకరించి దుర్మార్గులను దూరంగా పెట్టాలి.’’ అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Leave a Reply