Home » నిరుద్యోగులను మోసగించిన జగన్‌ను ఇంటికి పంపాలి

నిరుద్యోగులను మోసగించిన జగన్‌ను ఇంటికి పంపాలి

-వినుకొండలో ఏటా 2 వేల మందికి ఉద్యోగాలు
-ఏడాదికోసారి 20 కంపెనీలతో జాబ్‌మేళాలు
-టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
-బొల్లాపల్లి మండలంలో విస్తృత ప్రచారం

వినుకొండ నియోజకవర్గంలో ఏటా కనీసం 2 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తామని టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా కల్పించే ఉద్యోగాలకు ఇవి అదనమని తెలిపారు. వినుకొండలో ఏడాదికోసారి 20 కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగ మేళాలతో యువతకు అండగా ఉంటామన్నారు. గురువారం బొల్లాపల్లి మండలంలో ఆయన ప్రచారం నిర్వహించారు. పలుకూరు, రామాపురం, లక్ష్మీపురం తండా, సోమ్లావాగు తండాలో పర్యటించారు. లక్ష్మీపురం తండాలో గిరిజనులు, సుగాలీలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలింకారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్‌ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. చంద్రబాబు గతంలో 6.5 లక్షల ఉద్యోగాలు, 11 లక్షల మందికి రాయితీ రుణాలతో ఉపాధి కల్పించారని వివరించారు. నాడు 12 డీఎస్సీలు వేస్తే జగన్‌ ఒక్క డీఎస్సీ కూడా పెట్టలేదన్నారు. ఈసారి చంద్రబాబు 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించబోతు న్నారని, ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని తెలిపారు. ఐదేళ్లలో ఎమ్మెల్యే బొల్లా ఒక్కరికి కూడా ఇల్లు, మరుగుదొడ్డి ఇవ్వలేదని విమర్శించారు.

పేదలకు సెంటు స్థలాల పేరిట బొల్లా దోచుకున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాగానే పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఎన్టీఆర్‌ కాలనీలు నిర్మిస్తామని.. ఇల్లు లేని పేదలకు తామే నిర్మించి ఇస్తామని తెలిపారు. వరికపూడిశెల ప్రాజెక్టుకు లావు శ్రీకృష్ణదేవరాయలు అనుమతులు తీసుకొచ్చారని, అలాంటి మంచి వ్యక్తిని ఆదరించాలని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. బొల్లాని చిత్తుచిత్తుగా ఓడిరచాలని పిలుపునిచ్చారు.

Leave a Reply