జగన్మోహన్ రెడ్డి తలతిక్క నిర్ణయాలతో 8లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు
• ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు నమోదైన విద్యార్థులు 37.59లక్షలమంది
• గత ఏడాది (2021-22) ఇదేసమయంలో ప్రభుత్వపాఠశాలల్లో ఉన్న విద్యార్థులు 45.71లక్షలు.
• కేవలం సంవత్సరానికే 8 లక్షలకు పైగా విద్యార్థులు ప్రభుత్వపాఠశాలలకు ఎందుకు గుడ్ బై చెప్పారో ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానంచెప్పాలి
• జగన్మోహన్ రెడ్డి ఏంచదివాడని.. తలతిక్క నిర్ణయాలతో విద్యార్థుల్ని విద్యకు దూరం చేస్తున్నాడు?
• అన్నిదేశాలు మాతృభాషలో విద్యాబోధన సాగిస్తుంటే, జగన్ ఒక్కడే, తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇంగ్లీష్ మీడియాన్ని బలవంతంగా విద్యార్థులపై రుద్దుతున్నాడు.
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
పాఠశాలలు ప్రారంభమయ్యాక రాష్ట్రవ్యాప్తంగా నమోదైన విద్యార్థులసంఖ్య 37.59లక్షలని, ఇదేరోజున 2021-22 విద్యా సంవత్సరంలో 45.71లక్షలమంది ఉన్నారని, గత ఏడాదితోపోలిస్తే 8లక్షలకు పైగావిద్యార్థులు ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు స్వస్తి చెప్పారని ఈస్థాయిలో విద్యార్థుల డ్రాపవుట్స్ పెరగడంపై ముఖ్యమంత్రి, మంత్రులు ఏం సమాధానం చెబుతారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు నిలదీశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ జగన్మోహన్ రెడ్డి, అతనిప్రభుత్వం విద్యావ్యవస్థను గొప్పగా సంస్కరించినట్టు, రాష్ట్రం లో ప్రతివిద్యార్థికి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు, నాడు-నేడు పథకంతో విద్యా రంగాన్ని పటిష్టపరిచినట్టు గొప్పలుచెప్పుకుంటోంది. విద్యారం గం బలోపేతమైతే విద్యార్థుల సంఖ్య పెరగాలిగానీ ఎందుకు తగ్గింది?
జగన్ బలవంతంగా విద్యార్థులపై రుద్దిన ఇంగ్లీష్ మీడియం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విధానాలే 8లక్షల డ్రాపవుట్స్ కు కారణం
రెండుసంవత్సరాల్లో 8లక్షల మంది విద్యార్థులు డ్రాపవుట్ అవ్వడానికి ప్రధానకారణం, ముఖ్యమంత్రి తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం. దాన్ని ఐచ్ఛికంగా అమలుచేయకుండా బలవంతంగా విద్యార్థులపై రుద్దడం వల్లనే డ్రాపవుట్స్ పెరిగాయి. రెండోది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అర్థంతరంగా అమలుచేయడం. మూడోతరగతి వరకు ప్రాథమిక విద్య, అక్కడినుంచి నేరుగా హైస్కూల్ కు వెళ్లేలా విద్యావిధానం మార్చడం. మూడో తరగతి వరకు తమకు అందుబాటులో ఉండే పాఠశాలల్లో చదివిన పిల్లలు, నాలుగో తరగతికి చేరగానే ఎక్కడోదూరంగా ఉండే హైస్కూళ్లకు వెళ్లాల్సిరావడం భారమైనందు నే డ్రాపవుట్స్ పెరిగాయి.
తమ పిల్లలను దూరం పంపించడం ఇష్టంలేని తల్లిదండ్రులు వారిని దగ్గర్లో ఉండే ప్రైవేట్ స్కూళ్లలో చేర్చేందుకు మొగ్గుచూపారు. అలానే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేశాం.. చదువుచెప్పండి అని ప్రభుత్వం ఉన్నపళంగా ఆదేశించడం తో అటు ఉపాధ్యాయులు, ఇటువిద్యార్థులు అయోమయానికి గురయ్యారు.
