Home » వైసీపీ మద్యం మాఫియా

వైసీపీ మద్యం మాఫియా

-అక్రమంగా తరలిస్తున్న 1200 సీసాల స్వాధీనం
-పిడుగురాళ్లలో అదుపులో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో స్కార్పియో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 1200 మద్యం సీసాలను, వైసీపీ మేనిఫెస్టో పత్రాలను గురువారం జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి కల్పశ్రీ పట్టుకున్నా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిడుగురాళ్ల పట్టణంలోని పల్నాడు బార్‌ నుంచి ఎన్నికల ప్రచారం కోసం మందు తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం రావడంతో బార్‌ దగ్గర తనిఖీలు చేసినట్లు వివరిం చారు. అనుమానాస్పదంగా ఉన్న స్కార్పియో వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు రూ.3 లక్షల విలువ చేసే 1200 మద్యం సీసాలను గుర్తించి పట్టుకున్నట్లు చెప్పారు.

డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కార్యాలయానికి అప్పగించామని తెలిపారు. ఎన్నికల్లో ఎవరైనా డబ్బు, మద్యం పంపిణీ చేసినట్టు అనుమానం వస్తే జిల్లా ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పట్టుబడ్డ ఇద్దరు వైసీపీ సానుభూతిపరులుగా తెలుస్తుంది. వైసీపీ మేనిఫెస్టో పత్రాలను కూడా వాహనంలో ఉన్నాయి.

Leave a Reply