దళితజాతిని అవమానించిన ప్రభాకర్ రెడ్డిపై, జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతం?
– దళితుల్ని హింసిస్తూ, వారిస్వేచ్ఛ, హక్కుల్ని కాలరాస్తున్న జగన్, వైసీపీప్రభుత్వంపై వారు కన్నెర్రచేయాల్సిన సమయం వచ్చింది
• దళితజాతిని దారుణంగా అవమానించిన ప్రభాకర్ రెడ్డిపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలుతీసుకోవడంలేదో దళితు లు ఆలోచించాలి
• దళితజాతికి జరిగిన అవమానం, అవహేళనపై ప్రభుత్వంలోని దళితమంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలి
• జాత్యహంకారంతో విర్రవీగిన డొనాల్డ్ ట్రంపే అధికారంకోల్పోయాడు. దళితులు కన్నెర్రచేస్తే ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఎంత?
– టీడీపీ హెచ్.ఆర్.డీ విభాగం చైర్మన్ బీ.రామాంజనేయులు
దేశంలో ఎక్కడాలేనివిధంగా రాష్ట్రంలోనే దళితులపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయని దళితబిడ్డలకు తాను మేనమామను, దళితులు నా బంధువులని మాయమాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి, తన ప్రభుత్వంలో దళితులపై జరిగే దమనకాండను ఎందుకు నిరోధించలేకపోతున్నాడని టీడీపీ హెచ్.ఆర్.డీ ఛైర్మన్ రామాంజనేయులు ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
“ దళితులకు దక్కాల్సిన సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించి, గతప్రభుత్వం దళితులకు ప్రత్యేకంగా అమలుచేసిన 27పథకాల్ని రద్దుచేసిన జగన్మోహన్ రెడ్డి, తనపార్టీ ఎన్. ఆర్.ఐ చేత దళితులపై ఉమ్మువేయించడం ఎంతవరకు సబబు? దళితజాతికి జరుగు తున్న అవమానంపై ప్రభుత్వంలోని దళితమంత్రులు, అధికారులు, యావత్ దళిత వర్గమంతా ఆత్మపరిశీలన చేసుకోవాలి. దళితజాతిని దారుణంగా అవమానించిన పంచ్ ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎందుకు చర్యలుతీసుకోవడంలేదో యావత్ దళితజాతి ఆలోచించాలి.
దళితజాతి రక్షణ, వారికి ఎదురయ్యే అవమానాలకట్టడికోసం చంద్రబాబు తీసుకొచ్చిన జీవోలను జగన్మోహన్ రెడ్డి ఎందుకు అమలు చేయడంలేదు?
కరోనాసమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ని దారుణంగా హత్య చేశా రు. మాస్క్ ధరించలేదని కిరణ్ అనే యువకుడిని కొట్టిచంపారు. మద్యపాననిషేధంపై ముఖ్యమంత్రిని ప్రశ్నించినందుకు ఓంప్రతాప్ ని చంపేశారు. ఇసుకఅక్రమరవాణాపై ప్రశ్నించాడన్న అక్కసుతో వరప్రసాద్ కు శిరోముండనంచేశారు. ఇక దళితమహిళలపై జరిగిన దారుణాలు, హత్యలు, అత్యాచారాలు అన్నీఇన్నీకావు. నాగమ్మ, అనూష, స్నేహతల, రమ్య ఇలాఎందరో దళితఆడబిడ్డలు జగన్ ప్రభుత్వ అసమర్థతకు బలైపోయారు.
మహిళలపై దాడులు, నేరాలుఘోరాల్లో రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని ఎన్.సీ. ఆర్.బీ నివేదిక చెబుతోంది. రాష్ట్రంలో దళిత మహిళలపై 1290కి పైగా దాడులుజరిగితే, వాటిలో 834 లైంగికదాడులని ఎన్.సీ.ఆర్.బీ నివేదికచెప్పడం వైసీపీప్రభుత్వానికి తల వంపులు కాదా? రాజ్యాంగం దళితులకు కొన్నిప్రత్యేకహక్కులు కల్పించింది.