గతంలో టీడీపీ ప్రభుత్వం కేవలం మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అమలుకు సిద్ధమైతే, అదికూడా విద్యార్థులు తమకునచ్చిన మీడియం ఎంచుకోవచ్చనే వెసులుబాటు కల్పిస్తే, దానిపై సాక్షిమీడియా, జగన్మోహన్ రెడ్డి నానారాద్ధాంతంచేశారు. 70శాతం మందివిద్యార్థులు మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థులు చదువుమానేశారని సాక్షి మీడియా విషప్రచారంచేసింది. నాడు అలామాట్లాడిన జగన్ రెడ్డి, ఇప్పుడు ఒకే సారి అన్ని పాఠశాలల్లో బలవంతంగా ఇంగ్లీష్ మీడియాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు? ఇంగ్లీష్ మీడియంతో ఈ ముఖ్యమంత్రి సాధించేదేమిటి?
విదేశాల్లో బిచ్చగాళ్లు కూడా ఆంగ్లంలోనే మాట్లాడతారు.. మరి ఆదేశాల్లో నిరుద్యోగం.. ఇతర సమస్యలు ఎందుకున్నాయో ముఖ్యమంత్రి చెప్పాలి
విదేశాల్లో అందరూ ఆంగ్లమే మాట్లాడినా, అక్కడ నిరుద్యోగం, ఇతర సమస్యలు ఎందు కున్నాయి. ఆ దేశాల్లో బిచ్చగాళ్లుకూడా ఇంగ్లీష్ లోనే అడుక్కుంటారు. పేదవాళ్లు ఇంగ్లీష్ చదవకూడదా అనే డొంకతిరుగుడు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి, విద్యా ర్థులపై బలవంతంగా ఆంగ్లబోధనను ఎందుకు రుద్దుతున్నాడు? ఎవరికినచ్చిన మా ధ్యమంలో వారుచదువుకునే స్వేచ్ఛను ఎందుకు కల్పించరు? 8వతరగతి విద్యార్థుల కు ట్యాబ్ లు ఇచ్చి, బైజూస్ కంటెంట్ లో పాఠ్యాంశాల బోధనకు శ్రీకారంచుట్టారు.
ఆ వి ధానం ఏమైంది. బైజూస్ కంటెంట్, ట్యాబ్ లకోసం ప్రభుత్వం వందలకోట్లు తగలేసింది. ఆన్ లైన్ విధానంలో బైజూస్ కంటెంట్ లో పాఠ్యాంశాలు బోధిస్తే, విద్యార్థులు రాణిస్తారు అనుకోవడం మూర్ఖత్వమే. దానికి నిదర్శనమే ఈఏడాది పెరిగిన డ్రాపవుట్స్. ఇంగ్లీష్ మీడియం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకితోడు, హాస్టళ్లలో సౌకర్యాలకొరత, స్కాలర్ షిప్పులు సక్రమంగా అందకపోవడంవంటి అనేకకారణాలు విద్యార్థుల్ని విద్యకు దూరం చేశాయి.
జగన్మోహన్ రెడ్డి ఏం చదివాడని.. తలతిక్క నిర్ణయాలతో విద్యార్థుల్ని విద్యకు దూరం చేస్తున్నాడు?
జగన్మోహన్ రెడ్డి ఏం చదివాడని ఈ విధంగా తలతిక్క నిర్ణయాలతో విద్యార్థుల్ని విద్య కు దూరంచేస్తున్నాడు? విద్యారంగానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పు డు, మేథావులు, విద్యారంగ నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలిగానీ, ఏక పక్షంగా నచ్చినట్టు చేయడంకాదు. ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలు మాతృభాషలో విద్యాబోధన సాగిస్తుంటే, ఈ ముఖ్యమంత్రి తానే పెద్దతెలివిగలవాడు అయినట్టు ఇంగ్లీ ష్ మీడియంతోనే అన్నీసాధ్యమవుతాయన్నట్టు తననిర్ణయాన్నిసమర్థించుకున్నాడు.
పేదపిల్లలకు నాణ్యమైన విద్యకావాలిగానీ, ఇంగ్లీష్ మీడియమా..తెలుగుమీడియమా అనేది ముఖ్యంకాదు. ఇప్పటికే దేశంలో ఇంగ్లీష్ ప్రజలభాషలో భాగమైంది. చదువురా నివాడుకూడా ఇంగ్లీష్ పదాల్ని అసువుగా పలుకుతున్నాడు. ఇంగ్లీష్ పదాలు చాలా వరకు మనవాడుకభాషలో కలిసిపోయాయి. తెలుగును చంపేసి ఇంగ్లీష్ కు పెద్దపీట వేస్తాననడం ముమ్మాటికీ ముఖ్యమంత్రి తెలివితక్కువతనమే.
కస్తూరి రంగనాథన్, ఇతర ప్రముఖుల నివేదికలన్నీ 8వతరగతి వరకు విద్యార్థులకు విద్యాబోధన తెలుగు లోనే ఉండాలని అభిప్రాయపడ్డాయి. తనరాజకీయ ప్రయోజనాలకోసమే జగన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియాన్ని బలవంతంగా విద్యార్థులపై రుద్దాడు. తనమంత్రివర్గంలో చాలా మంది మంత్రులకు తెలుగుమాట్లాడటమే సరిగారాదు. ఇక ఇంగ్లీష్, హిందీ ఏం మాట్లాడతారు?
ఇంగ్లీష్ మీడియం.. అమ్మఒడి… నాడు-నేడుతో విద్యారంగాన్ని ఉద్దరించేశామన్న పాలకులమాటలతో నాలుగేళ్లలో విద్యారంగానికి ఒరిగింది శూన్యం
రాష్ట్రంలో దాదాపు 25వేల ఉపాధ్యాయఖాళీలు భర్తీచేయాల్సి ఉంది. విద్యార్థులపై బల వంతంగా ఇంగ్లీష్ మీడియం రుద్దిన ముఖ్యమంత్రి, దానికి అనుగుణంగా ఉపాధ్యాయు లకు ఎందుకు శిక్షణ ఇవ్వలేదు? ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్ని ఎందుకు భర్తీ చేయలేదు? ప్రాథమికంగా చేయాల్సినపనులు చేయకుండా ఇంగ్లీష్ మీడియం తీసుకొ చ్చాము .. అమ్మఒడి ఇస్తున్నాము.. నాడు-నేడు అమలుచేశామని చెబితే ఒరిగిందే మీలేదు. అమ్మఒడి పేరుతో కళాశాలలకు ఇవ్వాల్సిన సొమ్ముని తల్లులఖాతాల్లో వేయ డంవల్ల, ఆసొమ్ముని వారిఅవసరాలకోసం వాడుకొని, తరువాత సకాలంలో విద్యాసంస్థ లకు చెల్లించకపోవడంతో విద్యార్థులపరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
వసతి గృహా ల గురించి ఎంతతక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. హాస్టళ్ల గోడలకు రంగులేసిన జగన్ రెడ్డి, లోపలమాత్రం విద్యార్థులు పడుకోవడానికి బెడ్ లు లేకుండాచేశాడు. ఇక విద్యార్థులకు పెట్టేభోజనం, టాయ్ లెట్లవంటివి అధ్వాన్నంగా తయారయ్యాయి. అలానే హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ప్రభుత్వంఇవ్వాల్సిన కాస్మోటిక్ ఛార్జీలవంటి వాటిని పూర్తిగా నిలిపేసింది. 8లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వపాఠశాలలకు దూరమయ్యా రంటే దానికి కారణం ముమ్మాటికీ ముఖ్యమంత్రి అసమర్థవిధానాలే.
బైజూస్ లాంటి దివాళాకంపెనీలతో ఒప్పందంచేసుకొని జగన్ రెడ్డి, విద్యార్థులభవిష్యత్ ను అంధకారం లోకి నెట్టాడు. నచ్చిన మాధ్యమంలో విద్యాభ్యాసం కొనసాగించే స్వేఛ్ఛను ముఖ్యమం త్రి తక్షణమే విద్యార్థులకు కల్పించాలి. అలానే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుపై నిపుణులతో కమిటీలువేసి, వాటిసూచనలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలి. స్కూళ్లవిలీనంవల్ల విద్యార్థల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. డ్రాపువుట్స్ పెరగకుండా ప్రభుత్వం తక్షణం చర్యలుతీసుకోకుంటే, పాలకులు తగినమూల్యం చెల్లించుకుంటారు.” అని అశోక్ బాబు హెచ్చరించారు.