ఎవరి దయా దాక్షిణ్యాల పై ఆధారపడిబతకాల్సిన అగత్యం, అవసరం దళితులకు లేదు. దళిత జాతికి ఎదురవుతున్న అవమానాల్ని చంద్రబాబునాయుడు ప్రత్యేకచట్టంతో కట్టడి చేయగలిగారు. సమాజంలోదళితులు ఎదుర్కొంటున్న అవమానాలను శాశ్వతంగా నిరోధించేందుకు చంద్రబాబునాయుడు పున్నయ్యకమిషన్ వేసి, ఆకమిటీ సిఫార్సు లను జీవోలరూపంలో అమలుచేశారు. ఆ జీవోలను జగన్మోహన్ రెడ్డి ఎందుకు అమలు చేయడం లేదో దళితులు ఆలోచించాలి.
దళితజాతిని దూషిస్తూ, వారిహక్కులు, స్వేచ్ఛను కాలరాస్తుంటే, ఎన్నాళ్లు భరించాలి
వైసీపీ సోషల్ మీడియాకు చెందిన పంచ్ ప్రభాకర్ రెడ్డి, టీడీపీనేతలు వర్లరామయ్య, మహాసేన రాజేశ్ లపై ఇష్టమొచ్చినట్టు నోరుపారేసుకున్నాడు. వారిని వ్యక్తిగతంగా విమర్శించడమేకాకుండా, యావత్ దళితజాతిపై ప్రభాకర్ రెడ్డి ఉమ్మివేయడాన్ని ఏమ నాలి? ప్రజాస్వామ్యంలో తమభావప్రకటనను వెలిబుచ్చే హక్కు ప్రజలకు ఉంది. అలాం టి హక్కుల్ని కాలరాస్తూ యావత్ జాతినే దూషిస్తుంటే, ఇంకాచూస్తూ ఉండాలా?
ప్రభుత్వంలోని దళితమంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ పరిణామాలపై స్పందించా లి. ప్రభాకర్ రెడ్డి దూషించింది కేవలం ఒకరిద్దరు దళితుల్నికాదు…యావత్ దళితజాతి ని అని గుర్తించండి. దళితజాతి ఏమైనా చిన్నదా? 120కోట్ల జనాభాలో 20కోట్లకుపైగా దళితులున్నారు. ఏపీలోనే కోటికిపైగా దళితులున్నారు. ప్రజాస్వామ్యాన్ని శాసించే విషయంలో, ప్రభుత్వాల్ని కూలదోయడంలో దళితులంతా ఒక్కతాటిపైకి వస్తే, జగన్ అతని ప్రభుత్వంలాంటి ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోవడం తథ్యం.
జాత్యహంకారంతో విర్రవీగిన డొనాల్డ్ ట్రంపే అధికారం కోల్పోయాడు. దళితులు కన్నెర్రచేస్తే ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఎంత?
హార్వర్డ్ ప్రొఫెసర్ జాన్ లెవస్కీ ‘హౌ డెమోక్రసీ ఈజ్ డై’ (ప్రజాస్వామ్యం ఎలా చనిపో తుంది) అనే పుస్తకంరాశారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రభుత్వనేత నిరం కుశచర్యలవైపు మొగ్గి,అరాచకపాలన ప్రారంభిస్తే, ఏప్రజలైతే ఎన్నుకున్నారో, ఆ ప్రజ ల గొంతునే అణచివేయాలనిచూస్తే వారే ఆ ప్రభుత్వంపై, పాలకులపై తిరగబడతారు అని ఆయన తనపుస్తకంలో అభిప్రాయపడ్డారు.
జాన్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి గొం తునొక్కే ప్రయత్నంచేసినందుకే డొనాల్డ్ ట్రంప్ తనఅధికారాన్ని కోల్పోయాడు. అలాం టివారితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రభుత్వం పెద్దవేంకావు. రాష్ట్రంలో దళితులపై జరిగే దారుణాలు, ప్రభాకర్ రెడ్డి లాంటివారి వ్యాఖ్యలపై ప్రతిదళితుడు ఆలోచించాలి.
దళితుడిగా పుట్టిన ప్రతిబిడ్డ, తనజాతికి జరిగిన అవమానంపై ఆత్మపరిశీలనచేసుకొని తగిన నిర్ణయం తీసుకోవాలి. వైసీపీప్రభుత్వంపై దళితులు తీవ్రఆగ్రహావేశాలతో ఉన్నారని పసిగట్టిన పాలకులు కావాలనే ప్రభాకర్ రెడ్డిలాంటి వారితో మాట్లాడించి, దళితజాతిని దారిమళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.” అని రామాంజనేయులు స్పష్టం చేశారు.